నిమ్మగడ్డ రమేష్ కుమారే స్టేట్ ఎన్నికల కమిషనర్ : హైకోర్టు, ఎపికి మరొక కోర్టు దెబ్బ

నిమ్మగడ్డ రమేష్ కుమార్ ను ఏపి ఎన్నికల కమీషనర్ గా కొనసాగించాలని హైకోర్టు తీర్పు నిచ్చింది. రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాలను వరసబెట్టి గత వారంరోజులుగా హైకోర్టు కొటివేస్తున్నది. రెండు రోజుల కిందట మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ ఎబి వెంకటేశ్వరరావును సస్పెండ్ చేయడాన్ని హైకోర్టు కొట్టి వేసింది. ఆయన ఉద్యోగం లోకి తీసుకోవాలని చెప్పింది.
రాష్ట్ర ఎన్నికల కమిషన్ సంస్కరణ పేరుతో  నిబంధనలు మారుస్తూ తెచ్చిన ఆర్డినెన్స్‌ను ఈ రోజు  కొట్టివేస్తూ  ఆర్టికల్‌ 213 ప్రకారం ప్రస్తుత పరిస్థితుల్లో ఆర్డినెన్స్‌ ఇచ్చే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి లేదని హైకోర్టు పేర్కొంది.
రమేశ్‌కుమార్‌ ఎన్నికల కమిషనర్‌గా తక్షణం విధుల్లోకి వస్తారని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ జీకే మహేశ్వరి నేతృత్వంలోని ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది.

https://trendingtelugunews.com/telugu/breaking/nimmagada-ramesh-kumar-takes-charge-as-sec-after-hc-order/

ప్రభుత్వం  తొలగించిన రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్  విధుల్లో కొనసాగుతున్నట్లే నని కోర్టు పేర్కొంది.
 రమేష్ కుమార్ మరొ క ఏడాది పాటు సర్వీసు ఉన్నా, రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల కమిషన్ పదవీ కాలాన్ని మూడేళ్లకు కుదించింది. అంతేకాదు, ఆయన స్థానంలో మాజీ న్యాయమూర్తి కనకరాజు నియమించింది.

https://trendingtelugunews.com/uncategorized/centre-and-states-failed-to-provide-food-and-water-to-migrant-worker-till-supreme-court-issued-order/

ఈ ఆర్డినెన్స్ చెల్లదని రమేష్ కుమార్ హైకోర్టులో పిటిషన్ వేశారు. ఆయనతోపాటే, రాష్ట్ర ఎన్నికల కమిషన్ ను సంస్కరించే పేరుతో కమిషనర్ పదవీ కాలాన్ని మూడేళ్లకు కుదిస్తూ వచ్చిన ఈ ఆర్డినెన్స్ మరికొంత మంది కూడా సవాల్ చేశారు.వీరిలో మాజీ మంత్రి,బిజెపి నేత డాక్టర్ కామినేని శ్రీనివాస్ ఒకరు.
 ఆర్డినెన్స్ లోని మరొక ముఖ్యాంశం, రిటైర్డ్ ఐఎఎస్ అధికారిని కాకుండా రిటైర్డు న్యాయమూర్తిని ఈ  పోస్టుకునియమించాలనుకోవడం. ఈ నిర్ణయాల వెనక రాజకీయ దురుద్దేశాలున్నాయని పిటిషనర్లుంతా వాదించారు. దానికి తోడు ఆర్డినెన్స రాజ్యంగ వ్యతిరేకమని కూడా వారు వాదించారు.
కోవిడ్ కారణంగాదేశంలో పరిస్థితులు మారిపోవడంతో రమేష్ కుమార్ పంచాయతీ ఎన్నికలను ఆరువారాలు వాయిదా వేయడంతో రాష్ట్రప్రభుత్వానికి, కమిషన్ కు వివాదం మొదలయింది. దీనితో కమిషనర్ ఏకంగా తొలగించేందుకు చర్యలు మొదలయ్యాయి. ఉన్నట్లుండి రాష్ట్ర ప్రభుత్వం ఈ ఆర్డినెన్స్క కు తీసుకువచ్చి రమేష్ కుమార్ ను తొలగించడం రాష్ట్రంలో బాగా చర్చీనీయాంశమయింది.
ఇది చెల్లదని చెబుతూ ఒక పిల్  హైకోర్టు లో దాఖలయింది. దీని వాదోపవాదాలు విన్న తర్వాత కోర్టు ఈ రోజు ఆయనను ఎన్నికల కమిషనర్ గా పునర్నియమిస్తూ తీర్పు ఇచ్చింది.
ఒక పిటిషనర్ కామినేని శ్రీనివాస్ కామెంట్స్

రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడిందని పిటిషనర్‌, మాజీ మంత్రి,బిజెపి నాయకుడు కామినేని శ్రీనివాస్‌ వ్యాఖ్యానించారు. హైకోర్టు తీర్పు అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. కామినేని శ్రీనవాస్ వ్యాఖ్యలు
నేను బిజెపి జాతీయ అధ్యక్షుడు  జేడీ నడ్డా అనుమతితోనే పిటిషన్ వేశాను. కరోనా నేపథ్యంలో ఎస్ఈసీ ఎన్నికలు వాయిదా వేశారు. ఎవరైనా ఏదైనా చేసినప్పుడు ఇకనైనా జగన్ పాజిటివ్‌ గా తీసుకోవాలి. ఎస్‌ఈసీ విషయంలో నిబంధనలు మారుస్తూ ఏపీ ప్రభుత్వం తెచ్చిన ఆర్డినెన్స్‌ను హైకోర్టు కొట్టేసింది. రమేశ్ కుమార్‌ను తిరిగిన నియమించాలని కోర్టు కీలక ఆదేశాలు జారీ చేయడం హర్షనీయం.  కరోనా విజృంభణ జరుగుతోన్న సమయంలో ఆ విషయాన్ని తీసిపారేస్తూ ఏపీ ప్రభుత్వం మొదట్లో వ్యవహరించిన తీరు తీవ్ర అభ్యంతరంగా ఉంది.
జంధ్యాల రవిశంకర్ కామెంట్స్
హైకోర్టు తీర్పు మీద న్యాయవాది జంధ్యాల రవిశంకర్‌ వ్యాఖ్యానిస్తూ తక్షణం   నిమ్మగడ్డ రమేశ్‌కుమార్‌ ఎలక్షన్‌ కమిషనర్‌గా నియమితులవుతారని అన్నారు. ఎన్నికల కమిషనర్‌గా జస్టిస్ కనగరాజు కొనసాగడానికి వీల్లేదని చెబుతూ ఆర్డినెన్స్‌ రద్దు కావడంతో నిమ్మగడ్డ రమేశ్‌ కుమార్‌ ఎస్‌ఈసీగా కొనసాగుతున్నట్టేనని చెప్పారు.
సిపిఐ  పార్టీ  రామకృష్ణ స్పందన
నిమ్మగడ్డ రమేష్ కుమార్ ను రాష్ట్ర ఎన్నికల కమిషనర్ గా కొనసాగించాలని హైకోర్టు తీర్పు ఇవ్వడంపట్ల సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ హర్షం వ్యక్తం చేశారు. ఎస్ ఈ సి తొలగింపు అంశంపై ఏపీ సర్కార్ తెచ్చిన జీవోలు హైకోర్టు కొట్టేయడం హర్షణీయమని, స్థానిక ఎన్నికల ప్రక్రియ తిరిగి నామినేషన్ల ప్రక్రియ నుండి మొదలుపెట్టాలని కోరుతున్నామని ఆయన అన్నారు.