అనంతపురం కలెక్టర్ వినూత్న ప్రయోగం: ఒక రోజు కలెక్టర్ గా విద్యార్థిని శ్రావణి

(చందమూరి నరసింహారెడ్డి)
అంతర్జాతీయ బాలికా దినోత్సవం (International Day of the Girl 2020) సందర్బంగా అనంతపురం జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు ఒక వినూత్న ప్రయోగం చేపట్టి  ఆంధ్రప్రదేశ్ లో మొత్తం సంచలనం సృష్టించారు.
 ఆదివారం నాడు  జిల్లాలోని అన్ని  ప్రతి ప్రభుత్వ కార్యాలయాలను పని చేయించారు. అయితే, ప్రతి కీలకమయిన కార్యాలయాాలలో పనిచేసింది మాత్రం కొత్త అధికారులు. అంతా బాలికలే.  బాలికలకు గుర్తింపు తెచ్చేందుకు, వారిలో ఆత్మవిశ్వాసం నింపేందుకు  ఉన్నతాధికారులుగా ‘ఒక రోజు అధికారి’గా అనేక పాఠశాలలకు చెందిన విద్యార్థులను నియమించారు. ఇలా రోజు అనంతపురం జిల్లాని చరిత్రలో ఎపుడూలేని విధంగా బాలికలు పాలించారు.
 ఒక రోజు కలెక్టర్, ఒక రోజు జాయింట్ కలెక్టర్, ఒక రోజు మునిసిపల్ కమిషర్, ఒకరోజు ఆర్డీవో, ఒక రోజు ఎమ్మార్వోలుగా… బాలికలు బాధ్యతలు స్వీకరించే వినూత్న కార్యక్రమం జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు అమలు చేసి అక్టోబర్ 11,2020 మరిచిపోలేని దినంగా మార్చారు.
బాలికలు అధికారులుగా బాధ్యతలు స్వీకరిస్తే ఏ విధంగా జీవితం ఉంటుందో పిల్లలకు తెలిసినప్పుడే వారు ఉత్సాహంగా విద్యను నేర్చుకుంటారని, కష్టం తో కాకుండా ఇష్టం తో చదువు కొనసాగించి ఉన్నత స్థాయికి చేరుకుంటారని ఓ గొప్ప సందేశంతో కలెక్టర్ గంధం చంద్రుడు ఈ ‘ఒక్కరోజు అధికారి’ అనే వినూత్న కార్యక్రమాన్ని  సింబాలిక్ గా అమలు  చేశారు పిల్లలు.
ఈ కార్యక్రమంతో విద్యార్థులలో మంచి ఉత్సాహం నెలకొంది. జిల్లా మొత్తం ఈకార్యక్రమం చర్చనీయాంశమయింది.
జిల్లా కలెక్టర్ గా, జాయింట్ కలెక్టర్ గా ఆర్డీవో గా ఎండివో గా , తాహసిల్దార్ గా, పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్ గా, మున్సిపల్ కమిషనర్ గా, ఇతరత్రా అనేక జిల్లాస్థాయి మండల స్థాయి రెవెన్యూ డివిజన్ స్థాయి అధికారులుగా, గ్రూప్1, గ్రూప్ 2 ,గ్రూప్ 3 అధికారులుగా బాలికలు బాధ్యతలు స్వీకరించి, నిర్వహించేలా ప్రణాళిక రూపొందించి అమలు చేశారు.
ఇది అటు విద్యార్థుల లోనూ విద్యార్థుల తల్లిదండ్రులు కూడా ఈ కార్యక్రమం పట్ల మంచి స్పందన లభించింది.
‘బాలికే భవిష్యత్తు” కార్యక్రమంలో భాగంగా   ఎం. శ్రావణి ఒక్క రోజు జిల్లా కలెక్టర్ గా బాధ్యతలు నిర్వర్తించారు. శ్రావణి  కె.జి.బి.వి.గార్లదిన్నె లోఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం చదువుతున్నది.
కలెక్టర్ కారులో కార్యాలయానికి వెళ్తున్న శ్రావణి:
ఒక రోజు కలెక్టర్ గా  శ్రావణి ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులో బాధిత బాలికకు రూ.25 వేలు పరిహారం అందించే ఫైల్ పై సంతకం చేసింది.
కదిరిలో ఒక రోజు తాశీల్దార్
రాత్రి 8 గంటల తర్వాత ఉదయం 8 గంటలకు ముందు మహిళా ఉద్యోగులను అధికారిక పనుల గురించి ఫోన్ లు చేసి ఆటంకం కలిగించకూడదని ఉత్తర్వులు జారీ చేసింది.
ఫస్ట్ రోడ్ వార్డ్ సచివాలయాన్ని ఒక రోజు కలెక్టర్ తనిఖీచేసింది.
జిల్లా జాయింట్ కలెక్టర్ (గ్రామ, వార్డు సచివాలయాలు మరియు)గా ఒక రోజు సహస్ర బాధ్యతలు స్వీకరించింది. ప్రసాద్ స్కూల్ నందు 7వ తరగతి చదువుతోంది.
జిల్లా జాయింట్ కలెక్టర్ (ఆసరా మరియు సంక్షేమం)గా నేత్రశ్రీ బాధ్యతలు స్వీకరించింది. నారాయణ స్కూల్ నందు 5వ తరగతి చదువుతోంది.
డి ఆర్ ఓగా సమీర ఒక రోజు బాధ్యతలు స్వీకరించింది. ఆర్ ఎం సి హెచ్ ఎస్, అనంతపురం లో 8వ తరగతి,
కలెక్టరేట్ ఏవో పి.నిఖిల గా ఒక రోజు బాధ్యతలు స్వీకరించింది
కె.జి.బి.వి.గార్లదిన్నె లో 9వ తరగతి,
అనంతపురం ఒక రోజు మునిసిపల్ కమిషర్ గా చిన్మయి
అనంతపురం మునిసిపల్ కార్పొరేషన్ ఒక రోజు కమీషనర్ గా కుమారి చిన్మయిబాధ్యతలు స్వీకరించింది.
ధర్మవరం ఒక రోజు ఆర్డీవో గా సి కళ్యాణి
ధర్మవరం ఒక రోజు ఆర్.డి.వో.గా సి.కల్యాణి బాధ్యతలు స్వీకరించిన ఈ అమ్మాయి జి.వి.ఇ.జడ్పీ బాలికల ఉన్నత పాఠశాలలో 10 వ తరగతి
చదువుతున్నది.
బాలికలను ఒకరోజు బాధ్యతలు స్వీకరింపజేసి వారి పనితీరు ఎలా ఉంటుంది అన్న విధానాన్ని ప్రయోగాత్మకంగా పరిశీలించారు. ఇదో వినూత్న ప్రయోగం. హ్యాట్సాఫ్ కలెక్టర్.
Chandamuri Narasimhareddy
(చందమూరి నరసింహారెడ్డి,సీనియర్ జర్నలిస్టు, ఖాసా సుబ్బారావు అవార్డు గ్రహీత)