Kerala sytle: Umbrella for social distance Photo credits The Hindu
కరోనా వైరస్ నియంత్రణలో భాగంగా కొనసాగుతున్న ఆంక్షల వల్ల పనులు చేసుకోలేని పేదలను ఆదుకునేందుకు రాష్ట్రప్రభుత్వం నాలుగో విడత ఉచిత రేషన్ పంపిణీకి సర్వం సిద్దం చేసింది. అయితే, కార్డులున్నవారు షాపులకు గోడుగులతో రావలసి ఉంటుంది. ఈ మధ్య సామాజిక దూరాన్ని సులభంగా పాటించేందుకు గొడుగులు వాడుతున్న సంగతి తెలిసిందే . భారతదేశంలో ఇది కేరళలో మొదట మొదలయింది.
ఒకవైపు కరోనా నియంత్రణలో భాగంగా భౌతికదూరంను ఖచ్చితంగా పాటించడానికే కాదు, వేసవి ఎండల నుంచి కూడా రక్షణ పొందేందుకు గొడుగుకు ఉపయోగపడుతుంది అందువల్ల చౌకదుకాణాల వద్దకు వచ్చే కార్డుదారులు గొడుగులు ఉపయోగించాలని సివిల్ సప్లయిస్ కార్పోరేషన్ కమిషనర్, ఎక్స్ అఫీషియో కార్యదర్శి కోన శశిధర్ విజ్ఞప్తి చేశారు.
శనివారం (మే 16వ తేదీ) నుంచి రేషన్ దుకాణాల ద్వారా ప్రతి బియ్యంకార్డుకు కేజీ శనగలు, కార్డులోని ప్రతి సభ్యుడికి అయిదు కేజీల చొప్పున బియ్యంను ఉచితంగా అందించనున్నారు.
గొడుగు వేసుకోవడం వల్ల వ్యక్తికి, వ్యక్తికి మధ్య ఖచ్చితమైన దూరం వుంటుందని, అధిక ఉష్ణోగ్రతల వల్ల వడదెబ్బ నుంచి కూడా రక్షణ లభిస్తుందని ఈ సందర్బంగా ఆయన సూచించారు.
పేదలకు రేషన్ దుకాణాల ద్వారా ఇస్తున్న సరుకుల విషయంలో మూడో విడత మాదిరిగానే బయోమెట్రిక్ ను తప్పనిసరి చేసినట్లు తెలిపారు. కోవిడ్-19 నియంత్రణలో భాగంగా చౌక దుకాణాల వద్ద శానిటైర్లను అందుబాటులో వుంచుతున్నామని, ప్రతి కార్డుదారుడు రేషన్ తీసుకునే ముందు, ఆ తరువాత కూడా రేషన్ కౌంటర్ల వద్ద చేతులను శానిటైజ్ చేసుకునేలా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని ఇప్పటికే రేషన్ డీలర్లను ఆదేశించినట్లు వెల్లడించారు.
అలాగే ఎక్కువ మంది ఒకేసారి సరుకుల కోసం రాకుండా గతంలో మాదిరిగానే రేషన్ కార్డు దారులకు వాలంటీర్లు టైంస్లాట్ కూపన్లు కార్డుదారులకు అందచేశారని తెలిపారు.
ఇందుకోసం ప్రత్యేకంగా సమయం, తేదీతో కూడిన కూపన్లను ముద్రించింది. వాలంటీర్ల ద్వారా ఈ కూపన్లను బియ్యంకార్డుదారులకు అందిస్తున్నారు.
ఈ కూపన్లపై వారికి కేటాయించిన రేషన్ షాప్ లో ఏ తేదీలో, ఏ సమయానికి వారు వెళ్ళి రేషన్ తీసుకోవచ్చో నిర్ధేశిస్తున్నారు.
అలాగే పోర్టబిలిటీ ద్వారా రేషన్ తీసుకునే వారు కూడా తమకు అందుబాటులో వున్న రేషన్ షాప్ నుంచి సరుకులు తీసుకునే అవకాశం వుందని స్పష్టం చేశారు.
అందుకోసం రాష్ట్ర వ్యాప్తంగా పౌరసరఫరాల శాఖ అన్ని ఏర్పాట్లు చేసింది. పదమూడు జిల్లాల్లోని 28,354 చౌకదుకాణాల ద్వారా మొత్తం 1,48,05,879 కుటుంబాలకు బియ్యం, కందిపప్పు అందించనున్నారు.
జిల్లా చౌకదుకాణాలు మొత్తం రైస్ కార్డులు
పశ్చిమగోదావరి 2,211 12,59,925
చిత్తూరు 2,901 11,33,535
నెల్లూరు 1,895 9,04,220
తూర్పు గోదావరి 2,622 16,50,254
కృష్ణా 2,330 12,92,937
ప్రకాశం 2,151 9,91,822
గుంటూరు 2,802 14,89,439
వైఎస్ఆర్ కడప 1,737 8,02,039
విశాఖపట్నం 2,179 12,4,5266
విజయనగరం 1,404 7,10,528
శ్రీకాకుళం 2,013 8,29,024
కర్నూలు 2,363 11,91,344
అనంతపురం 3,012 12,23,684
కొత్తగా గుర్తించిన అర్హత వున్న కుటుంబాలు : 81,862