FLASH టిడిపికి నలుగురు ఎంపిల రాజీనామా

తెలంగాణ ముఖ్యమంత్రి కెసియార్ రాజకీయ వ్యూహం ఢిల్లీకి పాకింది.
రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీఅనేది లేకుండా చేసేందుకు టిఆర్ ఎస్ కనిపెట్టిన వ్యవూహాన్ని బిజెపి అందిపుచ్చుకుంది. టిడిపిలో చీలిక సృష్టించింది. చీలిన వర్గం తాము టిడిపి పార్లమెంటరీ పార్టీని, తాము బిజెపిలో వీలీనం కావాలనుకుంటున్నామని తీర్మానం చేసి, రాజ్యసభ ఛెయిర్మన్ కు ఒక లేఖ అందించారు. బిజెపిలో కలవాలనుకుంటున్న తమ అభ్యర్థనను అంగీకరించాలని వారు బిజెపి అధ్యక్షుడిని కూడా కోరారు.
తెలుగుదేశం పార్టీకి పెద్ద వ్యాపారాస్థులయిన ముగ్గురు ఎంపిలు రాజీనామా చేశారు. వారి పేర్లు ఇటీవల కాలంలో ఐటి దాడులకు గురైన, బ్యాంకు వివాదాలలో చిక్కుకున్న వైఎస్ చౌదరి అలియాస్ సుజనా చౌదరి, ప్రముఖ కాంట్రాక్టర్ సిఎంరమేష్, ప్రముఖ పారిశ్రామిక వేత్త టి జి వెంకటేశ్. నాలుగో ఎంపి జిఎం రావు.
వారంతా రాజ్యసభ ఛెయిర్మన్  వెంకయ్యనాయుడిని కలసి లేఖను సమర్పించారు. తామంతా ప్రధాని నరేంద్ర మోదీ విధానాలతో స్ఫూర్తి పొందామని, దేశం సర్వతో ముఖాభివృద్ధికి ఆయన చేస్తున్న కృష్టితో సంతృప్తి చెందామని  వారు లేఖలోపేర్కొన్నారు. ఫలితంగా ఈ రోజు రాజ్యసభ టిడిపి పార్టీ సమావేశమయి, ఈ పార్టీని బిజెపిలో విలీనం చేయాలని నిర్ణయించామని పేర్కొన్నారు. సమావేశానికి రాజ్యసభ నాయకుడు వైఎస్ చౌదరి, ఉపనాయకుడు సిఎం రమేష్ అధ్యక్షుత వహించారని కూడా లేఖలో పేర్కొన్నారు. రాాజ్యాంగం 10 వ షెడ్యూల్ నాలుగవ పేరా ప్రకారం తాము బిజెపిలో తక్షణ విలీనం కావాలనుకుంటున్నామని  పార్టీ సమావేశం తీర్మానించినట్లు వెంకయ్యనాయుడికి సమర్పించిన లేఖలో పేర్కొన్నారు.
(ఫోటో ANI)