కొడుకు మీద ప్రేమయే కారణమా? ఆంధ్రా మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ సస్పెన్షన్

అమరావతి: ఆంధ్రప్రదేశ్ ఇంటెలిజెన్స్ మాజీచీఫ్ ఏబీ వెంకటేశ్వరరావును సర్వీసు నుంచి ప్రభుత్వం సస్పెండ్ చేయడం వెనక కొడుకు నడిపే కంపెనీకి సాయం చేయాలనే ఆదుర్దా ఉందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.
వెంకటేశ్వరరావు గత ప్రభుత్వంలో చంద్రబాబు కళ్లు చెవులుగా పనిచేసిన అధికారి. చాలా పలుకుబడి ఉన్న అధికారిగా ఆయనకు పేరుండేది. వెంకటేశ్వరరావు, ముఖ్యమంత్రి కార్యాలయంలో పనిచేసిన మరొక ఐఎఎస్ అధికారి ఎమ్మెల్యేల ఫిరాయింపులలో కీలకపాత్ర పోషించారని, ప్రభుత్వంలో వారేం చెప్పినా చెల్లుబాటయ్యేదని చెబుతారు.
ఆ ఐఎఎస్ అధికారి మాత్రం క్షేమంగా ఉన్నారు. ఆయనకు ప్రభుత్వంలో మంచిపోస్టు కూడా లభించింది. అయితే వెంకటేశ్వరరావు వ్యవహారాలు బయకు వచ్చాయి.
తన కుమారుడు సాయి చేతన్ కృష్ణ నడిపే కంపెనీ ద్వారా కొన్నికీలకమయిన భద్రత పరికారలను కొనుగోలుచేశారని ఆయన మీద ఆరోపణ వచ్చింది. కుమారుడి కంపెనీ ఆకాశం అడ్వాన్సుడ్ సిస్టమ్స్ ప్రయివేటు లిమిటెడ్ , ఇలాంటి పరికరాలు తయారు చేసే ఇజ్రేల్ కంపెనీ ఆర్ టి ఇన్ ప్లేటబుల్స్ తరఫున పనిచేసేదని చెబుతున్నారు.
ఈ ఇజ్రేల్ కంపెనీ కి రాష్ట్రప్రభుత్వం ఇంటెలిజెన్స్ ప్రొటొకోల్ విస్మరించి అనేక కీలకమయిన సమాచారాన్ని అందించారని ప్రభుత్వం భావిస్తుంది. ఇది దేశ ద్రోహనేరం కూడా అవుతుందని చెబుతున్నారు. ఇలా నియమాలను ఉల్లంఘించి పరికరాలు కొనుగోలు చేసినందుకే ఆయనను సస్పెండు చేస్తున్నట్లు ప్రభుత్వ ప్రధాక కార్యదర్శి నీలమ్ సాహ్ని నిన్న రాత్రి పొద్దు పోయాక విడుదల చేసిన ఉత్తర్వులలో పేర్కొన్నారు.
ఒక సీనియర్ అధికారి ఇలా కుమారుడికి చెందిన సంస్థ నుంచే పోలీసులు వినియోగించే కీలకమైన నిఘా పరికరాలను కొనుగోలు చేసే ఒప్పందం కుదుర్చుకోవడం అఖిల భారత సర్వీసు నిబంధనలను ఉల్లంఘించడమేనని ప్రభుత్వం స్పష్టం పేర్కొంది. తనకుమారుడికి ఆర్థిక లాభం చేకూర్చేందుకు వెంకటేశ్వరావు ఉద్దేశపూర్వకంగానే ఇజ్రేల్ కంపెనీకి కొన్ని కలకమయిన భద్రతా రహస్యాలను వెల్లడించారని, ఇది ప్రమాదకరమయిన చర్య అని రాష్ట ప్రభుత్వం వర్గాలు చెబుతున్నాయి.
కుమారుడి కంపెనీకి సాయం చేసేందుకు ఆయన కాంట్రాక్టు నిబంధనలు, క్వాలిటి స్పెసిఫికేషన్స్ ను సడలించాలరని కూడాచెబుతున్నారు. అంతేకాదు, బిడ్డింగు లో పాల్గొన్న కంపెనీలు చాలా నాసిరకం పరికరాలు చూపించినందున ఇవన్నీ కూడా డమ్మీ కంపెనీలనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
పరికరాలను సరఫరా చేసేందుకు ఎక్స్ ప్రెషన్ ఇంటరెస్టును ఆహ్వానించలేదుని, పరికరాల టెక్నికల్ పనికొస్తాయాలేదా అనినిర్ధారించేనియమాలను కూడా రూపొందించలేదని, ముఖ్యంగా ఇలాంటి పరికరాలు తెప్పించుకునేందుకు అవసరమయిన లైసెన్సులను కేంద్ర హోం శాఖ, పౌర విమాన శాఖ, రక్షణ శాఖ, టెలికామ్ నుంచి పొందనే లేదని కూడా ప్రభుత్వం దృష్టికి వచ్చింది.
వెంకటేశ్వరరావు ఇంటెలిజెన్స్ ఛీప్ గా కాకుండా తెలుగుదేశంపార్టీ నాయకుడిగా ప్రవర్తిస్తున్నాడని  2019ఎన్నికల ముందు వైఎస్ ఆర్ సిపి ఫిర్యాదు చేయడంతో ఎన్నికల కమిషన్ ను ఆయన విధుల నుంచి తప్పించింది.