Home Breaking ఆంధ్రలో కొత్త కరోనా వ్యూహం, ఇకనుంచి లోకల్ లాక్ డౌన్ …

ఆంధ్రలో కొత్త కరోనా వ్యూహం, ఇకనుంచి లోకల్ లాక్ డౌన్ …

442
0
ఆంధ్రప్రదేశ్ లో కరోనా విస్తరిస్తున్న నేపథ్యంలో కొన్ని జిల్లాల్లో లాక్ డౌన్  అమలుచేస్తున్నారు. ఇదొక వ్యూహంగా  తయారయింది.  రాష్ట్రమంతా మళ్లీ లాక్ డౌన్ విధిస్తారా అనే అనుమానాల మధ్య  రాష్ట్రంలో రెండు జిల్లాల కలెక్టర్లు  స్థానిక రోజుల లాక్ డౌన్ ప్రకటించి కొత్త విధానానికి తెర లేపారు. దీనితో ప్రస్తుతానికి రాష్ట్రమంతా మళ్లీ లాక్ డౌన్ ప్రకటించే పరిస్థితి లేదని ప్రభుత్వం క్లారిటీ ఇచ్చినట్లే . అనంపురం, ప్రకాశం జిల్లాల్లో లాక్  డౌన్ అమలులోకి వచ్చింది. శ్రీకాకుళం జిల్లాలో కాశీబుగ్గ, పలాసలో లాక్ విధించినట్లు వార్తలొస్తున్నా, అక్కడ కోవిడ్ కంట్రోల్ రూం ఈ వార్తలను ఖండించింది. శనివారం దాకా అలాంటి ప్రకటనేమీ లేదని అధికారులు తెలిపారు.
 లాక్‌డౌన్ ప్రకటించిన ప్రాంతాలు…
అనంతపురం జిల్లాలో... అనంతపురం, తాడిపత్రి, ధర్మవరం, హిందూపురం, యాడికి, పామిడి, కదిరి, గుంతకల్లు  కలెక్టర్ గంధం చంద్రుడు ప్రకటించారు.
లాక్ డౌన్ వివరాలు
అనంతపురంలో నగరం మొత్తం ఆంక్షల అమలు
ధర్మవరంలో సాయి నగర్, దాసరి కాలనీ, ప్రియాంక నగర్, బెస్త వీధి, బ్యాంక్ కాలనీ, ఇందిరా నగర్, సిద్దయ్య గుట్టలలో ఆంక్షలు
యాడికిలో హాస్పిటల్ కాలనీ, ఎస్సీ కాలనీ, సిండికేట్ బ్యాంక్ కాలనీ, అంత్రాల వీధి, 12వ వార్డు మరియు 15 వార్డులలో ఆంక్షలు..
పామిడిలోని 5వ, 8వ, 18 వ వార్థులు, కాగితాల మకనం స్ట్రీట్, పి. కొండాపురం, నీలంపల్లి, ఎద్దులపల్లి, గజరాంపల్లి లలో ఆంక్షలు..
 గుంతకల్లులో తిలక్ నగర్, బి.టి.పకీరప్ప కాలనీ లలో ఆంక్షలు
 కదిరిలో బేరిపల్లి, ఆంజనేయస్వామి టెంపుల్ ఏరియా (సైదాపురం)లలో ఆంక్షలు..
 పెనుగొండ పరిధిలో కియా రెసిడెన్షియల్ ఏరియా, వెంకటంపల్లి తండా లలో ఆంక్షలు అమలు
ఈ ప్రాంతాలలో ఉదయం 6:00 నుండి 11 గంటల వరకు అన్ని నిత్యావసర వస్తువులు. కిరాణా.. నూనెలు, కూరగాయలు.. పాలు కొనుగోలు చేసేందుకు అనుమతి..
 ఉదయం 11:00 నుండి కఠినమైన ఆంక్షలు కొనసాగుతాయి..
 ప్రత్యేకంగా అనుమతులు ఉన్నవాటికి తప్ప టాక్సీలు, ఆటోలు, క్యాబ్‌లు వంటి ప్రైవేట్ రవాణాను అనుమతించబడదు.
 ప్రభుత్వం ఇచ్చిన అనుమతి మేరకు ఎపిఎస్‌ఆర్‌టిసి బస్సులు నడుస్తాయి. బస్సులు నడిచే సమయాలలో ప్రయాణికులు ఇంటికి వెళ్లేందుకు, మళ్లీ బస్టాండ్ కు వచ్చేందుకు అలాగే రైల్వే స్టేషన్ల నుండి వచ్చే ప్రయాణీకులకు నగరంలో ఆర్టీసీ ద్వారా సిటీ సర్వీసులు ఏర్పాటు.
 అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, ప్రైవేట్, కార్పొరేట్ కార్యాలయాలు, బ్యాంకులు మరియు ఎటిఎంలు ఇదివరకే జారీ చేసిన ప్రభుత్వ నియమ నిబంధనలను అనుసరించి ప్రమాణాలు పాటిస్తూ యథావిధిగా పనిచేస్తాయి. ఉద్యోగులు తమ ఐడి కార్డులను తీసుకువెళ్లాలి..
 రెస్టారెంట్ లకు అనుమతి లేదు.. అయితే అయితే డోర్ డెలివరీలకు మాత్రమే అనుమతి ఉంటుంది..
 టీ షాపులకు, కేఫ్స్ తెరిచేందుకు వీలు లేదు..
 మెడికల్ షాపులు మరియు ఫార్మసీలు 24/7 తెరిచి ఉంటాయి.. నిత్యావసర వస్తువులకు, కూరగాయలు సంబంధించిన షాపులు మినహా మిగతా అన్ని షాపులు మరియు సంస్థలు మూసివేయాలి..
 అనంతపురం నగరంలోని పాతూరు, గాంధీ బజార్ మరియు తిలక్ రోడ్ ప్రాంతాలకు సంబంధించి, మొత్తం దుకాణాలలో 1/3 వ వంతు చొప్పున కిరాణా షాపులను మాత్రమే అనుమతి ఉంటుంది. వీటిని డిఎస్పి, మునిసిపల్ కమిషనర్ మరియు ఆర్ డిఓ లు నిర్ణయిస్తారు. ఇతర అత్యవసర సేవలకు సంబంధించిన షాపులు మినహాయింపు ఇచ్చిన సమయంలో తెరిచి ఉంటాయి…
గతంలో 2,3 కిలోమీటర్ల లోపు ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా వికేంద్రీకరణ చేసి ఏర్పాటు చేసిన కూరగాయల మార్కెట్లను మార్కెట్లు తిరిగి తెరవడం జరుగుతుంది..
 నాడు -నేడు, అంగన్వాడీ భవనాల నిర్మాణం తదితర ప్రభుత్వ పనులన్నీ కొనసాగుతాయి.. పనులకు వచ్చే కార్మికులకు కాంట్రాక్ట్ ఏజెన్సీ ఐడి కార్డులు అందించాలి..
మటన్, చికెన్ మరియు ఫిష్ షాపులు (మాంసం దుకాణాలు) ఆదివారం మాత్రం మూసివేయాలి.. సోమవారం నుంచి శనివారం వరకు ఉదయం 6 గంటల నుంచి 11 గంటల వరకు ఈ షాపులు తెరిచేందుకు అనుమతి మంజూరు..
 ప్రజలు.. ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాల్లో పనిచేసే ఉద్యోగులు.. సంస్థలు తప్పనిసరిగా మాస్కుల ను వాడాలి.. భౌతిక దూరం పాటించాలి.. శాని టైజర్ లు, థర్మల్ స్క్రీనింగ్ తదితర జాగ్రత్తలు విధిగా పాటించాలి..
ప్రకాశం జిల్లాలో… ఒంగోలు, చీరాల లో పూర్తి స్థాయి లాక్‌డౌన్ అమలు చేయనున్నట్లు జిల్లా కలెక్టర్లు పోలా భాస్కర్ ప్రకటించారు.ఒంగోలు పట్టణంలో34 కొత్త కేసులు కనిపించడంతో లాక్ డౌన్ ప్రకటించాల్సిన వచ్చిది. పట్టణంలో కంటైన్ మెంట్ జోన్ల సంఖ్య 14కు పెరిగింది. ఇక్కడ జూన్వా 21 నుంచి నుంచే లాక్ డౌన్ అమలులోకి వస్తుంది. 14 రోజుల పాటు అమలులో ఉంటుంది. కాకపోతే, కుటుంబం నుంచి ఒక వ్యక్తి ఉదయం ఏడు నుంచి ఉదయం 10 మధ్య బయటకు రావచ్చు.
ఇక చీరాల పట్టణంలో కూడా రేపటి నుంచి లాక్ డౌన్ అమలులోకి వస్తుంది. ఉదయం ఆరు నుంచి  ఉదయం 9 మధ్యే  ప్రజలు నిత్యావసర వస్తువులు కొనుగోలు కు బయటకురావచ్చు. సోమవారం సరుకులను కూడా ఆదివారమే కొనుగోలుచేయాలని అధికారులు ప్రజలకు సూచించారు.

చైనా ఉత్పత్తుల బహిష్కరణ మొదలైంది, పూర్తవుతుందా? ఇండియా-చైనా బిజినెస్ ఇదే…