ప్రకాశం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం , 9 మంది కూలీల మృతి

ఆంధ ప్రదేశ్ ప్రకాశం జిల్లాలో  ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది . నాగులుప్పలపాడు ( మ ) రాపర్ల సమీపంలో విద్యుత్ స్థంభాన్ని కూలీలను తీసుకువెళ్లతున్న ఒక  ట్రాక్టర్ ఢీకొన్న ఘటనలో 9 మంది విద్యద్ఘాతం వల్ల  అక్కడికక్కడే చనిపోయారు .9 మంది అక్కడిక్కడే చనిపోయారు. ఒకరు ఆసుప్రతిలో చనిపోయినట్లు తెలిసింది.  వీరంతా మిర్చి కూలీలుగా భావిస్తున్నారు, మరికొంతమంది గాయపడ్డారు . వీరంతా రాపర్ల సమీప గ్రామాలకు చెందిన వారిగా పోలీసులు చెబుతున్నారు.  చనిపోయిన వారిలో ఎక్కువ మంది మహిళలే ఉన్నారు . ఇక ట్రాక్టర్ లో మొత్తం 15 మంది కూలీలు ఉన్నట్లు సమాచారం. మృతుల్లో ఏడుగురు మహిళలు, ఇద్దరు ఇంటర్ విద్యార్థుల, ఒక రైతులు ఉన్నట్లు తెలుస్తున్నది. వీరందరిని ట్రాక్టర్ లో ఇంటికి తరలిస్తుండగా ఈ ప్రమాదం జరిగింది.
 గ‌వ‌ర్న‌ర్ దిగ్భ్రాంతి
ప్రకాశం జిల్లా నాగులుప్పలపాడు మండలం రాపర్ల సమీపంలో జరిగిన ట్రాక్టరు ప్రమాదంలో కూలీలు దుర్మరణం పాలైన సంఘటనపై ఆంధ్రపద్రేశ్ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. విద్యుత్ స్తంభానికి ట్రాక్టర్ ఢీకొన్నపుడుజరిగిన ఈ ప్రమాదం పలువురు మహిళలు మృతి చెందారు. మృతి చెందిన కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. గాయాల పాలైన వారు త్వరగా కోలుకోవాలని అకాంక్షించారు. బాధితులకు ప్రభుత్వపరంగా అన్ని రకాల సహాయ సహకారాలు వేగంగా అందాలని ఆకాంక్షించారు.

 సీఎం వైయస్‌.జగన్‌ దిగ్భ్రాంతి
ప్రమాద ఘటనపై ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. ప్రమాదం గురించి అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు.  క్షతగాత్రులకు వెంటనే మెరుగైన వైద్య సదుపాయాలు అందించాలని జిల్లా కలెక్టర్‌ను ఆదేశించారు.
బాధిత కుటుంబాలను పరామర్శించాల్సిందిగా ప్రకాశం జిల్లా మంత్రులను ఆదేశించారు.
ఆ కుటుంబాలకు అండగా నిలవాలని,మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున తక్షణ సహాయం అందించాలని కలెక్టర్‌ను ఆదేశించారు.
ట్విట్టర్ లో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి  లోకేష్ సంతాపం
ప్రకాశం జిల్లా, నాగులుప్పలపాడు మండలం రాపర్ల దగ్గర జరిగిన ఘోరప్రమాదంలో 9 మంది మరణించారన్న వార్త దిగ్భ్రాంతికి గురిచేసిందని టిడిపి ప్రధాన కార్యదర్శి నారాలోకేష్ అన్నారు.  ప్రకాశం జిల్లా తెలుగుదేశం నాయకులను ఆరాతీయగా ప్రమాదానికి గురైన వారంతా మిరపకోతకు వెళ్ళొస్తున్న వ్యవసాయకూలీలని తెలిసిందని  ఇది చాలా బాధాకరమని ఆయన ట్వీట్ చేశారు.
లాక్ డౌన్ కష్టాల నుండి వెసులుబాటు దొరికి ఇప్పుడిప్పుడే పనులకు వెళ్తున్న సమయంలో ఇలా జరగడం దారుణం. మృతి చెందిన వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నానని ఆయన వ్యాఖ్యానించారు.