టాప్ 4 జిల్లాల్లో అనంతపురం, కరోనా కట్టడికి కొత్త వ్యూహం

అనంతపురం, ఆగస్టు 5:కోవిడ్ కేసులు బాగా పెరుగుతున్న నేపథ్యంలో కరోనా పాజిటివ్ వ్యక్తులకు మెరుగైన వైద్య సేవలు అందించేందు జిల్లాలో చర్య లు చేపట్టారు. జిల్లాలోని 25 కోవిడ్ ఆస్పత్రులకు 25 మంది నోడల్ అధికారులను నియమిస్తూ జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు ఉత్తర్వులు జారీ చేశారు.
అనంతపురం జిల్లాల రాష్ట్రంలో ఒక కరోనా హాట్ స్పాట్ గా మారిపోయింది. నిన్న ఒక్క రోజు 1325కొత్త కేసులు జిల్లాలో కనిపించాయి. ఇది రాష్ట్రంలో రెండో స్థానం. మొదటి స్థానంలో  తూర్పుగోదావరి జిల్లా  (1371)ఉంది.  మ త్తొ కరోనా కేసులలో కూడా  అనంతపురం  టాప్ మూడు జిల్లాలకు చేరింది. జిల్లాలో మొత్తం 18801 కేసులు ఇంతవరకు నమోదయ్యాయి. ఈ విషయంలో తూర్పుగోదావరి (24,685)  నెంబర్ వన్ అయితే, రెండో స్థానంలో  కర్నూలు జిల్లా (20695) ఉంది. ఇక జిల్లాలో 7727  యాక్టివ్ కేసులున్నాయి. ఇందులో  అనంతపురానికి నాలుగో స్థానం. మొదటి స్థానంలో ఉన్న తూర్పుగోదావరి10,558 యాక్టివ్ కేసులున్నాయి. తర్వాత విశాఖ పట్నం(9870), కర్నూలు (8909) జిల్లాలున్నాయి.ఇక  మృతుల విషయానికి వస్తే జిల్లాలో 130 మంది చనిపోయారు. ఇది రాష్ట్రంలో నాలుగో స్థానం. ఈ విషయంలో 218 మరణాలతో కర్నూలు టాప్ ఉంటే, తర్వాత  తూర్పుగోదావరి జిల్లా (188), గుంటూరు (163).
జిల్లాలోని కోవిడ్ ఆస్పత్రులలో ఎన్ని బెడ్లు ఉన్నాయి, ఎంతమంది పాజిటివ్ వచ్చిన వ్యక్తులు ఉన్నారు, ఆస్పత్రులలో పాజిటివ్ వచ్చిన వారి అడ్మిషన్ల కు వీలుగా సమన్వయం చేయడం, తీవ్ర లక్షణాలు ఉన్న వారిని టెస్టింగ్ తో సంబంధం లేకుండా ఆసుపత్రిలో అడ్మిట్ చేయడం, జిల్లాలోని ట్రయాజ్ సెంటర్ల నుంచి రిఫర్ చేసిన తీవ్ర లక్షణాలు ఉన్న వ్యక్తులను డాక్టర్లతో సమన్వయం చేసుకొని మెరుగైన వైద్య సేవలు అందించేలా నోడల్ అధికారులు పర్యవేక్షించాలని కలెక్టర్ నోడల్ అధికారులను ఆదేశించారు.
అలాగే టెస్టింగ్ తో సంబంధం లేకుండా ఆస్పత్రులకు వచ్చిన వారికి మెరుగైన సేవలు అందించడం, అన్ని ఆసుపత్రులలో డిశ్చార్జ్ లు సక్రమంగా జరిగేలా చూడడం, ఆస్పత్రుల యాజమాన్యం తో సమన్వయం చేసుకొని సంబంధిత ఆసుపత్రికి కేటాయించిన సిబ్బందిని సక్రమంగా విధులకు హాజరయ్యేలా పర్యవేక్షించడం,
ఆస్పత్రులకు సంబంధించి అనంతపురం ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి జనరల్ సర్జన్ జి. నారాయణ మరియు ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్ హెచ్ ఓడి డాక్టర్ బాబు లతో సమన్వయం చేసుకొని మృతదేహాల నిర్వహణ సక్రమంగా జరిగేలా పర్యవేక్షించాలని కలెక్టర్ ఆదేశించారు.
ఆస్పత్రులకు సంబంధించి ప్రతి రోజు అడ్మిషన్లు, డిశ్చార్జ్ లు తదితర వాటికి సంబంధించిన నివేదికను హాస్పిటల్ నోడల్ ఆఫీసర్ వరప్రసాద్ కు పంపించాలన్నారు..
అలాగే ఆస్పత్రులలో పాజిటివ్ వచ్చిన వ్యక్తులకు నాణ్యమైన భోజనం అందుతుందా లేదా అనేది ఆకస్మిక తనిఖీలు ద్వారా పరిశీలించాలన్నారు.
పారిశుద్ధ్య నిర్వహణ సక్రమంగా ఉండేలా పర్యవేక్షించాలన్నారు. తీవ్ర లక్షణాలు ఉన్న వారిని వెంటనే ఆస్పత్రులకు చేర్పించి మెరుగైన వైద్య సేవలు అందించి మరణాలు జరగకుండా చూడాలన్నారు.,
ఇందుకు సంబంధించి రిపోర్టులను జాయింట్ కలెక్టర్ (గ్రామ / వార్డు సచివాలయాలు మరియు అభివృద్ధి), కమాండ్ కంట్రోల్ రూమ్ కి పంపించేలా చూడాలన్నారు.
ఆసుపత్రుల్లో ఏర్పాటు చేసిన హెల్ప్ డెస్క్ సేవలను సక్రమంగా వినియోగించుకుని పాజిటివ్ వ్యక్తుల కు మెరుగైన వైద్య సేవలు అందేలా చూడాలని కలెక్టర్ ఆదేశించారు.
నోడల్ అధికారుల వివరాలు:
అనంతపురం ప్రభుత్వ జనరల్ హాస్పిటల్ కి నోడల్ అధికారిగా ఏపీఎంఐపీ ప్రాజెక్ట్ డైరెక్టర్ సుబ్బరాయుడు,
కిమ్స్ సవీరా హాస్పిటల్ కి నోడల్ అధికారి గా
హ్యాండ్లూమ్స్ మరియు టెక్స్టైల్స్ ఏడి రామప్ప
చంద్ర సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కి ఇంటర్మీడియట్ విద్య ఆర్ఐఓ రమణ నాయక్.
కేర్ అండ్ క్యూర్ హాస్పిటల్ కి నోడల్ అధికారిగా జిల్లా మైనారిటీ సంక్షేమ అధికారి మహ్మద్ రఫీ
డాక్టర్ వైయస్ఆర్ మెమోరియల్ హాస్పిటల్ కి నోడల్ అధికారిగా మార్కెటింగ్ ఏడి నారాయణ మూర్తి
దివ్య శ్రీ హాస్పిటల్ కి సర్వే & ల్యాండ్ రికార్డ్స్ ఏడి మశ్చిన్ద్రనాథ్
శ్రీ అమరావతి మల్టీ స్పెషాలిటీ
హాస్పిటల్ కి నోడల్ అధికారి గా ఆర్కియాలజీ & మ్యూజియమ్స్ ఏడి రజిత
శ్రీ ప్రజ్ఞా హాస్పిటల్ కి నోడల్ అధికారిగా కార్మిక శాఖ అసిస్టెంట్ కమిషనర్ తిమ్మయ్య
బత్తలపల్లి ఆర్డీటీ హాస్పిటల్ కి నోడల్ అధికారిగా జిల్లా క్రీడా అథారిటీ చీఫ్ కోచ్ జగన్నాథ్ రెడ్డి
డా.కె.ఎస్.ఆర్ గఫూర్ హాస్పిటల్ కి నోడల్ అధికారి గా జిల్లా గిరిజన సంక్షేమ అధికారి అన్నదరై
ఎస్ఆర్ మల్టిపుల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కి నోడల్ అధికారి గా సోషల్ వెల్ఫేర్ డిడి విశ్వ మోహన్ రెడ్డి
అనంతపురంలోని ఎస్వీ హాస్పిటల్ కి నోడల్ అధికారిగా సెరికల్చర్ జె.డి పద్మమ్మ
హర్షితా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ కి జిల్లా సైనిక్ వెల్ఫేర్ ఆఫీసర్ చంద్రశేఖర్
క్రాంతి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కి నోడల్ అధికారిగా జిల్లా ఉపాధి అధికారి కళ్యాణి
మైత్రి హాస్పిటల్ కి నోడల్ అధికారిగా సివిల్ సప్లై జిల్లా మేనేజర్
కెకె నర్సింగ్ హోమ్ కి నోడల్ అధికారి గా పశుసంవర్ధక శాఖ జెడి సన్యాసి రావు
అనంతపురం కోర్ట్ రోడ్ లోని ఆషా హాస్పిటల్ కి నోడల్ అధికారి గా జిల్లా లైబ్రరీస్ కార్యదర్శి రమా
అనంతపురం ఎస్‌ఎస్‌పి ఆస్పత్రికి నోడల్ అధికారిగా డ్రగ్ కంట్రోల్ అధికారి రమేష్ రెడ్డి
అనంతపురంలోని ప్రభుత్వ క్యాన్సర్ ఆసుపత్రికి నోడల్ అధికారి గా లీగల్ మెట్రాలజీ అసిస్టెంట్ కంట్రోలర్ స్వామి
పుట్టపర్తిలోని ఎస్‌ఎస్‌పి ఆస్పత్రికి నోడల్ అధికారి గా జిల్లా వృత్తి విద్యాధికారి
ధర్మవరం లోని దేవి నర్సింగ్ హోమ్ కి నోడల్ అధికారిగా డివిజనల్ కోఆపరేటివ్ ఆఫీసర్ కృష్ణ నాయక్
గుంతకల్లు లోని శ్రీ పద్మావతి శ్రీనివాస హాస్పిటల్ కి నోడల్ అధికారి గా ఏపి స్టేట్ హౌసింగ్ కార్పొరేషన్ లిమిటెడ్ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ వై.రామకృష్ణారెడ్డి
హిందూపురం జిల్లా ఆస్పత్రికి నోడల్ అధికారిగా డివిజనల్ కోఆపరేటివ్ ఆఫీసర్ రాజేంద్ర ప్రసాద్
కదిరి ఏరియా హాస్పిటల్ కి నోడల్ అధికారి గా హౌసింగ్ డీఈఈ ఎం జి కె మూర్తి
గుంతకల్లు ఏరియా ఆసుపత్రికి నోడల్ అధికారిగా జి ఎస్ బిఎస్ సి సెక్షన్ నెంబర్ 2 ఏఈఈ ప్రసాద్ ను నియమించారు.