కరోనా దెబ్బ: 66 శాతం గ్రాజుయేట్లకు ఉద్యోగాల్లేవ్… naukri.com సర్వే

కరోనా పాండెమిక్ తో ఆర్థిక వ్యవస్థ స్థంభించడంతో పట్టభద్రులకు ఉద్యోగాల్లేకుండా సంక్షోభంలో పడేసింది. దేశంలోని పట్టభద్రులకు చాలా మందికి ఇపుడు ఉద్యోగాకావశాలు రావడం లేదు. పట్టభద్రుల్లో 66 శాతం మంది ఉద్యోగాల్లేక నిరుద్యోగులుగా ఉండాల్సి వస్తున్నదని ఒక సర్వే వెల్లడించింది. ఉద్యోగాల ఆఫర్ వచ్చినా   44 శాతంమందికి ఉద్యోగాల్లో చేరే అవకాశం లాక్ డౌన్ కారణంగా ఆలస్యమవుతున్నది. మరొక 9 శాతం మందికి ఉద్యోగాల అవకాశాలను కంపెనీలు క్యాన్సిల్ చేశాయి.
ఇదే విధంగా విద్యార్థుల మీద కరోనా తీవ్రంగా దుష్ఫ్రభావం చూపించింది. ముఖ్యంగా ప్రొఫెషనల్ గ్రాజుయషన్ చేస్తున్నవారిల్ ప్రీఫైనల్ లో ఉన్నవాళ్ల పరిస్థితి మరీ అధ్వాన్నంగా ఉంది. ఎందుకంటే వీళ్లకు ఇంటర్న్ షిప్ చేేసేందుకు అవకాశాలన్ని మూసుకుపోయాయి. ఇదే విధంగా క్యాంపస్ రిక్రూట్ మెంట్లు ఆగిపోయాయి. ఏవైనా కంపెనీలు ముందుకొచ్చినా  విద్యార్థలును వీడియో కాన్ఫ రెన్స్ ల ద్వారా ఇంటర్వ్యూ చేస్తున్నాయి.ఆన్ లైన్ లో టాలెంట్ అను అసెస్ చేస్తున్నాయి. దీనికి చాలామంది విద్యార్థుుల కొత్త. అందువల్  రిమోట్ ఇంటర్వ్యూలకు ప్రత్యేక ప్రిపేర్ కావాల్సిన అవసరం ఉందని చాలా మంది విద్యార్థులు భావిస్తున్నారు.
ఈ సర్వేను ఆన్ లైన్ రిక్రూటర్ naukri.com కు చెందిన  Firstnaukri చేసింది.
ఈ సర్వే ప్రకారం కరోనా పాండెమిక్ జాబ్ మార్కెట్ ని బాగా దెబ్బతీసింది. ముఖ్యంగా  ఈ సంవత్సరం క్యాంపస్ రిక్రూట్ మెంట్ ను బాగా దెబ్బతీసింది.
విద్యారంగంలో భారీ మార్పులు రాబోతున్నాయని విద్యార్థులు భావిస్తున్నట్లు సర్వేలో బయటపడింది.  ఇక భవిష్యత్తంతా ఆన్ లైన్ క్లాస్ లదేనని అంటున్నారు. ఇప్పటికే చాలా కాలేజీలు ఆన్ లైన్ క్లాసులను ప్రారంభించేశాయి. ఉద్యోగావకాశాలు దెబ్బతినడంతో చాలా పట్టభద్రులు ఫ్రీల్యాన్సింగ్ అంటే అవకాశం ఉన్నపుడే పనిచేసే ఆప్షన్ లో సెటిల్ అవుతున్నారు.
సగం కంపెనీలు క్యాంపస్ రిక్రూట్ మెంట్ ని వాయిదా వేసుకున్నాయని సర్వేలో పాల్గొన్న విద్యార్థులు చెప్పారు. కొన్ని కంపెనీలు వీడియో ఇంటర్వ్యూలు, ఆన్ లైన్ అసెస్మొంటు విధానాన్ని అమలుచేస్తున్నాయని , ఇక విద్యార్థులు రిమోట్ ఇంటర్వ్యూలకు ప్రిపేర్ కావాలని విద్యార్థులు చెబుతున్నారు.
సర్వే చేసిన విద్యార్థులలో 70 శాతం మంది అపుడే  ఆన్ లైన్ తరగతులకు నమోదయిపోయినట్లు తెలిసింది. లాక్ డౌన్ వాతావరణంలో అందరికంటే ఎక్కువ గా  నష్టపోయింది ప్రిఫైనల్ విద్యార్థులు.ఎందుకంటే వీళ్లకు ఇంటర్న్ షిప్ అవకాశాలుదెబ్బతిన్నాయి. ఇలా సుమారు ఇంటర్న్ షిప్ అవకాశాలు పొయిన వాళ్లు 74 శాతం దాకా ఉన్నట్లు సర్వేలో వెల్లడయింది.