కరోనా యుద్ధంలో నేలకొరుగుతున్న ఇటలీ డాక్టర్లు, 61 మంది మృతి

కోవిడ్ -19 వ్యాధితో విలవిల లాడుతున్న ఇటలీలో వైరస్ డాక్టర్లకు కూడా వ్యాపించింది. డాక్టర్లు విపరీతంగా చనిపోతున్నారు. అయితే, ఎమర్జన్సీ సేవలందించేందుకు మరొక వైపు వేల సంఖ్యలో నర్సులు, డాక్టర్లు ముందుకు వస్తున్నారు.
కరోనా సోకినప్పటి దాకా ఆదేశంలో 61 మంది డాక్టర్లు చనిపోయారు. ఈ వివరాలను నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ డాక్టర్స్ (FNOMCeO) వెల్లడించింది.
ఈ వివరాలకుప్రకారం గత ఏడ రోజుల్లో 22 మంది డాక్టర్లు చనిపోయారు. ఈ సంస్థ వెల్లడించిన వివరాల ప్రకారం, మృతుల్లో ఎక్కువ మంది ఇటలీ కరోనా నరకంగా పేరుపొందిన లోంబార్డ్ ప్రాంతంలో చనిపోయారు.
కరోనా ఒక మాదిరిగా ప్రబలిన లీ మార్చి, కంపానియా, సిసిలీ, పుగ్లియాలలో కూడా డాక్టర్లు చనిపోతున్నారు. ఇటాలియన్ హెల్త్ ఇన్ స్టిట్యూట్ అందిచిన వివరాల ప్రకారం దేశంలో 8,358 మంది హెల్త్ వర్కర్లకు కరోనా వైరస్ అంటుకుంది.
ఇందులో 4000 మంది నర్సులున్నారని నర్సెస్ ఫెడరేషన్ చీఫ్ బార్బరా మాంజియాకవల్లి పేర్కొన్నారు.
పరిస్థితి ఇంత ప్రమాకరంగా ఉన్నప్పటికి కరోనా విపరీతంగా ప్రబలిన ప్రాంతాల్లో తాముసేవలిందించేందుకు సిద్ధంగా ఉన్నామని 9500 మంది నర్సులు నేషనల్ కరోనా వైరస్ టాస్క్ ఫోర్స్ కు తెలిపారు.
ఏమర్జన్సీ సేవలందించేందుకు తమ అయిదు వందల మంది నర్సులు అవసరమని ఇటలీ సివిల్ ప్రొటెక్షన్ డిపార్ట్ మెంటు ప్రకటించిందో లేదో 48గంటల్లోనే 9448 దరఖాస్తులందాయి.ఇలాగే కరోనా పీడిత ప్రాంతాలలో పనిచేసేందుకు 300 డాక్టర్లు అవసరమని కోరితే గతవారంలో 8000మంది డాక్టర్లు దరఖాస్తు చేసుకున్నారు.
ఈ వార్త రాస్తున్నప్పటికి ఇటలీలో కరోనా వైరస్ బారిన పడిన వారి సంఖ్య 97,000 చేరింది.
ఏక్షణానయినా ఇది లక్షకేసులు దాటవచ్చు. ఇక మృతులకు సంబంధించి 10,779 మంది చనిపోయారు. ఈ లెక్క  ఈ వార్త మీరు చదువుతుండగానే పెరిగిపోవచ్చు.