కెసిఆర్ కు కరోనా అని రాసిన జర్నలిస్టు అరెస్టు, కేసు,విడుదల

తెలంగాణ ముఖ్యమంత్రి  కసిఆర్ కు కరోనా అని రాసినందుకు  జర్నలిస్టు ఆనంచిన్ని వెంకటేశ్వరరావు మీద జూబిలీ హిల్స్ పోలీసులు నమోదు చేశారు.  టిఆర్ ఆస్ క్రియాశీల కార్యకర్త మహ్మద్ అబ్దుల ఇలియాస్ అనే వ్యక్తి చేసిన ఫిర్యాదు మేరకు పోలీసులు వెంకటేశ్వరరావు మీద డిజాస్టర్ మేనేజ్ మెంట్ యాక్ట్ 2005 సెక్షన్ 54 ప్రకారం ఐపిసి సెక్షన్లు ప్రకారం 505(1)(b), 505(2) r/w 34 కేసు నమోదు చేశారు. వెంకటేశ్వరరావు ‘ఆదాబ్ హైదరాబాద్ ’అనే తెలుగు పత్రికలో పనిచేస్తున్నారు.  ఆయనతో పాటు పత్రిక యాజమాన్యం మీద కూడా కేసునమోదు చేశారు.
 పోలీసుల సమాచారం  ప్రకారం, కెసిఆర్ కు కరోనా, హరిత హారంతోనే అంటుకున్నదా? దగ్గు జబ్బు తో ఇబ్బందులు, క్వారంటైన్ లో జరుగుతున్న చికిత్స, ప్రగతి భవన్ లోనే 30 కి పైగా కేసులు అంటూ… ఈ పత్రికలో వార్త అచ్చయింది.  ఈ వార్త చదివి తాను అవాక్కయ్యానని, ఇది ఫేక్ వార్త అని ఫిర్యాదులో ఇలియాస్ పేర్కొన్నారు. ఇలాంటి వార్తలు అమాయక ప్రజలను ప్రభావితం చేస్తాయని ఆయన పేర్కొన్నారు.  వెంకటేశ్వరరావు మీద చర్య తీసుకోవాలని ఆయన ఫిర్యాదులో పేర్కొన్నారు.
(details)
Jubilee Hills PS: Cr. No. 365/2020 U/s 505(1)(b), 505(2) r/w 34 IPC and Sec 54 of Disaster Management Act 2005
Date of offence:- On 05.07.2020 at 10.00 hrs
Date of Report:- On 05.07.2020 at 15.00 hrs
Place of offence;- H.No. 8-3-228/390 Near Amar Point Lane, Rahamath nagar Yousufguda Hyderabad
Name of the complainant:- Sri Mohd Abdul Iliyas S/o Mohd Abdul Afsar aged 27 yrs, Occ: TRS active Member R/o H.No. 8-3-228/390 Near Amar Point Lane, Rahamath nagar Yousufguda Hyderabad Cell No. 9010430611
Accused Details:- Anam Chinni Venkateshwar Rao and Management of Adab Hyderabad News Paper
Facts:- Facts of the case are that Sri Mohd Abdul stated that today 05.07.2020 at 10.00 hrs when he was reading Adab News Paper Adab Hyderabad News Paper (E-paper) I found that in Main Edition 1st paper published one article heading as “KCR Ku Corona ? Harithaharam thone Antukundha – – Daggu, Jalubu tho ibbandhulu, Quarantine lo jargutunna Chikthsa, Pragathi Bhavan lone 30 paiga kesulu, Bhadratha vebhagam Unnathadhikariki saitham.
On reading the article he was shocked and enquired with their friends about the article but their friends said that the Government did not give any such type of statement regarding the Hon’ble CM. then I understood it is fake news. As they are the normal public and depend on the newspapers for knowing the situation and social awareness and govt decisions and the alleged facts are fake, on enquiry he came to know the one was Anam chinni Venkateshwar Rao reporter. Hence he requested to take action against venkateshwar rao and the management of Adab Hyderabad News Paper.
అరెస్టును ఖండించిన బిజెపి ఎంపి బండి సంజయ్
కరోనా పై తప్పుడు వార్త ప్రచురితం చేశారంటూ ఖమ్మం కు చెందిన విలేఖరి పై అక్రమంగా కేసు బనాయిండాన్ని బిజెపి పార్లమెంటు సభ్యుడు బండి సంజయ్ కుమార్ ఖండించారు. కరోనా పై తప్పుడు ప్రచారం చేస్తున్నది కెసిఆరే నిన ఆయన  పేర్కొన్నారు.
సజయ్ ప్రకటన ఇది:
“కక్షసాధింపు చర్యలకు అణచివేతకు ముఖ్యమంత్రి కెసిఆర్ పర్యాయపదంగా మారారు. కెసిఆర్,కరోనాపై అసత్య ప్రకటనలు చేసినందుకు కెసిఆర్ పై కేసు నమోదు చేయాలి. పారాసిటమాల్ టాబ్లెట్ తో కరోనా రాదని,20 డిగ్రీల వేడితో కరోనా వైరస్ బతకదని, వ్యాపించదని యావత్ తెలంగాణ రాష్ట్ర ప్రజలను ముఖ్యమంత్రి కెసిఆర్ తప్పుదారి పట్టించారు. మరోవైపు రాష్ట్ర మంత్రులు వేడి నీళ్లు తాగితే రాదని మభ్యపెడుతున్నారు.పత్రికా యాజమాన్యాలకు,విలేకరులకు కరోనా రావాలని శపించిన కెసిఆర్ వైఖరి గతంలోనే ప్రజలంతా గమనించారు.కరోనా వైరస్ వ్యాప్తి నగరంతోపాటు పలు జిల్లాల్లో విలయతాండవం చేస్తున్నా,రాష్ట్ర వ్యాప్తంగా వైద్య పరీక్షలు నిర్వహించడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైంది.ఆ విషయం పత్రికల్లో రోజువారీగా వార్తలు వస్తుండడంతో పత్రికలపై,జర్నలిస్టులపై కక్ష కట్టి అక్రమ కేసులు బనాయిస్తున్నారు.వెంటనే విలేకరులపై నమోదు చేసిన అక్రమ కేసులను ఎత్తివేయాలని డిమాండ్ చేస్తున్నాము.వ్యతిరేకంగా వార్తలు ప్రచురించే యాజమాన్యాల పట్ల,వార్తలు వ్రాసే విలేకరుల పట్ల సమయ సందర్భాలను చూసి కేసులు నమోదు చేయడం దారుణం.దీనిని ప్రతి ఒక్కరూ,ప్రజా సంఘాలు ఖండించాలి.పత్రికా యాజమాన్యాలకు, జర్నలిస్టులకు బిజెపి అండగా ఉంటుందని భరోసా ఇస్తున్నాను.”

వెంకటేశ్వరరావు  విడుదల

అయితే, వెంకటేశ్వరరావు ఎట్టకేలకు సోమవారం రాత్రి హైదరాబాద్ జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ నుండి స్టేషన్ బెయిలు పై విడుదలయ్యారు. ఈ రోజు ఉదయం ఆరు గంటల సమయంలో ఖమ్మంలో మార్నింగ్ వాక్ కోసమని బయలుదేరిన జర్నలిస్ట్ వెంకటేశ్వరరావు ఎంత సేపు అయినా ఇంటికి తిరిగి రాలేదు. ఫోన్లు స్విచ్చాఫ్ అయ్యాయి. కుటుంబ సభ్యులతో పాటు వెంకటేశ్వరరావు సన్నిహితులు, జర్నలిస్టులు ఈ విషయంపై ఆందోళన వ్యక్తం చేశారు. పలువురు వెంకటేశ్వరరావు ఆచూకీ కోసం ఆరా తీశారు.
ఉదయం 11 గంటల వరకు ఏలాంటి ఆచూకీ లభించలేదు. అసలు వెంకటేశ్వరరావు ఏమైపోయారు? అనే ఉత్కంఠ రేగింది. వెంకటేశ్వరరావు కిడ్నాప్ కు గురయ్యారని ఈ నేపథ్యంలో జర్నలిస్టులు మరియు తెలంగాణ జర్నలిస్టు సంక్షేమ సంఘం నాయకులు అనుమానాలు వ్యక్తం చేశారు.
ఈ నేపథ్యంలో తెలంగాణ సంక్షేమ సంఘం రాష్ట్ర నాయకులు రామకృష్ణ గౌడ్, శ్రావణ్, జనార్ధన్ కేపి తదితరులు పెద్ద ఎత్తున వెంకటేశ్వరరావుకు సంబంధించిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు వాకబు చేశారు. సంబంధిత పోలీస్ స్టేషన్ అధికారులతో పలుదఫాలు మాట్లాడారు.
ఈ వ్యవహారంపై భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. జర్నలిస్టులపై కేసులు పెట్టిస్తున్న ప్రభుత్వ కక్ష ధోరణి తీరుపై మండిపడ్డారు. అవసరమైతే కరోనా విషయంలో ప్రజల్ని పక్కదోవ పట్టిస్తున్న కెసిఆర్ పై ముందుగా కేసు నమోదు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో, జిల్లా స్థాయిలో పెద్ద ఎత్తున రగడ మొదలైంది. మంగళవారం పెద్ద ఎత్తున ధర్నాలు ఆందోళనలకు టీజేఎస్ఎస్ ప్రణాళిక ప్రకటించింది.

మధ్యాహ్నం తరువాత వెంకటేశ్వర రావు పై కేసు నమోదు చేసినట్లు సమాచారం బయటికి వచ్చింది. వెంకటేశ్వరరావును ఉన్నఫలంగా కిడ్నాప్ చేసింది పోలీసు లేనని రూఢీ అయింది. ఆదాబ్ హైదరాబాద్ దిన పత్రికలో సీఎం కేసీఆర్ కు కరోనా అనే వార్త ప్రచురించినందుకు వెంకటేశ్వరరావు తదితరులను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు చివరకు పోలీసులు చెప్పక తప్పలేదు. జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్ వేదికగా హైడ్రామా నడిచింది.
ఉదయం 11 గంటల నుండి రాత్రి 9:30 వరకు వెంకటేశ్వరరావును విడుదల చేస్తారా? లేక రిమాండ్ కు తరలిస్తారా అనే అంశం పై ఉత్కంఠ పెరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా వెంకటేశ్వరరావుకు వస్తున్న స్పందనను గమనించిన పోలీసులు వెనక్కి తగ్గారు. ఆయనకు స్టేషన్ బెయిల్ మంజూరు చేసినట్లు ప్రకటించారు. రాత్రి తొమ్మిదిన్నర గంటల సమయంలో జూబ్లీహిల్స్ స్టేషన్ నుండి వెంకటేశ్వరరావు బయటికి వచ్చారు. వెంకటేశ్వరరావు వెంట జనార్ధన్, శ్రావణ్ ఆయన సతీమణితో పాటు ఇతర జిల్లాల నుండి మద్దతుగా పెద్దఎత్తున తరలి వచ్చిన జర్నలిస్టులు, అభిమానులు తదితరులు ఉన్నారు.