Home Breaking రాహుల్ గాంధీకి ముద్దు పెట్టిన మహిళా నేత (వీడియో)

రాహుల్ గాంధీకి ముద్దు పెట్టిన మహిళా నేత (వీడియో)

346
0

వాలెంటైన్స్ డే రోజు ఏఐసీసీ అధినేత రాహుల్ గాంధీకి వింత అనుభవం ఎదురైంది. గుజరాత్ వల్సాద్ లో ర్యాలీ కి హాజరైన రాహుల్ గాంధీకి ఒక మహిళా కాంగ్రెస్ నాయకురాలు సడెన్ గా వేదిక మీదకు వచ్చి రాహుల్ కు ముద్దు పెట్టింది. అది కూడా వాలెంటైన్స్ డే రోజు కావడంతో సోషల్ మీడియాలో ఈ వీడియో బాగా వైరల్ అయిపోయింది.

కాగా ఆ మహిళను “వాలెంటైన్స్ డే సందర్భంగా మీరు అలా చేశారా” అని మీడియా వేసిన ప్రశ్నకు సదరు మహిళ ఈ విధంగా సమాధానం ఇచ్చింది. “నేను కాంగ్రెస్ లో సీనియర్ కార్యకర్తను. సుమారు 48 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీ కోసం పని చేస్తున్నాను” అని తెలిపింది. తాను రాహుల్ గాంధీ వెల్ విషర్ అని, ఆయన సోదరుడిలాంటివాడని చెప్పింది. ముందే అనుకుని ముద్దు పెట్టలేదని, ఆయనను కలిసిన ఆనందంలో అనుకోకుండా జరిగిన పరిణామం అని వివరించింది. ఆ ముద్దు సన్నివేశం వీడియో కింద ఉంది.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here