జాగ్రత్త, ఆంధ్రలో దూసుకుపోతున్న కరోనా పాజిటివ్ కేసులు.. ఇపుడు 111

ఆంధ్రప్రదేశ్ లోకరోనా కేసుల సంఖ్య విపరీతంగా పెరిగిపోతున్నది. ఆందోళన కలిగిస్తూ ఉన్నది. నిన్న ఒకే రోజు 43 కేసులు పాజిటిట్ కేసుల సంఖ్య 87 కు చేరితో ఈరాత్రి దానికి మరొక24 కేసులు కలియడంతో మొత్తం పాజిటివ్ కేసులు నూరు దాటాయి. తాజాగా రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన బులెటిన్ ప్రకారం రాష్ట్రంలో నమోదయిన కరోనా  పాజిటివ్ కేసులు 111.ఇపుడు ఆంధ్రప్రదేశ్ తెలంగాణను మించిపోయింది. ఈ రాత్రి పొద్దుపోయాక తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసిన బులెటీన్ ప్రకారం అక్కడి పాజిటివ్ కేసుల సంఖ్య 88. ఈ రోజు తాజాగా వచ్చిన చేరినకొత్త కేసులు 12 మాత్రమే.
 అంటే ఆంధ్రలో  ఈ రోజు ఒకే రోజు 67 కొత్త కేసులు నమోదుఅయ్యాయి. పొద్దన 43 కేసులు తేలాయి. ఇపుడు తాజాగా 24.  గత రెండు రోజులలో మొత్తానికి 88 కేసులు నమోదుఅయ్యాయి. ఇంతవరకు పెద్దగా వార్తల్లో లేని గుంటూరు జిల్లా ఈ రోజు కేసులతో నెంబర్ వన్ అయింది. గుంటూరు జిల్లా కేసులు 20 కి చేరుకున్నాయి.

జిల్లాల వారిగా ఇప్పటి వరకు నమోదు అయిన కేసులు…
అనంతపురం – 2
చిత్తూరు – 6
తూర్పుగోదావరి – 9
గుంటూరు – 20
కడప – 15
కృష్ణ – 15
కర్నూలు – 1
నెల్లూరు – 3
ప్రకాశం – 15
విశాఖపట్నం – 11
పశ్చిమగోదావరి – 14
 పాజిటి వ్ కేసులలో ఎక్కువ మంది   ఢిల్లీ నిజాముద్దీన్ లో జరిగిన తబ్లిఘ్ మర్కాజ్ మత సంబంధ కార్యక్రమానికి  వెళ్లి వచ్చిన వారు, వారి బంధువులే ఉన్నారని తెలిసింది..