గ్రేటర్ లో నేడు మరో 45 బస్తీ దవాఖానాలొస్తున్నాయ్

వైద్యాన్ని బస్తీ బాట పట్టించేందుకు హైదరాబాద్ మహానగరం వీధిఆసుపత్రులు భారీగా తెరిచేందుకు తెలంగాణ ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నది.
ఇందులో భాగంగా మూసాపేట్ సర్కిల్ కేపీహెచ్ బీ కాలనీ 4వ ఫేస్ లో నూతనంగా ఏర్పాటు చేసిన బస్తీ దవాఖానను మంత్రి మల్లారెడ్డి ప్రారంభించారు (పై ఫోటో). కూకట్ ప ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, ఎమ్మెల్సీ కూర్మయ్య గారి నవీన్ కుమార్, కార్పొరేటర్ మందాడి శ్రీనివాసరావు, మేడ్చల్ జిల్లా కలెక్టర్ వాసం వెంకటేశ్వర్లుతో ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. హైదరాబాద్ లోని ఎర్రగడ్డ సుల్దాన్ నగర్, యాదగిరి నగర్ లో బస్తీ దవాఖానలను మంత్రి కేటీఆర్ ప్రారంభిస్తారు.
ప్రస్తుతం జి.హెచ్.యం.సి పరిధిలో 123 బస్తీ దవఖానాలు ప్రతిరోజూ 10 వేల మందికి వైద్య సేవలు అందిస్తున్నాయి. నూతనంగా ప్రారంభించే 45 బస్తీ దవాఖానాల తో అదనంగా 4 వేల మందికి వైద్య సేవలు అందుతాయి.
ఇందులో ఇపుడు మరొక 45 బస్తీ దవఖాన్ల (urban primary health centre) ను ప్రారంభిస్తున్నారు ఇందులో హైదరాబాద్ -22, మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లాలో 15, రంగారెడ్డి జిల్లాలో 05, సంగారెడ్డి జిల్లాలో 03 బస్తీ దవాఖానాలున్నాయి.
నూతనంగా ప్రారంభించే 45 బస్తీ దవాఖానాల తో అదనంగా 4 వేల మందికి వైద్య సేవలు అందుతాయి.
ఒక్కో బస్తీ దవాఖాన లో ఒక వైద్యుడు, ఒక నర్స్, ఒక సహాయకుడు ఉంటారు .
ప్రజలకు వైద్య సేవలు మరింత చేరువ చేసేందుకే ప్రభుత్వం బస్తీ దవాఖానా కాన్సెప్ట్ ఉద్దేశం.
ఢిల్లీలో ముఖ్యమంత్రి ఆర్వింద్  కేజ్రీవాల్ ప్రారంభించిన ఆమ్ ఆద్మీ క్లినిక్ స్ఫూర్తితో హైదరాాద్  ప్రాంతంలో ఈ బస్తీ దవఖాన్లను ప్రారంభించారు. మొదటి దఫా లో 17 దవఖాన్లను 2017 ఏప్రిల్ మునిసిపల్ మంత్రి  కె తారకరామారావు మల్కాజ్ గిరిలోని బిజెఆర్ నగర్ లో  ప్రారంభించారు. మొత్తంగా గ్రేటర్ పరిధిలో వేయి దవఖాన్లను తెరవాలనుకుంటున్నట్లు ఆపుడాయన చెప్పారు.  బస్తీలలో నివసించే పేదలకు పరీక్షించడమే కాదు, ఉచితంగా మందులు కూడా ఇక్కడ అందిస్తారు.
ఇక్కడ ఔట్ పేషంట్ కన్సల్టేషన్ మాత్రం ఉంటుంది. ప్రాథమిక ల్యాబ్ పరీక్షలు చేస్తారు. ఇమ్యూనైజషన్ సర్వీసులు, ఫ్లామిలీప్లానింగ్ సలహాలు, రక్తహీనత, ఇతర అంటువ్యాధుల కాని సమస్యలు అంటే, బ్లడ్ ప్రెజర్,షుగర్ లకు సంబంధించిన సలహాలు సేవలు ఇక్కడ లభిస్తాయి.