వైసిపి ఇసుక దందా మీద జగన్ చర్చకు రావాలి :ఎపి బిజెపి

 ఆంధ్రప్రదేశ్ లో అధికార, ప్రతిపక్షాలు మాటల తూటాలు పేల్చుతున్నారు, వాళ్ల వాళ్ల పాలనలో చేసిందేమిటో చర్చించేందుకు బహిరంగకు చర్చకు రావాలని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు విష్ణువర్ధన్ రెడ్డి సవాల్ విసిరారు.
వైసీపీ, టీడీపీలతో  బహిరంగ చర్చ కు  బీజేపీ ఆహ్వానిస్తున్నదని ఆయన చెప్పారు. రెండు పార్టీల మాటల్లో చిత్తశుద్ధి ఉంటే బహిరంగ చర్చకు రావాలి,  వేదికను విజయవాడలో బీజేపీ ఏర్పాటు చేస్తుంది. వాళ్లొచ్చి చర్చకు కూర్చుంటే చాలునని ఆయన అన్నారు.
ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సంవత్సరం పాలనలో ఏమి చేశారో బహిరంగ చర్చకు రావాలి.  జగన్మోహన్ రెడ్డి బిజీగా ఉంటే పార్టీ ప్రతినిధులను పంపవచ్చని ఆయన చెప్పారు. వైసిపి నేతలమీద, పాలన మీద ఆయన తీవ్రమయిన ఆరోపణలు చేశారు.
’ఇసుక అక్రమ వ్యాపారం వల్ల అధికార పార్టీ నేతలు పది వేల కోట్లు సంపాదిస్తున్నారు.రూ.500 కోట్లు ప్రభుత్వానికి ఆదాయం వస్తే అధికార పార్టీ నేతలుమిగతా సోమ్ము వేలకోట్లలో దోచేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి పాలన లో ఇసుకను కిలోల పద్దతిలో కొనాల్సివచింది,’ అని విష్ణువర్ధన్ రెడ్డి అన్నారు.
’అధికార పార్టీ నేతలు ఇసుక సంస్కరణల మీద బహిరంగంగా మాట్లాడుతున్నారు లోన అక్రమాలకు పాల్పడుతున్నారు. పేదలందరికి  ఇళ్లు అని  పట్టాల పట్టాల మాటలు చెబుతూ  అధికార పార్టీ నేతలు అక్రమాలకు పాల్పడుతున్నారు. ఈ అక్రమాల పై సిట్టింగ్ జడ్జి తో విచారణ చేయాలి ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలో అవినీతి ని ఏకీకృతం చేశారు,‘ అని ఆయన విమర్శించారు.
జగన్మోహన్ రెడ్డి సంవత్సరం పాలన లో ఒక్క ఇల్లు కూడా నిర్మించలేదు గాని, ప్రభుత్వ కార్యాలయాలకు మాత్రం పార్టీ జండా రంగులో జోరుగా వేస్తున్నారని ఆయన విమర్శించారు.
’ప్రభుత్వ కార్యాలయాల గోడల మీద రంగులు నింపడం మానుకొని ప్రజల జీవితాల్లో రంగులు వైసీపీ నింపాలి. జగన్మోహన్ రెడ్డి 365 రోజుల పాలనలో ఏమి చేశారో ప్రగతి నివేదికను వైట్ పేపర్ గా  బయటపెట్టాలి,’ అని ఆయన డిమాండ్ చేశారు.
రాష్ట్రంలో ప్రాంతీయ పార్టీలు ప్రజా వ్యతిరేక నిర్ణయాలు తీసుకుంటున్నారని,  రాష్ట్రంలో ప్రాంతీయ పార్టీల శఖం ముగుస్తున్నదని ఆయన అన్నారు.