ఎపి పంచాయతీ ఎన్నికలు వాయిదా: హైకోర్టు

ప్రజారోగ్యం దృష్ట్యా ఆంధ్రప్రదేశ్  ఎన్నికల ఎమిషన్ విడుదల చేసిన పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ ని   హైకోర్టు  సస్పెండ్ చేసింది.

దీనితో రాష్ట్రంలో కమిషన్ కు ప్రభుత్వానికి మధ్య చెలరేగిన వివాదం సద్దమణిగినట్లే. ఒక అనూహ్య సంక్షోభానికి తెరపడింది. ఎందుకంటే,  కరోనా పరిస్థితులు రీత్యా ఎన్నికల కమిషన్ విడుదల చేసిన నోటిఫికేషన్ ను గౌరవించలేమని,  ఎన్నికల్లో పాల్గొనలేమని ప్రభుత్వం స్పష్టం  చేసింది.తర్వాత ఉద్యోగుల సంఘాలు కూడా ఎన్నికలను బహిష్కరించాయి. కమిషన్ మాత్రం ఎన్నికలు నిర్వహించాలనే ముందుకు వెళ్తున్నది. రాష్ట్రమంతా ఎన్నికల కోడ్ కూడా అమలు చేస్తున్నది. దీనితో  రాజ్యాంగ సంక్షోభం ఏర్పడే పరిస్థితి ఎదురయింది.

ఇలాంటపుడు పంచాయతీ ఎన్నికల షెడ్యూల్‌ను  హైకోర్టు సస్పెండ్ చేసింది. కేంద్రం జనవరి 16 నుంచి కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమం ప్రకటించింది. ఇది చాలా పెద్ద ఎత్తున జరుగుతున్నది. రాష్ట్ర యంత్రాంగా ఇందులో పాల్గొని విజయవంతం చేయాల్సింది. దీనిని హైకోర్టు పరిగణనలోనికి తీసుకున్నట్లు కనిపిస్తుంది.

ప్రజారోగ్యం దృష్ట్యా ఎన్నికల షెడ్యూల్ సస్పెండ్ చేస్తున్నట్లు హైకోర్టు తెలిపింది.

రాష్ట్రంలో కరోనా  వ్యాక్సినేషన్‌కు ఏర్పాట్లు జరుగుతున్నాయని, ఈ వ్యాక్సినేషన్ కార్యక్రమానికి  ఆటంకం కలగకూడదనే షెడ్యూల్‌ సస్పెండ్ చేస్తున్నామని హైకోర్టు పేర్కొంది.

ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ జారీన నోటిఫికేషన్ ను సవాల్ చేస్తూ  రాష్ట్ర ప్రభుత్వం పిటిషన్ వేసింది.దీనిని ఈ రోజు హైకోర్టు విచారణకు స్వీకరించింది.

ప్రభుత్వం తరఫున వాదనలు  అడ్వకేట్‌ జనరల్‌ వాదనలు వినిపిస్తే,   ఎస్‌ఈసీ తరఫున  అశ్వినీకుమార్‌ హాజరయ్యారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *