బిజెపి అంటే టిడిపిలో ఎంత మార్పు వచ్చిందో …

ఎన్డీయే ప్రభుత్వం నుంచి వైదొలిగాక తెలుగుదేశం పార్టీలో చాలా మార్పు వచ్చింది. ఈ పార్టీ నేతలు అసలు తాము ఎన్డీయేలో నిన్నమొన్నటి దాకా భాగస్వాములమేనని, అంతో ఇంతో లబ్ది పొందామనే విషయాన్ని కూడా మర్చిపోయి,ప్రధాని మోదీ నాయకత్వంలోని ఎన్డీయేని తెగ తిడుతున్నారు. ఈ రోజు విజయవాడలో పార్టీనేత వర్ల రామయ్య ఎన్డీయేని తిట్టిన తిట్లు చూస్తే ఇది అర్థమవుతుంది. కొంచెం ఎబ్బెట్టుగా కూడా అనిపిస్తుంది.రామయ్య అన్న మాటలు చదవండి.

‘‘ఎన్డీయే ప్రభుత్వం దళిత వ్యతిరేక విధానాలను అనుసరిస్తుంది. మొట్టమొదటి నుంచి బీజేపీ దళితులకు వ్యతిరేకియే…’’ అని వర్ల రామయ్య విమర్శించారు. అంతేనా, ఎన్డీయే ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక దళితులపై దాడులు పెరిగాయి అని కూడా అన్నారు. ఒక నెల కిందట దాకా టిడిపికూడా ఎన్డీయే లో భాగమే అని మర్చిపోతే ఎలా.

‘‘ నేషనల్ క్రైమ్ రికార్డ్స్ ప్రకారం దేశంలో 15 నిమిషాలకు ఒక దళితుడు మీద దాడి జరుగుతున్నది. ప్రతి రోజు దేశంలో ఆరుగురు దళిత మహిళల పై అత్యాచారాలు జరుగుతున్నాయి. స్వరాజ్య భారత దేశం అంటే ఇదేనా? దళితులు భారతదేశం లో బాగ్యాస్వాములు కారా?’ అంటూ ఆయన ఆవేశం వూగిపోయారు.

మార్చ్ 26న సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుకు బీజేపీనే కారణమని కూడా ఆయన ఆరోపించారు. ఆయన ఇంకా ఏమన్నారో చూడండి:

మొట్టమొదటి నుంచి దళిత వర్గాన్ని అంటరాని తనంగానే బీజేపీ చూస్తున్నది. బీజేపీ అధికారంలో ఉన్న ఉత్తరప్రదేశ్ లో 10,426 కేసులు నమోదయ్యాయి

యూపీ లో ముఖ్యమంత్రి అదిత్యనాథ్ పర్యటనలో దళితులకు సబ్బులు షాంపూలు ఇచ్చారు. ఎన్డీయే ప్రభుత్వం దళితులకు క్షమాపణ చెప్పాలి. ఎవరైనా చట్టాన్ని దుర్వినియోగపరిస్తే వారిని శిక్షించాలి . దళితుల ఆత్మ గౌరవాన్ని కాపాడాల్సిన బాధ్యత బీజేపీపై ఉంది

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *