ఆంధ్రప్రదేశ్ కరోనాపాజిటివ్ కేసులు వేయి దాటాయి. అంతేకాదు, ఇంతవరకు కరోనా గాలి సోకకుండా ఉన్నరెండు జిల్లాల్లో ఒకటైన శ్రీకాకుళంలో మూడు పాజిటివ్ కేసులు కనిపించాయి. ఇక మిగిలింది విజయనగరం జిల్లా ఒక్కటే. ఈ జిల్లాలో ఇంతవరకు కరోనా కేసు ఒక్కటి కూడా కనిపించకపోవడం విశేషం. గత 24 గంటలలో మొత్తంగా 61 కొత్త కేసులు వచ్చి చేరాయి.ఇందులో ఒక క్రిష్ణా జిల్లా నుంచే 25 కేసులు కనిపించాయి. రెండోస్థానం 14 కేసులతో కర్నూలు జిల్లాది. రాష్ట్రం మొత్తంగా ఇపుడు కనిపించిన కేసులు 1016. చనిపోయిన వారి సంఖ్య 31కి చేరింది. కరోనా నయమయిన వారు171 మంది. ఇపుడు యాక్టివ్ కరోనా కేసులు814 అని రాష్ట్ర ప్రభుత్వం ఒక బులెటిన్ విడుదల చేసింది. బులెటీన్ వివరాలు ఇవే.
[…] 1000 దాటిన ఆంధ్ర కరోనా కేసులు, మృతులు 31 […]
Comments are closed.