ప్రఖ్యాత గాయకుడు కీత్ ఫ్లింట్ మృతి

బ్రిటిష్ రేవ్ సీన్ బ్యాండ్ ‘ది ప్రొడిజి’ మెగాసింగర్ కీత్ ఫ్లింట్ ఈరోజు చనిపోయారు. ఆయన వయసు 49 సంవత్సరాలు. ఆస్ట్రేలియా టూర్ ముగించుకుని ఇటీవలే వచ్చారు . సోమవారం నాడు ఇంగ్లండ్ ఎసెక్స్ లో ఆయన మరణించి ఉండటాన్ని ప్రజలు కనుగొన్నారు. అయితే, ఇందులో ఆనుమానించేందుకు ఏమీలేదని పోలీసులు చెబుతున్నారు. బ్రిటిష్ అండర్ గ్రౌండ్ రేవ్ సీన్ నుంచి లావాలా పెల్లుబికి ప్రపంచాన్ని తన వైపు తిప్పుకున్న ప్రయోగాత్మక గాయకుడిగా ఫ్లింట్ కు పేరుంది. వొడలంతా పచ్చబొట్టు, బ్లీచ్ చేసిన కోడి మకుటంలాంటి హెయిర్ స్టయిల్ ఫ్లింట్ ట్రేడ్ మార్క్. పిచ్చెక్కించే డాన్స్ బీట్లతో ఆయన సంగీతం వూర్రూత లూగిస్తుంది. ఫైర్ స్టార్టర్, స్మాక్ మౌ బిచ్ ఆప్ ఆయన సూపర్ హిట్ పాటలు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *