మహారాష్ట్ర పోలీసుల్లో జోరుగా కరోనా, మృతులు 42

మహారాష్ట్ర పోలీసు సిబ్బంది తీవ్రంగా కరోనా బారిన పడుతున్నారు. వారిలో మృతుల సంఖ్య కూడా ఎక్కువగా ఉంటున్నది.  ఇంతవరకు రాష్ట్రంలో 3,661 మంది పోలీసులకు కరోనా సోకింది. వారిలో 42 మంది మృతి చెందారని రాష్ట్ర హోం మంత్రి అనిల్ దేశ్ ముఖ్ చెప్పారు.
కరోనా సోకినవారిలో ఇంతవరకు 2,248 వివిధ ఆసుపత్రులలోచికిత్స తీసుకుని కోలుకున్నారు.
మహారాష్ట్రలో కోవిడ్ తీవ్రంగా ఉన్న సంగతి తెలిసిందే. ఇంతవరకు 6,17,242 మందిని క్వారంటైన్ చేశారు.వీరిలో 730 మందిని క్వారంటైన్ మార్గదర్శకాలు ఉల్లంఘిస్తూ దొరికి పోయారు.
రాష్ట్రంలో మొత్తంగా 134 పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశారు. వీటిలో 4437 మంది వలసకూలీలకువసతి కల్పించి భోజనాలు, తదితరసౌకర్యాలు కల్పించారు.లాక్డౌన్ మొదలయినప్పటి నుంచి మహారాష్ట్రలో1,30,396 కరోనా నియమాలను ఉల్లంఘించినందుకు ఐపిసి సెక్షన్ 188 కింద కేసులు నమోదు చేశారు.
ఈ కేసులకు సంబంధించి 26,887 మందిని అరెస్టు చేశారు.82,344 వాహనాలు స్వాదీనం చేసుకున్నారని ఆయన చెప్పారు.జరిమాన రూపంలో 7.65 కోట్లరుపాయలు వసూలు చేశారు.