అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల కోసం కార్పొరేషన్

ఏపీ.కేబినెట్ ఈ రోజు సమావేశంలో తీసుకున్న నిర్ణయాలివే…

* ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల కోసం ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని ఆంధ్రప్రదేశ్  ప్రభుత్వం నిర్ణయించింది. ఈ ప్రతిపాదనకు ఈ రోజు జరిగిన క్యాబినెట్ సమావేశం ఆమోదం తెలిపింది. క్యాబినెట్ నిర్ణయాలను మంత్రి పేర్నినాని వెల్లడించారు.  క్యాబినెట్ తీసుకున్న ఇతర నిర్ణయాలు:

* రాష్ట్రంలో ని చేనేత కుటుంబాలకు (ఇంట్లో మగ్గం పై ఇప్పటికీ నేస్తున్న వారికి) ఏడాదికి 24000 చొప్పున ఇవ్వడానికి కేబినెట్ ఆమోదం.

* ” వైఎస్సార్ నేతన్న నేస్తం” గా ఈ పథకానికి పేరు.

*సర్వే చేసి ఈ నెలాఖరు కల్లా అర్హుల జాబితా రెడీ చేసి డిసెంబర్ 21 నుండి పథకం అమలు.

* మత్స్యకారుల కోసం వారి వేట నిషేధ సమయంలో 10 వేల రూపాయల చొప్పున అందించాలని కేబినెట్ నిర్ణయం.

* బోట్లు ఉన్న వారికోసమే కాకుండా తెప్పలపై కూడా చేపల వేటకు వెళ్లే వారికి సైతం ఈ పథకం వర్తిస్తుంది.

* ఈ పథకం నవంబర్ 21 నుండి అమలు.

* మత్యకారుల బోట్లు కోసం ఆయిల్ పై 9 రూపాయలు సబ్సిడీ ఇవ్వడానికి నిర్ణయం. అందుకోసం జెట్టీల వద్దే బంకులు ఏర్పాటు చేస్తాం.ఈ పథకం కూడా నవంబర్21 నుండి అమలు.

* ముమ్మిడివరం వద్ద GSPC తవ్వకాల కారణంగా ఉపాధి కోల్పోయిన వారికి 16,654 కుటుంబాలకు చెల్లించాల్సిన 80 కోట్లు అందించేందుకు కేబినెట్ నిర్ణయం.

* 13 జిల్లాల్లో రక్షిత మంచినీటి కోసం వాటర్ గ్రిడ్ లను ఏర్పాటు చేస్తూ నిర్ణయం.

* మధ్యాహ్న భోజనం కార్మికులకు ఇచ్చే గౌరవ వేతనం 1000 నుండి 3000 రూపాయలకి పెంచాలని కేబినెట్ నిర్ణయం.

* పలాస లో 50 కోట్లతో నిర్మించే 200 పడకల కిడ్నీ ఆసుపత్రి కోసం 5 రెగ్యులర్ పోస్టులు,100.కాంట్రాక్ట్ పోస్టులు,60 ఔట్ సోర్సింగ్ పోస్టులకు మంత్రివర్గం ఆమోదం.

* ఎన్ రోల్ అయ్యి..మూడేళ్ళ లోపు ఉన్న జూనియర్ న్యాయవాదులకు నెలకు 5 వేల చొప్పున స్టైఫండ్ ఇవ్వాలని నిర్ణయం.ఈ పథకం డిసెంబర్ 3 (జాతీయ న్యాయవాదుల దినోత్సవం) నుండి అమలు.

* వివిధ కార్పొరేషన్ ల ద్వారా ఇసుక రవాణా,పౌర సరఫరాల రవాణా కు సంబంధించిన వాహనాలను sc st bc కాపు నిరుద్యోగ యువకులకు అందిస్తాం.దీనికి వైయస్సార్ ఆదర్శం అనే పేరు.

* APSRTC లో 3677 కాలం చెల్లిన బస్సులను తొలగించి కొత్త బస్సుల కొనుగోలు కోసం 1000 కోట్ల రూపాయల టర్మ్ లోన్ తీసుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం హామీ గా ఉంటుంది.

*చిరు ధాన్యాల..అపరాల బోర్డు లను విడి విడిగా ఏర్పాటు చేస్తాం.

* ఎలక్ట్రిసిటీ డిస్కం లకు ఊరట నిచ్చేలా 4741 కోట్ల రూపాయల మేర బాండ్లు విడుదల చేస్తాం.దీనికోసం ఏపీ పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ కు అనుమతి,CfO, కంపెనీ సెక్రటరీ ల నియామకానికి అనుమతి ఇవ్వాలని కేబినెట్ నిర్ణయం.

*గన్నవరం మండలం లోని కొండ పావులూరి లో NdRf కోసం 39.23 ఎకరాలు…ప్రకాశం జిల్లాలోని నడికుడి-శ్రీ కాళహస్తి బ్రాడ్ గేజ్ నిర్మాణానికి 350 ఎకరాలు..రేణిగుంట ఎయిర్ పోర్ట్ విస్తరణ కోసం 17 ఎకరాలు కేటాయింపు

* విశాఖ పట్నం నడిబొడ్డున గలా పరదేశి పాలెం లో ఆమోద పబ్లికేషన్స్ కి గత ప్రభుత్వం అతి చౌకగా కట్టబెట్టిన 1.5 ఎకరాల భూ కేటాయింపు రద్దు.ఈ భూమిని బలహీన వర్గాలకు ఇళ్ల స్థలాలు కోసం వాడాలని నిర్ణయం.

*దినపత్రికల అడ్వర్టైజ్ మెంట్స్ టారిఫ్ పెంచుతూ కేబినెట్ నిర్ణయం.