ఈ ఏడాది భగ్గున మండే సత్యం చెప్పిన ట్వీట్

రంపపు కోత లాంటి వ్యంగ్యంతో విసిరిన ట్వీట్ ఇది. దీని వెనక భగ భగ  మండే భయంకరమయిన వాస్తవాలున్నాయి. అందుకే ఈ ట్వీట్ నాకు చాలా ఇష్టం. మీరు షేర్ చేయండి. ప్రజలకు, ప్రభుత్వాలకు, నాయకులకు కనువిప్పు గలిగే దాకా ఈ ట్వీట్ ను షేర్ చేయండి. అది అత్యవసరం ఎందుకంటే…

2018వ సంవత్సరం అంత్యంత వేడెక్కిన సంవత్సరం. టెంపరేచర్ రికార్డు చేయబట్టి ఇప్పటికి 140 సంవత్సరాలయింది. అప్పటి నుంచి అత్యంత ఎక్కువ ఉష్టోగ్రత నమోదయిన నాలుగు సంవత్సరాలలో  2018 ఒకటి. అంతకు ముందు కూాడా ఉష్ణోగ్రత కొలవడం వుండినా, 1873లో ఇంటర్నేషనల్ మెటియోరలాజికల్ వచ్చాకే గ్లోబల్ స్థాయిలో ఉష్ణోగ్రత పరిశీలన పరిశోధన మొదలయింది.

2019 ఇంకా వేడిగా ఉంటుందని నాసా చెబుతూ ఉంది.

ఇక భారత దేశంలో  మార్చి ఏప్రిల్ మేలలో కూరిసే ప్రీమాన్సూన్ తొలకరి లో 22 శాతం లోటు ఉంది. గత 65 సంవత్సరాలలో ఇలాంటి విపత్కర పరిస్థితి రావడం ఇది రెండోసారి.

ఈ సారి రుతుపనవాలు దాదాపు రెండువారాలు ఆలస్యమయ్యాయి. దీనితో భారతదేశంలో ఎండలో ఉడికిపోతున్నది.

రాజస్థాన్ లోని చురు పట్టణం  ఉష్ణోగ్రత 50 డిగ్రీలకు దాటింది. ఈ ఏడాది మూడు సార్లు అక్కడ టెంపరేచర్ 50.8 డిగ్రీలు రికార్డు చేసింది.

ఎపుడూ రాజకీయాల్తో వేడెక్కే ఢిల్లీని ఈసారి ఎండలు మండించాయి. అక్కడి ఉష్ణోగ్రత 46 డిగ్రీల సెల్సియస్ కు చేరుకుంది.

దేశంలో 43 శాతం భూభాగంలో కరువు తాండవిస్తాఉంది. అక్కడ దాదాపు 600మిలియన్ల మంది కరువులో బతుకుతున్నారు.

మన హైదరాబాద్ తో కలిపి దేశంలోని 21 నగరాలలో 2020 నాటికి భూగర్భజలాలు మాయమవుతాయని నీతి ఆయోగ్ హెచ్చరించింది.  మన నీటి వాడకంలో ఇపుడు భూగర్భ జలాలా వాట 40 శాతం.

నదుల నుంచి నీటిని పట్టణావసరాలకు ఎక్కువగా మళ్లిస్తున్నారు. దీనితో చాలా గ్రామీణ ప్రాంతాల్లో   తాగునీరు,సాగునీరు తగినంత  దొరకడం లేదు. ఫలితంగా పట్టణ, గ్రామీణ ప్రాంతాల మధ్య గొడవలు  మొదలవుతున్నాయి. ఇవి ముందు ముందు తీవ్రమవుతాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

ఈ ఫోటో నేషనల్ హైవే 167 వేసేందుకు దారి వెంబడి నరికేసిన చెట్లకు సంబంధించింది. జడ్చర్లనుంచి కర్నాటక రాయచూరు దాకా వెళ్లే ఈ జాతీయ రహదారికోసం 500చెట్లను నరికేస్తున్నట్లు 2016లో ప్రకటించారు. అయితే, వేలలోనే ఉంటుందని మీడియారాసింది. ఇలా నరికేసే ప్రతిచెట్టుకు నష్టపరిహారంగా 5చెట్లు నాటాలనేది నియమం. అదెక్కడమలతున్నదో ఎక్కడా కనిపించదు.