Home Breaking ఎన్టీఆర్ మొదలు పెట్టిన రాజకీయ యాత్ర తెలంగాణలో ఇలా ముగిసింది…

ఎన్టీఆర్ మొదలు పెట్టిన రాజకీయ యాత్ర తెలంగాణలో ఇలా ముగిసింది…

124
0

పుట్టిన గడ్డ మీద తెలుగుదేశం పార్టీ చరిత్ర దాదాపు ముగిసిట్లేనా? 1982 మార్చి 29న నాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజధాని హైదరాబాద్ లో ఏర్పడి, 1983లో అసెంబ్లీ ని అక్రమించిన తెలుగుదేశం పార్టీల ఇదే హైదరాబాద్ అసెంబ్లీ నుంచి ఇపుడు కనుమరుగయింది. కనిపించి కనిపించకుండా ఉంటూవచ్చిన తెలుగుదేశం శాసన సభాపక్షం ఇపుడు టిఆర్ ఎస్ లో విలీనమయింది.

ఖమ్మం జిల్లా సత్తుపల్లి నియోజకవర్గం నుండి సండ్ర వెంకట వీరయ్య, అశ్వారావుపేట నియోజకవర్గం నుండి మెచ్చ నాగేశ్వర్ రావులు కాగా తాము టిఆర్ఎస్ శాసన సభ పార్టీలో విలీనం కాదలుచుకున్నట్టు బుధవారం అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస రెడ్డిని కోరూతూ లేఖ రాశారు. రాజ్యాంగంలోని పదవ షెడ్యూలులో పొందుపరిచిన నాలుగవ పేరా ప్రకారం అనుమతించాలని కోరారు. ఈ మేరకు స్పీకర్ విలీనాన్ని ఆమోదించారు. దాంతో అధికారిక ప్రకటన విడుదలైంది. టిఆర్ఎస్ ఎల్పీలో విలీనం కావడం ద్వారా శాసన సభలో తెలుగుదేశం పార్టీ మాయమయింది. ఇది చరిత్ర ముగిసింది. అంటే 38 సంవ్సత్సరాలలో తొలిసారి అసెంబ్లీలో తెలుగుదేశం లేకుండాపోయింది. ఒకపుడు లోక్ సభలో మొదటి సారి ప్రతిపక్ష హోదా దక్కించుకున్న పార్టీ తెలుగుదేశం. అలాంటి ఉజ్వల చరిత్ర ఉన్న పార్టీ ఇపుడు సభలో లేకుండా పోయింది. ఈ ఆంధ్రప్రాంతీయ వాదం తెలుగుదేశం పార్టీకి పురుడుపోసిందో, అలాంటి తెలంగాణ ప్రాంతీయవాదమే తెలుగుదేశంపార్టీకి కొత్తతెలుగు రాష్ట్రంలో ముప్పు తెచ్చింది.

తెలుగుదేశం పార్టీపుట్టుక దేశ రాజకీయాల్లోనే ఒక ఉజ్వల ఘట్టం. ఎలాంటి రాజకీయ చరిత్రలేని వ్యక్తి, సుదీర్ఘమయిన రాజకీయ చరిత్ర ఉన్న కాంగ్రెస్ పార్టీ ని ఒక్క దెబ్బతోకూల్చేశారు. అంతవరకు భారదేశంలో ఏ ఒక్క ప్రాంతీయ పార్టీ కూడా ఆకాశం నుంచి ఊడిపడలేదు. ఉదాహరణకు తమిళనాడు డిఎంకె, పంజాబ్ అకాలీదళ్, జమ్ము కాశ్మీర్ లోని నేషనల్ కాన్ఫరెన్స్ వంటి పార్టీలకు సుదీర్ఘమయిన ఉద్యమ చరిత్ర ఉంది. ఉన్నట్లుండి ఊడిపడ్డట్టు పార్టీపెట్టి సుడిగాలి సృష్టించించి సినీనటుడు ఎన్టీరామారావు. అపుడాయన వయసు 60 సంవత్సరాలు.

NTR as Sri Krishna

సినిమా అనుభవం ఎలాంటి రాజకీయ నేపథ్యంలేని ఎన్టీరామారావు, ఎలాంటి రాజకీయ ఐడియాలజీ లేకుండా,కేవలం ఉహాచిత్రా(imagery)ల ఆయుధాలతో కాంగ్రెస్ మీద దాడి ప్రారంభించారు. ఆయన ఆయుధాలు తెలుగువాడి ఆత్మగౌవం, తెలుగు భాష, తెలుగు సంస్కృతి వంటి వన్నీ కేవలం ఉహాచిత్రమే.ఇలాంటి ఉహాచిత్రాలు తెలుగు రాజకీయాల్లో ప్రవేశపెట్టిన వాడు రామారావే. వీటి ఆధారంగా ఆంధ్ర రాష్ట్రం కావలని ఉద్యమించడం జరిగింది. తొలి: తెలుగు రాష్ట్రం ‘ఆంధ్ర రాష్ట్రం’ 1953లో ఏర్పడినా అవెపుడూ రాజకీయ నినాదాలు కాలేదు.

ఇంతకు మించి తెలుగుదేశంపార్టీకి మరొకఐడియాలజీ లేదు. ఐడియాలజీలు బలంగా ప్రచారమవుతున్న రోజులలో ఐడియాలజీ లేకుండా పార్టీ పెట్టివిజయవంతమయిన వ్యక్తి ఏన్టీఆర్ మాత్రమే. ఆ తర్వాత ఇంతవరకు మరొకరెవరూవిజయవంతం కాలేదు.
ఈ ఉహాచిత్రాలు హిప్నటిజం చేశాయి. 1983లో ఆనాటి రాష్ట్ర శాసన సభకు జరిగిన సాధారణ ఎన్నికల్లో తెలుగుదేశం 289 స్థానాల్లో పోటీ చేసింది. 294 స్థానాల అసెంబ్లీలో 201 సీట్లను కైవసం చేసుకుంది. అప్పటి నుంచి ఇప్పటిదాకా 38 ఏండ్ల పాటు అసెంబ్లీలో అధికారంలోనో ప్రతిపక్షంలోనో కొనసాగుతూ వచ్చిన పార్టీ ఇపుడు అక్కడ లేకుండా ఇక్కడా లేకుండా మాయమయింది.
తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్ రాజకీయ పూర్తిగా మార్చివేసింది. ఇంతవరకురాజకీయ ప్రాధాన్యం లేని కులాలకు ప్రాధాన్యం కల్పించి (Politics of accommodation) బిసిలలో రాజకీయ చైతన్యం తీసుకువచ్చారు. కరణం వ్యవస్థ రద్దుచేయడం, మండలాలు చేయడం, స్థానికసంస్థల్లో రిజర్వేషన్లు ప్రవేశపెట్టడం ఎన్నికల ప్రజాస్వామ్యాన్ని మూలమూలలకు తీసుకువెళ్లాయి. ఇలాంటి అనేక సంస్కరణలను తీసుకువచ్చిన ఘనత టిడిపికి ఉంది. అలాగే టిడిపి వచ్చాకనే రాష్ట్రంలో కుల సమీకరణ ఎక్కువయింది. అంతకు వరకు రాజకీయాల్లో కులాల గొడవనాయకత్వ స్థాయిలోనే ఉండేది. నీలం సంజీవరెడ్డికి, ప్రొఫెసర్ రంగాకు ఉన్నగొడవని ఆరోజుల్లో కులంగొడవగా చూసేశారు. దామోదరం సంజీవయ్య ముఖ్యమంత్రి కావడానికి, దిగిపోవడానికి ప్రధాన కుల రాజకీయాలే కారణమని చెబుతారు. ఇలా పైస్థాయిలో ఉన్న కులం, తెలుగుదేశం పార్టీ వచ్చాక కమ్మ, రెడ్డి రాజకీయాలుగా మారిపోయాయి. ఈ అపకీర్తి టిడిపి అకౌంటులో జమ అవుతుంది.
రాజకీయాలంటే ఏముంది, ఎత్తుకు పై ఎత్తులే. రాజకీయాలంటే ఏమీలేదు సాధ్యం కాని దాన్ని ఏదో విధంగా సాధ్యం చేసుకోవడం ( Politics is the art of art of the possible, the attainable-the art of the next best)అని ఎవరో పెద్దాయన పూర్వం చెప్పాడని అంతా ఉదహరిస్తుంటారు.

ఇపుడు తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. ఎన్టీఆర్ నినాదాలనే కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు తెలంగాణ కు అన్వయించుకుని తెలంగాణ సాధించారు. దీనితో తెలుగుదేశం పార్టీ అవసరం ఈ ప్రాంతంలో తీరిపోయింది. ఈ పార్టీ మకాం ఆంధ్రప్రదేశ్ కు మార్చేసుకుంది. పార్టీ నేతలు తెలంగాణలో తిరగడం మానేశారు. దీనితో ప్రముఖులంతా టిఆర్ ఎస్ కు వెళ్లిపోయారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేశాక 2014లో జరిగిన ఎన్నికల్లో టీడీపీ పోటీ చేసి కేవలం 15 మాత్రమే సీట్లు సాధించుకున్నది. ఆ తర్వాత రెండోసారి 2018లో జరిగిన సాధారణ ఎన్నికల్లో టీడీపీ మరింత బలహీన పడి కేవలం రెండంటే రెండే సీట్లలో గెలుపొందింది.

దీనితో ముఖ్యంగా ఎమ్మెల్యేలు టిఆరెస్ లోకి ఫిరాయించడం మొదలయింది. ఈ క్రమంలో చివరి ఇద్దరు ఇపుడిలా టిఆర్ ఎస్ శాసన సభాపక్షంలో చేరిపోయారు. అసెంబ్లీలో టిడిపిచరిత్ర ఇప్పటికి ముగిసింది. మళ్లీ టిడిపివస్తుందా.. చూద్దాం. రాజకీయాల్లో ఏమయినా జరగవచ్చు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here