అభిమానం జనసంద్రమయ్యేదెపుడు?

అభిమానం జనసంద్రమైతే …అటు జనం, ఇటు జనం, ఎటు చేసినా జనమే. ఇలాంటి దృశ్యం ఆంధ్రప్రదేశ్ లో కనిపించక చాన్నాళ్లయింది. ఇపుడు మళ్లీ ప్రత్యక్షమవుతూ ఉంది. నిన్న ప్రకాశం జిల్లా కందుకూరులో  వైసిపి నేత, ప్రతిపక్ష నాయకుడు జగన్ మీద ఉన్న అభిమానం ఇలా జన సంద్రమయింది.

ఆంధ్రలో పాపులర్ లీడర్లు చాలా తక్కువ. చాలామంది పేరున్న నాయకులు, దేశభక్తులు, మాంచి నాయకులు, సక్సెస్ ఫుల్ నాయకులు ఉండి ఉండవచ్చు.  పాపులర్ లీడర్లు లేరు. ఇంతకు ముందున్న నాయకులు చాలా మంది స్వాతంత్య్రోద్యమంలో పాల్గొన్నిదేశభక్తితో  గౌరవం, భక్తి సంపాయించుకున్నారు. వారంతా గాంధియన్లుగానో, గాంధీ కి దగ్గరగా ఉండి మంచిపేరు తెచ్చకున్నారు. వారంటే గర్వకారణం మనకు. అలాకాకుండా నేరుగా రాజకీయాల్లోకి వచ్చి, కాంగ్రెస్ నీడ పడకుండా పాపులర్ లీడరయింది మొదటి ఎన్టీరామరావే. అయితే, అప్పటికే ఆయన మహానటుడు. తెలుగునాటంతా ఫాన్స్ అసోషియన్స్. సినిమా ఖ్యాతి, వాగ్ధాటి, నటనా కౌశలం ఎన్టీఆర్ వైపు జనం చూసేలా చేశాయి. అయితే, ఇలాంటి సినిమా ఖ్యాతి, స్వాతంత్యోద్యమ చరిత్ర లేకుండా వచ్చి పాపులర్ లీడరయింది ఒక్కడే… వైఎస్ రాజశేఖర్ రెడ్డి. ఫ్యాక్సనిస్టు రాజారెడ్డి కొడుకని, రాయలసీమ ఫ్యాక్షనిస్టు అని ఎంత బురద చల్లినా ఆయనకు అంటుకోలేదు. జనం ఆయన వైపు చూశారు. ఆయన దగ్గిరకు నడిచారు. ఆయన వెంటనడిచారు. ఆయనా వారి వెనక నిలబడి నేనున్నాను ముందుకు పదండి అన్నారు. ఈ లెక్కన మొదటి తెలుగు పాపులర్ లీడర్ రాజశేఖర్ రెడ్డియే. ఎన్టీరామారావు ఎంత జనాదరణ ఉన్నా ఆయన కలుసుకోవడం చాలా కష్టమయ్యేది ప్రజలకు. రాజశేఖర్ రెడ్డి, తనకు జనానికి ఉన్న ఉన్న ప్రిస్టేజీ గోడ కూల్చేశారు. జనం భుజం మీద చేయ్యేసి, ‘రావయ్యా’ అనే వాడు.హృదయంతో మాట్లాడేవాడు. కళ్లలోకి చూస్తూ ఆత్మీయతను నవ్వులతో పంచేవాడు. కొంత మంది ముఖ్యమంత్రులు కళ్లలోకి చూల్లేరు కారణం, గిల్టు అభిమానం. ఇలా కాకుండా వైఎస్ ఆర్ అనే మూడక్షరాల వేష భాషలు జనానివి. ఆయన మాటల్లో  వరల్డ్ బ్యాంకు వాళ్ల పడికట్టు పదాలు  ఉండేవి కాదు. ఆయన వేషం… పదహారాణాల తెలుగుదనం.అసెంబ్లీ గోడలను, పాదయాత్ర లో ఆయన తిరిగిన వూర్లను, ఆయన సందర్శించిన  ప్రదేశాలను, రోడ్లను, ఆయన పరామర్శిన మనుషులను ఒక్క సారి జాగ్రత్త గా చూడండి. రాజశేఖర్ రెడ్డి వదిలపోయిన చిరునవ్వులు మాసిపోకుండా కనిపిస్తాయి. రాజకీయాల్లోరాజకీయాలాటాలాడాడు. జనం మధ్య జననేతలాగా ఉన్నాడు. పాపులారిటి అనేది అబ్జక్టివ్. జనం నుంచి వస్తుంది.అందుకే, ఆయన మొదటి పాపులర్ లీడర్ అంటే ఆశ్చర్యం కాదు.

(వీడియో వయా వైసిపి Facebook నుంచి)

పాపులర్ అనే ఇంగ్లీష్ మాటకు అర్థం ఏమిటో తెలుసా…

 Popular /ˈpɒpjʊlə

attributive (of cultural activities or products) intended
 for or suited to the taste, understanding, 
or means of the general public rather than
 specialists or intellectuals.

‘editorials accusing the government of wanting to gag the
 popular press’

(ఆక్స్ ఫోర్డు డిక్షనరీస్ )

పాపులర్ అనే మాటకి చాలా అర్థాలున్నా, ఒక అర్థం సాంస్కృతికమయినది.రాజకీయాలు సాంస్కృతిక రంగం కాబట్టి పైన పేర్కొన్న అర్థం ఈ సందర్భానికి బాగా సరిపోతుంది.

పాపులర్ అంటే జనాభిరుచలకు, జనాల ఆలోచలనకు, అవసరాలకు, భాషకు దగ్గరకుగా ఉండేవారు.  మేధావులకు, ఇన్వెస్టర్లకు, బలిసినవాళ్లకు కాదు…గుర్తుంచుకోండి జనాలకు. పాపులారిటిని నాయకుడు పంచడు.జనం అందిస్తారు.

ఇలా ఏదేని నాయకుడున్నపుడు పాపులర్ లీడర్ అవుతాడు. జనం ఆయన కోసం ప్రవాహంలాగా పరుగులు తీస్తారు. జనం ఆయన వెంట పడతారు. ఆయనకు అటు ఇటు అన్నివైపులా నిలబడారు. అభిమానం జన సంద్రమయ్యేది అపుడే.

నిన్న ప్రకాశం జిల్లా కందుకూరు లో అభిమానం జనసంద్రమయింది. జగన్ మాట్లాడే భాష,  లేవదీస్తున్న విషయాలు, ఒక దుస్వప్నాన్ని కాకుండా తమ బతకులకింత భరోసా కల్పిస్తాయనే నమ్మకం కల్పించాయి. అందుకే ఆ కుర్రోడు చెప్పింది వినడానికి, కుర్రోన్నిచూడటానికి జనం ఇదో ఈ విడియోలా చూపినట్లు వస్తున్నారు.

జగన్ జనసంకల్పయాత్ర ప్రారంభించినప్పటినుంచి జనమే జనం. ఆయన చెప్పింది వింటున్నారు. ఎందుకంటే, ఆయన వారికి అర్థమయ్యేది, పనికొచ్చేది చెబుతున్నాడు. మొదట్లో రాయలసీమ కాబట్టి జనం వస్తున్నారని అన్నారు. మరి ఇదే జనం … రాను రాను పెరుగుతూ పోతున్నారు,రాయలసీమకు బయట కూడా. నెల్లూరు జిల్లాలో జన ప్రవాహమే. ఇపుడు ప్రకాశం జిల్లాలో జన సముద్రం. తన చెప్పేవి వినడానికి విశ్వాసంతో వస్తున్న ఈ జనాల ఆశలను జగన్ వమ్ము చేయడని భావిస్తాం.

ఏమయినా సరే, జగన్ ఇపుడు ఆంధ్రలో మరొక  మోస్ట్ పాపులర్ లీడర్ అయ్యారు.

 

 

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *