బ్రేకింగ్ : విశాఖ షిప్ యార్డు లో ప్రమాదం, 11 మంది మృతి

విశాఖలో గత కొన్ని రోజులుగా వరుసగా నగరంలో ఏదొక ప్రాంతంలో ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. ఎప్పుడు ఏ ప్రమాదం ముంచుకొస్తుందో అని నగర వాసులు ఆందోళన పడుతూనే ఉన్నారు. ఇదే సమయంలో విశాఖ షిప్ యార్డులో జరిగిన మరో ప్రమాదం స్థానికంగా విషాదాన్ని నింపింది.
విశాఖ షిప్ యార్డ్ లో భారీ క్రేన్ ఒకటి లోడ్ టెస్టింగ్ చేస్తుండగా బెర్త్ పై కూలిపోయింది. ఘటనలో 11 మంది వరకూ మృతి చెంది వుండొచ్చు అని సమాచారం. షిప్ యార్డు సిబ్బంది, అధికారులు సహాయక చర్యలు చేపడుతున్నారు. మరింత సమాచారం తెలియాల్సి ఉంది.
కలెక్టర్ ప్రకటన
క్రేన్‌ ప్రమాదంపై రెండు కమిటీలు ఏర్పాటు చేస్తున్నట్లు విశాఖపట్నం జిల్లా కలెక్టర్‌ వినయ్‌చంద్ తెలిపారు. ప్రమాద వివరాలను కలెక్టర్‌ వివరించారు. ‘‘హెచ్‌ఎస్‌ఎల్ ప్రమాదంలో 11 మంది మృతి చెందారు. ఈ దుర్ఘటనలో ఎవరూ గాయపడలేదు. క్రేన్ ఆపరేషన్‌, మేనేజ్‌మెంట్‌లో మొత్తం మూడు కాంట్రాక్ట్‌ సంస్థలు ఉన్నాయి. మృతుల్లో నలుగురు హెచ్‌ఎస్‌ఎల్ ఉద్యోగులున్నారు. మిగిలిన ఏడుగురు కాంట్రాక్ట్‌ ఏజెన్సీలకు చెందినవారు. క్రేన్ కూలిన సమయంలో కేబిన్లో 10 మంది ఉన్నారు. మృతుల్లో పది మంది వివరాలు గుర్తించాం. ఒకరి వివరాలను గుర్తించాల్సి ఉంది’’ అని కలెక్టర్‌ వినయ్‌చంద్‌ తెలిపారు.
ప్రమాదానికి సంబంధించిన వీడియో కింద ఉంది చూడవచ్చు