ఆంధ్రలో ఆందోళన కలిగిస్తున్న కరోనా పాజిటివ్ కేసులు, మృతులు 31

ఆంధ్ర ప్రదేశ్  రోజు రోజుకుపెరుగుతున్న పాజిటివ్ కేసులు  ఆందోళన కలిగిస్తున్నాయి.
రాష్ట్ర ప్రభుత్వం  తాజాగా విడుదలచేసిన  హెల్త్ బులిటెన్ ప్రకారం గత 24 గంటలలో కొత్త‌గా 81 క‌రోనా వైర‌స్ పాజిటీవ్ కేసులు న‌మోదయ్యాయి
దీంతో రాష్ట్రంలో పాజిటీవ్ కేసులు 1097కి చేరుకున్నాయి.
గడచిన 24 గంటల్లో అత్యధికంగా కృష్ణా జిల్లా లో 52 కేసులు నమోదయ్యాయి.

గడచిన 24 గంటల వరకు 6768 మంది నుంచి శాంపిల్స్ సేకరించి పరీక్షలు జరిపారు. ఇందులో 81  మంది పాజిటివ్ అని తేలింది. జిల్లాల వారీగా  కనిపించిన పాజిటివ్ కేసుల వివరాలు:
కర్నూల్ లో 4,గుంటూరు 3, అనంతపురం 2, పచ్చిమ గోదావరి జిల్లా 2, కృష్ణా 52, కడప 3, ప్రకాశం 3 చొప్పున కొత్త‌గా పాజిటీవ్ కేసులు నమోదయ్యాయి.
అత్యధికంగా కర్నూలు జిల్లాలో పాజిటివ్ కేపులు 279కి చేరుకున్నాయి. రెండో స్థానంలో ఉన్న  గుంటూరు జిల్లాలో 214 కేసులుకనిపించాయి. ఇక కృష్ణా జిల్లాలో 177 లతో మూడో  స్థానంలో ఉంది.
 24 గంటల్లో అత్యధికంగా మునుపెన్నడూ లేనివిధంగా 81 పాజిటివ్ కేసులు కనిపించడం ఆందోళన కలిగిస్తున్నదని అధికారులుచెబుతున్నారు.
కరోనా పాజిటివ్ తో 231 మంది రోగులు కోలుకుని ఆసుప‌త్రి నుంచి డిశ్చార్జ్‌ అయ్యారు. ఇపుడు
వివిధ ఆసుపత్రుల్లో 835 మందికి చికిత్స  కొనసాగుతున్నది