జగన్ క్యాంప్ ఆఫీస్ సెక్యూరిటీలో 10 మంది కరోనా పాజిటివ్

అమరావతి: తాడేపల్లిలోని ఆంధ్ర ముఖ్యమంత్రి వైఎస్  జగన్ నివాసం వద్ద కరోనా కలకలం మొదలయింది. ముఖ్యమంత్రి క్యాంపు ఆఫీస్ వద్ద విధులలో ఉన్న 10 మంది సెక్యూరిటీ సిబ్బందికి కరోనా సోకింది.
ఈ పాజిటివ్ కేసులలో  ఆంధ్ర ప్రదేశ్ స్పెషల్ పోలీసు  కాకినాడ బెటాలియన్‌కు చెందిన  సెక్యూరిటీ గార్డులు ఎనిమిది మంది ఉండగా,  మ మరొక ఇద్దరు ఇంకో బెటాలియన్‌కు చెందిన వారు.
 ఈ నెల 2న సీఎం నివాసం వద్ద గార్డులకు కరోనా టెస్టులు నిర్వహించారు. అయితే టెస్టుల ఫలితాలను ఈ రోజు వెల్లడించారు. ఈ పలితాల్లో పది మంది వైరస్ నిర్ధారణ అయింది.  గతంలో కూడా సీఎం నివాసం వద్ద సెక్యూరిటీ సిబ్బందిలో ఇద్దరికి కరోనా సోకింది.
తెలంగాణ ముఖ్యమంత్రి నివాసం సెక్యూరిటి లో కూడా
ఇప్పటికే తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ సెక్యూరిటీ సిబ్బందిలో కరోనా కనిపించింది. అంటే ముఖ్యమంత్రులు నివాసాలు కరోనా ప్రూఫ్ కాదని, వాటిలో  కూడా వైరస్ చొరబడుతూ ఉందని రుజువయినట్లే లెక్క. దెక్కన్ క్రానికల్ రిపోర్టు ప్రకారం కెసిఆర్ క్యాంప్ కార్యాలయం వద్ద  విధులు నిర్వహిస్తున్నవారిలో నలుగురుకరోనా పాజిటివ్ అనితేలింది. ఇప్పటికే ముఖ్యమంత్రి కరోనా టాస్క్ ఫోర్స్ అడ్వయిజర్ ఒకరికి కూడా కరొనా సోకింది.
ఇక, ఆంధ్ర ప్రదేశ్ కరోనా అన్ని జిల్లాలో తీవ్రంగా  బయటపడుతూ ఉంది. గత 24 గంటలలో  745 కేసులు నమోదయ్యాయి.  12 మంది చనిపోయారు.దీనితో రాష్టంలో కరోనా మృతులసంఖ్య218కి చేరింది.మొత్తం పాజిటివ్ కేసుల 17699కి చేరాయి. యాక్టివ్ కేసులు 9473. ఇంతవరకు చికిత్స తీసుకుని విడుదలయిన వారు 8008 మంది.
గత 24 గంటలో రాష్ట్రంలో నిర్వహించిన పరీక్షలు 24,962. దీనితో మొత్తంగా రాష్ట్రోం 9,96,573 మంది పరీక్షలు నిర్వహించారు.  నిన్న డిశ్చార్జ్ అయిన వారు 311

ఇది ఇలా ఉంటే మాజీ మంత్రి బిజెపి నేత మాణిక్యాల రావు కూగా కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అయింది. ఆయన దీనికి బెదిరిపోకుండా  కరోనాకు ప్రజలెవరూ భయపడాల్సిన పనిలేదని, సామాజిక దూరం పాటించి, మాస్క్ ధరించి కరోనాను దూరంగా పెట్టవచ్చని, ఒకవేళ కరోనా సోకినా అనవసర ఆందోళన అవసరం లేదని ప్రజలకు ధైర్యం చెబుతున్నారు.