Home political ఆంధ్రలో నిజంగానే ‘ఇసుక తుఫాన్’ వస్తుందా?

ఆంధ్రలో నిజంగానే ‘ఇసుక తుఫాన్’ వస్తుందా?

SHARE

ఆంధ్ర ప్రదేశ్ ఒక విచిత్ర మయిన పరిస్థితి ఎదుర్కొంటూ ఉంది. రాష్ట్రంలో ఇసుక కొరత తీవ్రస్థాయికి చేరుకుంది. దీనితో వేలది మంది బేల్దారులకు అంటే నిర్మాణపు కార్మికులకు  కూలీ దొరకడం లేదు. దీనికూలి బతికే వీళ్ల కు పనులు లేకపోతే బతుకు దెరువు కష్టమవుతూ ఉంది. శ్రీకాకుళం నుంచి అనంతపురం దాకా 90 శాతం దాకా నిర్మాణపు పనులు ఆగిపోయాయి. ఎక్కడయినా అందుబాటులో ఉంటే వారు  బ్లాక్ లో విక్రయిస్తూ ఉన్నారు. ఇసుక కరువుసరుకయిపోవడం గతంలో ఎపుడూ జరగలేదు.

దీనికి కారణమెవరు?

ప్రతిపక్ష పార్టీలేమో ఇది ముఖ్యమంత్రి జగన్ ప్రభుత్వం సృష్టించిన కృత్రిక కొరత అంటూన్నాయి. కృత్రి కొరత అని విమర్శిస్తూ వెంటనే ఇసుకు నిర్మాణరంగానికి అందుబాటులోకి వచ్చేలా చర్యలు తీసుకోవాలని మాజీ టిడిపి మంత్రి కొల్లు రవీంద్రద 36 గంటల దీక్ష జరిపిన సంగతి తెెలిసిందే.  ఇసుకు కొరతకు కారణం ప్రభుత్వమేనని సిపిఐ కార్యదర్శి  రామకృష్ణ విమర్శించారు.ఇసుక కృత్రిమ  కొరత తీసుకువచ్చి అధికార పార్టీ నాయకులు అమ్ముకుని డబ్బు గడిస్తున్నారని ఆయన విమర్శించారు. ఇసుక కొరతకు కారణం ఇటీవల వర్షాల వల్ల వచ్చిన వరదలేనని ప్రభుత్వం చెప్పడాన్ని ఆయన ఖండించారు. వర్షాలు వరదలు లేని చోట ఇసుకు ఎందుకు మాయమవుతూ ఉందని ఆయన ప్రశ్నించారు.

ఇసుక లేక విజయవాడ నగరంలో నిర్మాణప్పనులు పూర్తిగా స్తంభించిపోయాయని టైమ్ ఆఫ్ ఇండియా రాసింది. అక్కడ ఇసుక  ట్రక్ రు. 15 వేల దాకా అమ్ముడుపోతున్నది. ఇసుక అక్రమ మైనింగ్ ను నిషేధిస్తూ  నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ తీర్పు ఇచ్చాక కృష్నా జిల్లాలో ఇసుకురీచ్ లన్నింటిని మూసేశారు. దీనితో నిర్మాణ రంగంం కుదేలయింది.

ఏ ఏడాది సెప్టెంబర్ నాలుగో తేదీన ప్రభుత్వం కొత్త ఇసుక విధానం ప్రకటించింది. గతంలో టిడిపి ప్రకటించిన ఉచిత ఇసుక విధానాన్ని రద్దు చేస్తూ ప్రకటించిన కొత్త   విధానంలో టన్ను ఇసుకు 370 రుపాయలుగా నిర్ణయించారు. ప్రభుత్వమే ఇసుకను విక్రమయిస్తుంది. దీనికోసం ఆంధ్రప్రదేశ్ మినరల్ డెవెలప్ మెంట్ కార్పొరేషన్ 13 జిల్లాల్లో 41 స్టాక్ పాయింట్లను ఏర్పాటుచేసింది. అయితే, ఇక అందరికి చౌకగా దొరకుతుందునుకున్న ఇసుక ఇపుడు ఏకంగా బంగారమయిపోయింది.

అయితే, ఇసుక కొరతకు కారణం కృష్ణా గొదావరి నదులలో వరదలు రావడమే నని వ్యవసాయ శాఖ మంత్రి  కన్నబాబు చెబుతున్నారు.

దీనిని ప్రతిపక్షాలు అంగీకరించడం లేదు. ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు ఇసుక కొరతకు కారణం జగనేనని విమర్శిస్తున్నారు.‘ ఇసుక కొరత వల్ల కూలిపనులు దొరకక సుమారు 3 లక్షల  నిర్మాణ రంగ కూలీల కుటుంబాలు దసరా పండుగ చేసుకోలేదు. వాళ్లందరికి ఉపాధి పోయింది. దారణమేమిటంటే ఒక లారి లోడు ఇసుక ధర రు. 80 వేల నుంచి రు. 1 లక్ష దాకా పలుకుతూ ఉంది,’ అని చంద్రబాబు నాయుడు విమర్శించారు.

తెలుగుదేశం పార్టీ రాష్ట్రంలో ఇసుక తుఫాను సృష్టించాలనుకుంటున్నట్లు సృష్టించాలనుకుంటున్నది.

మాజీ రెవిన్యూ మంత్రి కె ఇ కృష్ణ మూర్తి ఇసుక కొరత గురించి ఈ రోజు జగన్ ప్రభుత్వం మీద తీవ్రంగా మండిపడ్డారు.

రాష్ట్రంలో ఇసుక రాబోతున్నదని ఆయన హెచ్చరించారు. అడ్డగోలు ఇసుక తవ్వకాలు సాగించడం, అడ్డొచ్చిన వారిని అంతం చేసే స్థాయిలో వైసీపీ ఇసుక మాఫియా పేట్రేగిపోతోంది. ఇసుక విషంలో ప్రభుత్వం క్రియాశీలంగా వ్యవహరించకపోతే ఇసుక తుపానులో ఈ ప్రభుత్వం కొట్టుకుపోవడం ఖాయం అని మాజీ మంత్రి కె.ఇ.కృష్ణ‌మూర్తి శ‌నివారం విడుద‌ల చేశారు.

‘సామాన్యుడికి ట్రాక్టర్‌ ఇసుక కూడా దొరకని విధంగా వైసీపీ నాయకులు ఇసుక మాఫియాను నడుపుతున్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, స్థానిక నాయకులు ఇసుక మాఫియాలకు డాన్‌లుగా మారారు. జగన్‌ నిరంకుశాన్ని చూసి రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు పారిశ్రామిక వేత్తలు సైతం భయపడుతున్నారు. రాష్ట్రంలోని వైసీపీ నాయకులు, కార్యకర్తల జేబులు నింపడం కోసమే ప్రభుత్వం ఇసుక కృత్రిమ కొరతను సృష్టించింది,’ ఆయన విమర్శించారు.

ఇసుక కొరత తీవ్రంగా ఉందని,కూలీలు ఉపాధి కోల్పోతున్నారని ప్రతిక్ష పార్టీలు చేస్తున్న విమర్శయే కాదు. హైదరాబాద్ కు చెందిన సీనియర్ జర్నలిస్లు కూర్మనాథ్ వాళ్ల నాన్నగారి అనుభవం ఏమిటో కూడా ట్వీట్ చేశారు. ఇదిగో చూడండి

టిడిపి ఇసుక కొరత వరదల వచ్చిందా లేక పార్టీనేతలకు నాలుగు డబ్బుల లభించే విధంగా  వైసిపి ప్రభుత్వమే  కొరత  సృష్టించిందా అనేది ఇపుడు రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారింది. మొత్తానికి రాష్ట్రాన్ని ఇసుక కొరత తీవ్రంగా పీడిస్తూ ఉంది. ఇది సామాన్యులు కొనలేని సరుకయిందనేది నూటికి నూరు శాతం నిజం.   ఈ నేపథ్యంలో టిడిపి ఇసుక  ఉద్యమం లేస్తుందా?. కెయి కృష్ణ మూర్తి అన్నట్లు రాష్ట్రంలో ఇసుకతుఫాన్ లేస్తుందా?

(Photo source: Down to Earth)