డాక్లర్ సుధాకర్ అరెస్టు మీద సిబిఐ విచారణ ఆదేశించిన హైకోర్టు

సంచలనం సృష్టించిన డాక్టర్ సుధాకర్ అరెస్టు  వ్యవహారం పైఆంధ్రప్రదేశ్ హైకోర్టు  సీబీఐ విచారణకు ఆదేశించింది. డాక్టర్ సుధాకర్ విశాఖ జిల్లా నర్సీపట్నం ఆసుపత్రి సూపరింటెండెంట్. ఆయన ఎనస్థీయాలసిస్టు.  ఆయనను  ఆ మధ్య ప్రభుత్వం సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే.  తర్వాత విశాఖ పోలీసులు ఆయన అత్యంత అవమానకరంగా ఆరెస్టు చేసికొట్టి, తాళ్లతో బంధించి  ఈడ్చుకుంటూ నాలుగో టౌన్ పోలీస్ స్టేషన్ కు తీసుకు వెళ్లిన సంగతి తెలిసిందే.
తెలుగు దేశం పార్టీ మహిళా అధ్యక్షురాలు ఈ మొత్తం సంఘటన మీద హైకోర్టు కు లేఖరాశారు. కోర్టు దీనిని సుమోటు గా విచారణకు స్వీకరించింది. ఒక వైద్యుడిని పోలీసులు దారుణంగా ప్రవర్తించి అరెస్టు చేశారని, ఆయననుటెర్రరిస్టు లాగ తాళ్ల తో బంధించి అరెస్టు బహిరంగంగా కొట్టీ ఈడ్చుకుంటూ తీసుకెళ్లారని ఆమె కోర్టుకు ఫిర్యాదు చేశారు. కోర్టు తర్వాత దీని మీద కోర్టు సొంతంగా నివేదికను తెప్పించుకుని ఈ రోజు సిబిఐ విచారణకు ఆదేశించింది.

https://trendingtelugunews.com/english/trending/ima-writes-to-cm-jagan-for-fair-probe-into-dr-sudharkars-arrest/

ఈ హేయమయిన సంఘటనలో విశాఖ పోలీసుల తీరుమీద  కేసు నమోదు చేసి విచారణ జరపాలని సీబీఐకి ఆదేశించింది..
8 వారాల్లోగా విచారణ పూర్తిచేసి నివేదిక ఇవ్వాలని సీబీఐకీ ఆదేశాలిచ్చింది.

https://trendingtelugunews.com/english/trending/ima-takes-objection-to-branding-dr-sudharkar-as-mentally-ill/

డా.సుధాకర్‍ శరీరంపై గాయాలున్నాయని..మేజిస్ట్రేట్ ఇచ్చిన నివేదికలో ఉంది.
ప్రభుత్వం ఇచ్చిన నివేదికలో డాక్టర్ సుధాకర్ గాయాల గురించి పేర్కొనలేదు.

https://trendingtelugunews.com/telugu/breaking/vizag-police-commissioner-rk-meena-clarification-on-dr-sudhakar-arrest/

ప్రభుత్వ నివేదికను కోర్టు నమ్మడం లేదు. దీని వెనుక భారీ కుట్ర ఉందని భావిస్తున్నామని కోర్టు భావించింది.
అందుకే సీబీఐ విచారణ అని పేర్కొంది.
నర్సీపట్నం ప్రభుత్వం పనిచేస్తున్న డాక్టర్ సుధాకర్ అమధ్య కోవిడ్ చికిత్స చేస్తున్న డాక్టర్ ను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని, వాళ్లకి సరైన మాస్కులు గాని, పిపిఇలు గాని ఇవ్వడం లేదని,దీనితో డాక్టర్లు ప్రమాదంలో పడుతున్నారని  అభిప్రాయం వెలిబుచ్చారు. ఈ దోరణి వల్ల విసుగు చెందిన డాక్టర్ సుధాకర్ ప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శించారు. ముఖ్యమంత్రి జగన్ ను కూడా ఆయన విమర్శించారు. తర్వాత ప్రభుత్వం ఆయనను సస్పెండ్ చేసింది. దీనిని విచారణ జరిపి తదుపరి చర్య తీసుకోలేదు.
దీనికి నిరసనా ఆయన ఈ నెల 16న విశాఖ బీచ్ రోడ్డు ఆసుపత్రి వద్ద వంటరిగా నిరసన తెలిపారు. నిరసనగా గుండు గీయించుున్నారు. రోడ్డు మీద పడుకున్నారు. దీనిమీద ఆసుపత్రి వారు టెలిపోన్ చేసి ఫిర్యాదు చేశారని పోలీసుల రంగంంలో దిగారు. అపుడు డాక్టర్ సుధాకర్ పోలీసులను దర్భాషలాడారు.అలాగే ముఖ్యమంత్రి మీద కూడా పరుష పదజాలం ప్రయోగించారు. దీనికి పోలీసుల అతనిని బల ప్రయోగంతో అదుపులోకి తీసుకున్నారు. చేతులు వెనక్కి విరిచికట్టారు. ఒకరిద్దరు పోలీసులు ఆయన తన్నారు.  ఆయన మీద 353, 427 సెక్షన్ల ప్రకారం కేసులు కూడా పెట్టారు. ఈడ్చుకుంటూ పోలీస్టేషన్ కు తీసుకు వెళ్ళారు. తొలినుంచి ఆయన మతిభ్రమించిందనే ముద్ర వేయడం మొదలుపెట్టారు. బహుశా పిచ్చి డాక్టర్ ఉద్యోగానికి పనికిరాడని చెప్పేందుకు పోలీసులాడుతున్న నాటకమనే విమర్శ వచ్చింది.
తెలుగు దేశం పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ వ్యాఖ్య