చంద్రబాబు అవినీతి పై సిబిఐ దర్యాప్తు : క్యాబినెట్ సబ్ కమిటి సిఫార్స్

చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని గత  తెలుగుదేశం  ప్రభుత్వ హయాంలో చోటు చేసుకున్న అనేక అవకతవకలపై విచారణ జరిపించాలని క్యాబినెట్ సబ్ కమిటి సిఫార్సు చేసింది.
చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నపుడు తీసుకున్న అనేక నిర్ణయాలలో భారీగా అవినీతి జరిగిందని  ముఖ్యమంత్రి తొలి నుంచి చెబుతూ వస్తున్నారు.  దాని మీద దర్యాప్తుజరిపిస్తానని కూడా చెబుతూ వచ్చారు. చివరకు ఒక క్యాబినెట్ సబ్ కమిటీని నియమించి ఈ ఆరోపణలను పరిశీలించాలని కోరారు.
గత ఏడాది జూన్ 26వ తేదీన ముఖ్యమంత్రి ఏ క్యాబినెట్ సబ్ కమిటీ నియమించారు. నిజానికి ఈకమిటీ 45 రోజుల్లో నే నివేదిక సమర్పించాల్సి ఉండింది. తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో తీసుకున్న సుమారు 30 నిర్ణయాల్లో జరిగిన అవినీతిని పరిశీలించి తీసుకోవలసిన చర్య ల గురించి ప్రభుత్తానికి ఈ కమిటి నివేదిక సమర్పించాలి.
కమిటీ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, పంచాయతీ రాజ్ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, వ్యవసాయ మంత్రి కె కన్నబాబు,  జలవనరుల శాఖ  మంత్రి పి అనిల్ కుమార్, ఐటి మంత్రి ఎం గౌతమ్ రెడ్డి సభ్యులుగా ఉన్నారు.
అమరావతి ఏరియాలో కృష్ణా నది ఒడ్డున నిర్మించిన ప్రజావేదికను కూల్చేసిన రెండు రోజులతర్వాత ఈ క్యాబినెట్ కమిటీ ఏర్పాటును ముఖ్యమంత్రి ప్రకటించారు.
ఈ క మిటీ ఈ  రోజు తన దర్యాప్తు నివేదికను  సియం జగన్మోహన్ రెడ్డికి అందజేసింది.

చంద్రబాబు ప్రభుత్వంలో అవినీతిపై సీబీఐ చేత  దర్యాప్తు జరిపించాలని మంత్రివర్గం ఉపసంఘం సిఫారసు చేసినట్లు విశ్వసనీయ సమాచారం. ఇదే విధంగా  ఫైబర్‌ గ్రిడ్‌లో రూ.వెయ్యి కోట్ల టెండర్లలో అవినీతి జరిగిందని, చంద్రన్న కానుకలో అవినీతిపై ఆధారాలున్నాయని చెబుతూ వీటి మీద కూడా దర్యాప్తు జరిపించాలని ఉపసంఘం సిఫార్సు చేసినట్లు తెలిసింది.
హెరిటెజ్‌ నెయ్యి కొనుగోళ్లు,  ఫైబర్‌ గ్రిడ్‌లో టెరా సాఫ్ట్‌వేర్ లలో , వేమూరి రవిప్రసాద్‌ కేంద్రంగా అవినీతి జరిగినట్లు  సబ్‌ కమిటీ అభిప్రాయపడింది.
ఇది ఇలా ఉంటే ఈ రోజు క్యాబినెట్ రామాయంపేట ఓడరేవు నిర్మాణం చేపట్టాలని నిర్ణయించింది.
 రామాయపట్నం పోర్టుకు కేంద్రం నిధులపై కెబినెట్ లో చర్చించింది. విభజన హామీల్లో భాగంగా రామాయపట్నం పోర్టుకి కేంద్రం నిధులివ్వాల్సి ఉందని, అయితే, కేంద్ర నిధుల కోసం ప్రయత్నాలు చేస్తూనే ప్రాజెక్టునిర్మాణం చేపట్టాలని  కెబినెట్ నిర్ణయించింది.
ఐదు దశల్లో రామాయపట్నం పోర్టు ప్రాజెక్టు నిర్మాణం. మొదటి దశలో 4736 కోట్ల వ్యయంతో నిర్మాణంచేపడతారు.  రామాయపట్నం ఆగస్టు నాటికి టెండర్లు పిలవాలని అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు.
 అదేవిధంగా   రామాయపట్నం పోర్టు టెండర్లను జూడిషీయల్ ప్రివ్యూకి పంపాలని కూడా సీఎం జగన్ ఆదేశించారు. ఇలాగే,  10 వేల మెగావాట్ల సౌర విద్యుత్ ప్లాంట్ నిర్మాణానికి , డిస్కమ్, ట్రాన్స్కో లకు
6 వేల కోట్ల ఆత్మనిర్బర్ భారత్ నిధుల ఖర్చుకు కేబినెట్ ఆమోదం తెలిపింది.
16 నుంచి అసెంబ్లీ సమావేశాలు మూడు రోజుల పాటు నిర్వహించాలని కూడా క్యాబినెట్ నిర్ణయించింది.