Home Breaking 30 సం. కిందట…. వీడే ప్రపంచ జనాభా దినానికి కారణం

30 సం. కిందట…. వీడే ప్రపంచ జనాభా దినానికి కారణం

SHARE
ప్రతి సంవత్సరం జూలై 11న ప్రపంచ జనాభా దినం పాటిస్తారు. దీని వెనక అంతర్జాతీయ ఆందోళన, ఉద్రిక్తత, ఆహార సమస్య, శాంతి సమస్య,పర్యావరణ సమస్యలు ఉన్నాయి.
ఇప్పటికి 30 సంవత్సరాల కిందట ఈ ఆందోళనలు ప్రపంచమంతా ఆవరించిఉన్నాయి. అపుడు, జనాభాను గాలికి వదిలేయడానికి వీల్లేదని, ఇది తీసుకొచ్చే సమస్యల గురించి తీరుబడిగా చర్చించి పరిష్కారం కొనగొనాలనే తపన మొదలయింది.
ఈ నేపథ్యంలో జూలై 11 న ఈ చర్చ జరగాలని నిర్ణయించారు. అందుకే ఆ రోజును ప్రపంచ జనాభా దినంగా పాటించాలని నిర్ణయించారు.
జూలై 11 నే ఎందుకు నిర్ణయించారు?
1987 జూలై 11న ఒక సమయంలో ప్రపంచజనాభా 5 బిలియన్లకు చేరింది.
అయిదో బిలియన్ బేబీ పుట్టింది అనాటి యుగోస్లోవియాలోని జాగ్రెబ్ (ఇపుడు క్రోషియా లో ఉంది)లో . అయిదో బిలియన్ బేబీ గా మాతెజ్ గాస్పర్ అనే 8 పౌండ్ల బాబు ఉదయం 8.35 నిమిషాలకు పుట్టాడు.
జాగ్రెబ్ లోని యూనివర్శిటీ మెడికల్ హాస్పిటల్ లో ఈ బాబు సంజా , డ్రాగుటిన్ గాస్సర్ లకు జన్మించాడు.
ఈ వార్త తెలియగానే అప్పుడు జాగ్రెబ్ లోనే ఉన్న యు.ఎన్ సెక్రెటరీ జనల్ జేవియర్ పెరెజ్ డి క్యుఎల్లెర్ ఆసుపత్రిని సందర్శించి శిశువును తన చేతుల్లోకి తీసుకున్నారు.
ప్రపంచ శాంతిలో ఈ శిశువు జననం ఒక నూతన ఆధ్యాయం ప్రారంభిస్తున్నదని ఆయన బాబు తల్లితండ్రులకు చెప్పారు. బాబు చాలా ముచ్చటగా ఉన్నాడని  ప్రశసించాడు.
పండంటి బాబునుకన్నందుకు తల్లితండ్రులను అభినందించారు.
బాబు అన్ని విధాల ఆరోగ్యంగా ఉన్నాడని ఆసుపత్రి డాక్టర్ చెప్పారు.
వెంటనే యునైటెడ్ నేషన్స్ ఫండ్ ఫర్ పాపులేషన్ యాక్టివిటీస్ (UNFPA) ఆ రోజుని జనాబా ‘అయిదో బిలియన్ దినం’గా ప్రకటించింది.
(ఈ స్టోరీ నచ్చితే అందరికీ షేర్ చేయండి. trendingtelugunews.com ని ఫాలోకండి)
ప్రపంచ జనాభా చాలా వేగంగా పెరుగుతూ ఉంది. నిమిషానికి 150 మంది పిల్లలు అంటే రోజుకు 2,20,000 మంది పిల్లలు పుడుతున్నారు.
అయిదో బిలియన్ బేబీ అనే ల్యాండ్ మార్క్ ఎంచుకున్నా, ఆ బేబీ ఎక్కడ పుడుతుందో ఎవ్వ రికి తెలియదు. అయితే  అయిదో బిలియన్ కు చేరడం జనాభా చరిత్రలో ఒక కీలకఘట్టంగా గుర్తించారు. ఈ బేబీ ని ఎలా గుర్తు పట్టాలి?
అయితే, 1984 నాటి జనాభా పెరుగుదల లెక్కలు పరిగణనలోకి తీసుకుని అయిదో బిలియన్ బేబీ 1987 జూలై 11 పుడుతుందని అంచనా వేశారు. ఇది కేవలం అంచనా మాత్రమే.
మరి జాగ్రెబ్ ని ఎలా నిర్ణయించారు?
ఆ రోజున జాగ్రెబ్ లో ప్రపంచ విశ్వవిద్యాలయాల గేమ్స్ నడుస్తూ ఉన్నాయి. అందువల్ల అయిదో బిలియన్ బేబీని జాగ్రెబ్ నుంచి ఎంపిక చేయాలని నిర్ణయించారు. జాగ్రెబ్ బేబీని లెక్కించారు. ఆకీర్తి మాతెజ్ కు దక్కింది.
ఆసుప్రతిని సందర్శించి బేబీ గాస్పర్ ను పరామర్శించాకా, జనాభా పెరుగుదల,జనాభా తీసుకువచ్చే  సమస్యల గురించి సీరియస్ గా ఆలోచించాల్సిన అవసరం ఉందని సెక్రెటరీ జనల్ చెప్పారు.  ప్రతిసంవత్సం ఒక రోజున ప్రపంచం జనాబా సంబంధ సమస్యల మీద దృష్టి నిలిపితే బాగుంటుందనిపెరెజ్ డి క్యుఎల్లర్ అభిప్రాయపడ్డారు.
ఈ ధీమ్ తోనే అపుడే అక్కడే జాగ్రెబ్ లో UNFPA ఒక నాటకాన్ని కూడా ప్రదర్శించింది.
30 సం. కిందట మొదటి ప్రపంచ జనాభా దినోత్సవం జరిపినపుడు భూమండలం మీద 5.25 బిలియన్ల మనుషులున్నారు. ఇపుడు వారి సంఖ్య 7.7 బిలియన్ లకు చేరింది.
ప్యూ రిసె్ర్చ్ సెంటర్ అధ్యయనం ప్రకారం భారత జనాభా 2100 నాటికి చైనాను అధిగమిస్తుంది. అప్పటికి జనాభా 145 కోట్లు చేరుకుంటుంది.
ఇపుడు ప్రపంచ జనాభా 1.10 శాతం తో పెరుగుతూ ఉంది. అంటే ప్రతిసంవ్సతరం జనాభాకు 83 మిలియన్ల మంది కలుస్తున్నారు.
భారత వంటి దేశాలలో జనాభా పెరుగుతూ ఉంటే, జపాన్, చైనా వంటి దేశాలలో జనాభాపడిపోతూ ఉండటం ఆందోళనకలిగిస్తూఉంది.
ఆదేశాలలో పిల్లలు కనే వాళ్లకి ప్రోత్సాహకాలిస్తున్నారు. జనాభా పడిపోవడం ఆదేశాలలో జాతీయ సమస్య అయింది.

(ఫోటోలు వెబ్ నుంచి)