Home Breaking ఎపిలో కనివిని ఎరుగని పరిస్థితి, ఎన్నికలను వ్యతిరేకిస్తున్నఉద్యోగులు…

ఎపిలో కనివిని ఎరుగని పరిస్థితి, ఎన్నికలను వ్యతిరేకిస్తున్నఉద్యోగులు…

125
0

ఉద్యోగులకు కరోన వ్యాక్సిన్ ఇచ్చేవరకు తాత్కాలికంగా పంచాయితీ ఎన్నికలు నిలుపుదల చేయండి. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి వినతిపత్రం అందచేసిన ఏపీ జెఏసి అమరావతి ఉద్యోగుల సంఘం.

నేడు  AP JAC అమరావతి ఛైర్మన్ బొప్పరాజు & వైవీ రావు నాయకత్వంలో వివిధ సంఘాల నాయకులు పంచాయితీ ఎన్నికల నిర్వహణపై ఉద్యోగులకున్న అభ్యంతరాలను 9 పేజీల లేఖలో సమర్పించటం జరిగింది.

ఇలా ఎన్నికల కమిషన్ నిర్ణయానికి వ్యతిరేకంగా ఉద్యోగులు దాదాపు ఉద్యమం లాగా క్యాంపెయిన్ చేయడం గతంలో ఎపుడు జరగలేదు. ఈ సారి ప్రభుత్వం, ఉద్యోగులు ఒకే పక్షాన చేరి, ఆంధ్రప్రదేశ్ ఎన్నికల కమిషన్ నిర్ణయాన్ని వ్యతిరేకించడం జరగుతు ఉంది. ఇది రాష్ట్రఎన్నికల చరిత్రలోనే వింత.కనివినిఎరుగనిది. ఉద్యోగులకు ఇంత తెగింపు ఎలా వచ్చిందనేది రాష్రంలో బాగా చర్చనీయాంశమయింది. రూలింగ్ వైసిపికి, అపోజిషన్  తెలుగుదేశం పార్టీకిసాగుతన్న పొలిటికల్ క్లాష్  రకరకాల రూపాలు తీసుకుంటూ ఉంది. ఇది పంచాయతీ ఎన్నికల దాకా విస్తరించింది. ఇందులో ఉద్యోగులు కూడా కమిషన్ నిర్ణయాన్ని కరోనానుంచి భద్రత అంటూ వ్యతిరేకిస్తూన్నారు. ఎన్నికలు జరపడానికి అభ్యంతరాలు తెలుపుతున్నారు.  ఉద్యోగుల అభ్యంతరాలు ఇవే:

◆ ప్రపంచాన్ని గడగడలాడించిన పెద్ద విపత్తుకు ప్రైవేటు రంగం భయపడి పక్కన వున్న పరిస్తుతలలో ప్రభుత్వ ఉద్యోగులే ఫ్రంట్ లైన్ వారియర్స్ గా ఉండి తమ ప్రాణాలను సైతం లెక్కచేయకుండా ప్రజలకు అండగా ఉన్నాం.

◆ ఈ రాష్ట్రంలో కరోనాని ఎదుర్కొన్న ఘనత ప్రభుత్వ ఉద్యోగులదే. అయితే కేంద్ర ప్రభుత్వం వ్యాక్సిన్ ను ముందుగా దేశంలోని ఫ్రంట్ లైన్ వారియర్స్ అనగా ప్రభుత్వ డాక్టర్లు, పారా మెడికల్ స్టాఫ్, సానిటరీ వర్కర్స్, పోలీసులకు పంపిణీ చేయాలని ఈ నెల 16వ తేదీ నుండి మొదలు పెట్టగానే, వెంటనే రాష్ట్ర ఎన్నికల అధికారి ప్రభుత్వ అభ్యర్ధనను, ఉద్యోగుల ఆందోళనను పెడచెవిన పెట్టి ఎన్నికల నిర్వహణకు సిద్ధమవడం చాలా బాధాకరం. ఎన్నికల ప్రక్రియ ఒకరోజులో పూర్తి అయ్యేది కాదు. కనీసం నెల రోజులపాటు నిత్యం ఉద్యోగులతో, ఓటర్లతో మమేకం అవ్వాలి.

◆ లక్ష నలభైవేల పోలింగ్ కేంద్రాలు పరిశీలించాలి. బ్యాలెట్ బాక్సులు, సరంజామా మొత్తం తీసుకోవాలి. ఎక్కడైనా కరోనా బారిన పడచ్చు. నాలుగు లక్షల పీపీఈ కిట్లు ఎలా తెస్తారు. కరోనా తీవ్రంగా ఉన్నప్పుడే పి పి ఈ కిట్లు సప్లై చేయలేకపోయారు. పి పి ఈ కిట్లు వాడినప్పటికి డాక్టర్లు కూడా చనిపోయిన పరిస్థితిని వివరించటం జరిగింది.

◆ తెలంగాణాలో మునిసిపల్ ఎన్నికలు జరిపితే ముప్ఫై శాతం ఓటింగ్ దాటలేదు. ప్రజలు కరోనా నేపధ్యంలో ఓటింగ్ కు రావటానికి భయపడే పరిస్తుతులు. పంచాయితీ ఎన్నికలంటే వందశాతం పోలింగ్ ఆశిస్తారు

◆ ప్రభుత్వం తరపున స్వయంగా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి గారే SEC గార్ని కలసి ప్రస్తుత పరిస్తుతలలో ఎన్నికల నిర్వహణ కుదరదని అన్నప్పుడు ఎస్ఈసీ ఎందుకు పంతం పడుతున్నారో చెప్పాలి.

◆ వ్యాక్సిన్ రెండు డోసులు ఇస్తే కానీ పని చేయదు అని శాస్త్రవేత్తలే చెప్పారు. రెండు డోసుల వ్యాక్సిన్ ప్రతీ ఉద్యోగికి అందే వరకూ ఎన్నికలు జరగకుండా చూడాలని ప్రధాన కార్యదర్శి గారిని కోరాం.

◆ రాష్ట్ర SEC గారు ఉద్యోగుల పట్ల ఎందుకు ఇంత కఠిన వైకిరి అవలంభిస్తున్నారో మాకు తెలియడం లేదు. వారి సొంత కార్యాలయం ఉన్నతాధికారులను సహితం వదలకుండా ఒక్కనెల రోజులు సెలవు పెట్టారని ఏకైక కారణంగా ఉద్యోగం నుండి జాయింట్ డైరెక్టర్ స్థాయి వ్యక్తిని తొలగించడం జరిగింది. ఒక సీనియర్ IAS అధికారి అని కూడా చూడకుండా స్టేట్ ఎలక్షన్ కమిషన్ రాష్ట్ర సెక్రటరీ గారిని అకస్మాత్తుగా ప్రభుత్వానికి సరెండర్ చేసారు. ఇద్దరు సీనియర్ Asst సెక్రటరీ స్థాయి గల అధికారులను సహితం వారిపై ఎందుకు శాఖాపరమైన చర్యలు తీసుకోకూడదో తెలపాలని వారికి showcause నోటీసులు జారీ చేశారు. దానితో అధికారులు, ఉద్యోగులు అందరూ భయబ్రాంతులకు గురి అయ్యారు.

◆ కావున మా 9 పేజీల వినతిపత్రం లో పొందుపరిచిన విషయాలు, మాకున్న అభ్యన్తరాలు, బాధలు అన్నియు దృష్టిలో ఉంచుకోవాలని, మా ఉద్యోగుల ప్రాణాలను పణంగా పెట్టకుండా ప్రతి ఉద్యోగికి రెండు డోసుల వ్యాక్సిన్ అందించిన వెంటనే రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలకు నిరవహించడానికి మాకెలాంటి అభ్యంతరాలు లేవని ఈ విషయాలని సుప్రీంకోర్టు దృష్టికి మా ఉద్యోగుల తరపున రాష్ట్ర ప్రభుత్వం తీసుకు వెళ్లి తాత్కాలికంగా పంచాయతీ ఎన్నికలు వాయిదా వేయించాలి అని, తద్వారా హైకోర్టు సింగల్ జడ్జి గారు తన జడ్జిమెంట్ లో వెలిబుచ్చినట్లు రాజ్యాంగంలోని Art.14&21 ఉల్లంఘన జరుగకుండా చూడాలని కోరుతూ, హైకోర్టు ఉత్తర్వులు ప్రకారం వ్యాక్సిన్ పంపిణీ, ఎన్నికల నిర్వహణ రెండు ఒకేసారి జరపడం ఒకే ఉద్యోగులకు ఎలా కుదురుతుందనే విషయాన్ని కూడా పరిగణలోనికి తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి గారిని AP JAC అమరావతి పక్షాన కొరదమైనది.

◆ సానుకూలంగా స్పందించిన రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి గారు స్పందిస్తూ ఉద్యోగ సంఘాల సూచనలను ఖచ్చితంగా పరిశీలిస్తామని తెలియచేసిన గౌరవ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి గారికి AP JAC అమరావతి పక్షాన కృతజ్ఞతలు తెలియచేసారు.

◆ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి గారిని కలసిన నాయకులు JAC ఛైర్మన్ బొప్పరాజు గారు, సెక్రటరీ జనరల్ మరియు RTC ఎంప్లాయిస్ యూనియన్ అధ్యక్షుడు వై వి రావు గారు, కోశాధికారి మరియు రాష్ట్ర పంచాయతీ రాజ్ ఇంజినీర్ల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వి వి మురళీకృష్ణ నాయుడు, కో చైర్మన్స్ మరియు రాష్ట్ర FAFTO (టీచర్ల సంఘాల jac) చైర్మన్ మరియు రాష్ట్ర Headmasters Assn అధ్యక్షుడు జి వి నారాయణరెడ్డి గారు, రాష్ట్ర పోలీసు అధికారులు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జనకుల శ్రీనివాసరావు గారు, labour ఆఫీసర్స్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బి కిషోర్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here