ఆంధ్రలో కరోనా లేదు, రూమర్లు చెబితే శిక్ష : డిజిపి సవాంగ్

ఆంధ్రప్రదేశ్‌లో లో ఇప్పటి వరకు కరోనా ఒక్క కేసు కూడా నమోదు కాలేదని, ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని డిజిపి గౌతమ్ సవాంగ్ తెలిపారు.
 వదంతులు నమ్మవద్దుని ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ  మీడియా, సోషల్ మీడియా లో కరోనా వైరస్ పై అపోహాలు సృష్టించేందుకు ప్రయత్నిస్తే  కేసులు నమోదు చేస్తామని ఆయన హెచ్చరించారు.
ప్రతి రోజూ రాష్ట్ర వైద్య కమిషనర్ మరియు రాష్ట్ర మంత్రిత్వ శాఖ కరోనా పై ప్రత్యేక బులెటెన్ రిలీస్ చేసి ప్రజఅను అప్రమత్తం చేస్తూనే ఉంటుందని ఆయన చెప్పారు.
వదంతులు సృష్టించి ప్రజలను భయ బ్రాంతులకు గురిచేసే వారి మీద కేసులు నమోదు చేయమని జిల్లా పోలీసులు కు ఉత్తర్వులు జారీ చేశామని కూడా ఆయన చెప్పారు.
మరొక వైపు  కరోనా వైరస్‌ సమస్య ఎదురయితే తీసుకోవలసిన చర్యల మీద  తొమ్మిది మంది సభ్యులతో   రాష్ట్ర ప్రభుత్వం ఒక కమిటీని ఏర్పాటు చేసింది.ఇలాగే ఆసుపత్రులను  కరోనా వైరస్‌ దాడిని ఎదుర్కొనేలా సంసిద్ధం చేసేందుకు అవసరమయిన  కొనుగోళ్లు చేసేందుకు ఇతర అత్యవసర నిర్ణయాలు తీసుకునేందుకు ప్రభుత్వం అనుమతినిచ్చింది. తెలంగాణలో కరోనా కేసు నమోదు కావడంతో అప్రమత్తమయిన ఆంధ్ర అన్ని ముందుజాగ్రత్త చర్య లు తీసుకుంటూఉంది.
ఏపీలో అనుమానంగా ఉన్న 11  కేసుల  నమూనాలను పరీక్షల కోసం హైదరాబాద్‌ గాంధీ ఆస్పత్రికి పంపించారు.