తమిళనాడులో గెల్చినోళ్లే నమ్మలేని పరిస్థితి, ఎఐడిఎంకె గెలుపు

ఈ ఉప ఎన్నికల్లో తమిళనాడులో చాాలా ఆశ్చర్యం జరిగింది. ఎంత ఆశ్చర్యమంటే ఎన్నికల్లో గెల్చినా ఎలా గెల్చామబ్బా అని రూలింగ్ ఎఐఎడిఎంకె నేతలే ఆశ్చర్య పోతున్నారు.

అక్కడ అలాంటి పరిస్థితి ఉంది. ఎఐడిఎంకె ప్రభుత్వం,పార్టీ రెండూ జయలలిత పోయాక చాాలా అభాసు పాలయ్యాయి.

  ఆ మధ్య చెన్నై లోజరిగిన పార్లమెంటుఎన్నికల్లో డిఎంకె విజయఢంకా మోగించడంతో ఇక ఎఐడిఎంకె పని ‘ఫసక్ ’  అనుకున్నారు. ఇపుడు అలా జరగలే.

ఉప ఎన్నిక జరిగిన రెండుస్థానాల్లో రూలింగ్ పార్టీ అభ్యర్థులు గెలిచాారు. జయలలిత లేకున్నాసరే ఎన్నికల్లో గెలవగలమన్న సత్తాచూపించారు.

ఇదెలా జరిగిందో ఎవరికీ అర్థం కావడం లేదు. ఎన్నికలు జరిగిన విక్రవండి, నంగునేరి అసెంబ్లీ నియోజకవర్గాలలో ఎఐఎడిఎంకె అభ్యర్థులు  గెలిచారు.

ఎందుకు ఆశ్చర్యపోతున్నారంటే, ఈ రెండు సీట్లు డిఎంకె వి. పార్టీ అభ్యర్థులు చనిపోతే, ఇక్కడ ఉప ఎన్నికలు వచ్చాయి.

ముఖ్యమంత్రి పళనిస్వామి,  అంతా డమ్మీ అని భావించే పళని స్వామి, బలమయిన డిఎంకె పార్టీ నుంచి రెండు సీట్లు లాక్కోవడం అంటే మాటలా?

అందులో కూడాపార్టీఅభ్యర్థులను ఆయన  మంచి మెజారిటీతో గెలిపించారు.

విక్రవండి నుంచి ముత్తమిళ్ సెల్వన్  45 వేల మెజారిటీ తో  గెలుపొందారు. నంగునేరి నుంచి వి నారాయణన్ 30 వేల వోట్ల మెజారిటీ గెలుపొందారు.

దీనితో పళని స్వామి పట్టుకోలేరెవరు అంటున్నారు.  ఈయన రాజకీయ జీవితం ఒక కొత్త మలుపుతిరుగుతుందనుకుంటున్నారు.

ఫోటో సోర్స్ The Lede