పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా విజయవాడలో భారీ ర్యాలీ (వీడియో)

(షేక్ అహ్మద్)

పౌరసత్వ సవరణ చట్టం వెంటనే రద్దు చేయాలంటూ విజయవాడలో భారీ ప్రదర్శన

పౌరసత్వ సవరణ చట్టం కేంద్ర ప్రభుత్వం వెంటనే రద్దు చేయాలని అల్ మైనారిటీ అసోసియేషన్ నెట్ వర్క్(అమన్) ఆధ్వర్యంలో శుక్రవారం జిమ్ ఖాన గ్రౌండ్ నుండి ధర్నా చౌక్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు.
200 మీటర్ల జాతీయ జెండాను చేత పట్టుకొని బీఆర్టిఎస్ రోడ్డు మీదుగా ధర్నా చౌక్ వరకు ముస్లిం సోదరులు శాంతియుతాంగా ర్యాలీ గా వెళ్లారు.

మొదట  జిమ్ ఖాన గ్రౌండ్ లో భక్తి శ్రద్ధలతో ప్రత్యేక ప్రార్థనలు చేశారు.  70 ఏళ్లుగా భారత్‌లో పౌరులు ఐకమత్యంగా ఉంటున్నారని, ఈ చట్టం తేవాల్సిన అవసరం ఏముంది.ఈ చట్టం తో భారత్‌లో బీజేపీ అలజడి సృష్టిస్తోంది.
పౌరసత్వం విషయంలో ఇన్నేళ్లుగా ఏ సమస్యా లేదు, ఇప్పుడు కొత్తగా ఏం సమస్య వచ్చిందో చెప్పాలి. మతం ఆధారంగా పౌరసత్వాన్ని లాక్కునే ప్రయత్నం చేస్తున్నారు.
ఎప్పటికి భారత్ లౌకిక దేశంగానే ఉంటుంది. బిజెపి చేసిన చట్టం ముస్లింలకు వ్యతిరేకమైంది. రాజ్యాంగాన్ని ప్రేమించే ప్రతి ఒక్కరూ మన దేశాన్ని బీజేపి, ఆర్ఎస్ఎస్ నుండి కాపాడుకోవాల్సిన సమయం వచ్చింది. రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి పౌరసత్వ సవరణ చట్టం మన రాష్ట్రం అమలు చేయబోమని ప్రకటించారు. ప్రకటన కన్నా అసెంబ్లీలో తీర్మానం చేయాలి.  జగన్ తో పాటు నారా చంద్రబాబు, ఇతర పార్టీలు కూడా ఈ చట్టం రద్దు చేసే వరకు కేంద్రంతో పోరాటం చేయాలి. రాజ్యాంగాన్ని ప్రేమించే ప్రతి భారతీయుడు ఉండాలి.
ఈ కార్యక్రమంలో అసోసియేషన్ వైస్ ప్రెసెండెంట్ హాబీబుల్ రహేమాన్, కో.కన్వీనర్ అబ్దుల్లా, జాయింట్ సెక్రటరీ అత్తావుల్లా, స్టూడెంట్స్ రింగ్స్ ఇస్మాయిల్, నగరంలోని స్క్రాప్ మార్కెట్, టైర్ మార్కెట్, ఫిష్ మార్కెట్, ఓల్డ్ వుడ్ మార్కెట్, బేరింగ్ మార్కెట్, గోల్డ్ మార్కెట్ ల అసోసియేషన్ సభ్యలు, ముస్లిం హక్కుల పోరాటాల సమితి అధ్యక్షుడు ఫారూఖ్ షోబ్లీ హాజరయ్యారు.
(షేక్ అహ్మద్, అల్ మైనారిటీ అసోసియేషన్ నెట్ వర్క్:ఆమన్)