వైసిపి నేత యలమంచిలి రవి అరెస్టు

వైఎస్ ఆర్ కాంగ్రెస్ నేత యలమంచిలి రవిని పోలీసలు అరెస్టు చేశారు. తెలుగుదేశం పార్టీ చీకట్లో చేపట్టిన ఒక విధ్వంస కార్యక్రమాన్ని అడ్డుకునేందుకు ప్రయత్నించిన నందుకు మాజీ ఎమ్మెల్యే రవిని విజయవాడ పోలీసులు అరెస్టు చేశారు.

యలమంచిలి రవి అరెస్ట్ కి నిరసనగా మాచవరం పోలీస్ స్టేషన్ దగ్గర ఆయన వర్గీయులు ఆందోళన దిగారు. రవికి మద్దతుగా వెళ్లిన మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధా రంగంలోకి దిగారు. అసలు జరిగిందేమిటంటే…

బెంజి సర్కిల్ వద్ద కాకాని వెంకట రత్నం విగ్రహ తొలగించేందుకు రాత్రి ప్రయత్నించారు.  కాకాని వెంకటరత్నం  జై ఆంధ్ర ఉద్యమానికి ప్రతీక.  స్వాతంత్ర్యం తర్వాత తెలుగునాట ఈ ప్రాంతంలో  వచ్చిన అతి పెద్ద ఉద్యమం జై  ఆంధ్ర ఉద్యమం. ఈ ఉద్యమానికి సారథ్యం  వహించిన వాడు కాకాని. ఈ ఉద్యమం గుర్తుగా ఆయనకు నివాళిగా, విజయవాడ బెంజి సర్కిల్లో ఆయన విగ్రహం ప్రతిష్టించారు.  అయితే, రోడ్డు విస్తరణ, ఫ్లై ఓవర్ పనుల అడ్డం వస్తున్నదని  విగ్రహాన్ని తొలగించటానికి సిద్ధమయ్యారు హైవే నిర్మాణ అధికారులు.  ఈపని పగలు చేస్తే ప్రజావ్యతిరేకత వస్తుందని ఆర్థరాత్రి క్రేన్ల సహాయంతో విధ్వంసానికి పూనుకున్నారు. దీనితో ఈ విధ్వంస చర్య ను అడ్డుకునేందుకు వైసిపి కార్యకర్తలతో రవి ఆప్రాంతానికి వచ్చారు.

అర్ధరాత్రి, కనీసం సమాచారం లేకుండా ఎలా తొలగిస్తారని  రవిమండిపడ్డారు.  పోలీసులతో చర్చలుజరిపారు. పోలీసులు వినలేదు. కార్యకర్తలకు పోలీసులకు కొద్ది సేపు తోపులాట కూడా జరిగింది. ఇక లాభం లేదని, ప్రజలు పెద్ద ఎత్తున వచ్చే ప్రమాదం ఉందని పోలీసులు ఆయనను తెల్లవారు జామున అదుపులొకి తీసుకుని పొలీస్ స్టే షన్ కు తరలించారు. దీనితో మాచవరం పోలీస్ స్టేషన్ వద్ద మాజీ ఎమ్మెల్యే, యలమంచిలి రవి ఆయన వర్గీయులు ఆందోళనకు దిగారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *