Alarming News -13వేల జాబ్స్ కోత – కాగ్నైజాంట్ నిర్ణయం

అమెరికన్ ఐటి కంపెనీ ఈ రోజు షాకింగ్ న్యూస్ ప్రకటించింది.  ఖర్చు తగ్గించుకునేందుకు ఈ కంపెనీ  ఏడు వేల మిడ్ లెవెల్ , సీనియర్ లెవెల్ ఉద్యోగాలను రద్దుచేయబోతున్నది. దీని ప్రభావం భారత్ మీదే ఎక్కువగా ఉండబోతున్నది. ఇదే విధంగా ఈ కంపెనీ కంటెంట్ మోడరేషన్ బిజినెస్ నుంచి కూడా తప్పుకోవాలనుకుంటున్నది. దీని వల్ల మరొరు 6 వేల ఉద్యోగాలు పోతాయి. మొత్తం కాగ్నైజాంట్ వచ్చే క్వార్టర్స్ లో 13 వేల ఉద్యోగాలను రద్దుచేయనుంది.
గురు వారం నాడు కంపెనీ తన బిజినెస్ రిజల్ట్స్ ప్రకటించింది.2019 సప్టెంబర్ తో ముగిసే క్వార్టర్ కంపెనీ లాభాలు 4.1 శాతం పెరిగాయి. నెట్ ఫ్రాఫిట్ 497 అమెరికన్ డాలర్లకు చేరింది. గత ఏడాది ఇదే కాలంలో కంపెనీ లాభాలు కేవలం 477 మిలియన్ డాలర్లే. కాగ్నైజాంట్ వర్క్ ఫోర్స్ ప్రధానంగా ఉండేది ఇండియాలోనే. కంపెనీ యాన్యువల్ రెవిన్యూ గ్రోత్ కూడా 4.6 శాతం నుంచి 4.9 శాతానికి పెరిగింది.అయినా సరే కంపెనీ ఒక బ్యాచ్ ఉద్యోగులను తొలగించాలనుకుంటున్నది.   2020 నాటికి ఉద్యోగులను తొలగించాలనకుంటున్నట్లు కంపనీ సి ఎఫ్ వొ మెక్ లోలిన్ తెలిపారు. అయితే, ఏదేశంలో ఉండే ఉద్యోగులను తీసేయబోతున్నది కంపెనీ వెల్లడించడం లేదు. అయితే, ఈ కంపెనీ ఉద్యోగులు ఎక్కువ మంది ఉండేది ఇండియాలోనే కాబట్టి ఈ లేఆఫ్ ప్రభావం ప్రధానంగా పడేది ఇండియామీదే అనివేరే చెప్పాల్సిన పనిలేదు.
కాగ్నైజాంట్ లో మొత్తంగా 2,89,900 ఉద్యోగులున్నారు. ఇందులో ఇండియాలో ఉన్నవారు రెండులక్షలు దాటారు.