గీ పత్రిక సదవితే ఎసోంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవ్ …

సోషల్ మీడియా సోది

పొద్దు పొద్దుగాల్నే మనసు ప్రశాంతంగా ఉండాల్నంటే యోగా జాగింగ్ మెడిటేషన్ లాంటియి అవసరం లేదు.. ఒక్క పది నిమిషాలు నమస్తే తెలంగాణ సదివితే సాలు అంతా మంచిగుంది అనిపిస్తది.. అసలు ఒక్క నెగెటివ్ న్యూస్ లేకుండ పాజిటీవ్ థింకింగ్ తో రాశిన వార్తలు సదువుతుంటే మనసంత నిమ్మలమయితది..

*చకచకా డబుల్ బెడ్రూం ఇండ్లు, వడివడిగా మిషన్ భగీరథ (అబ్బా ఆ రైమింగ్ కే కండ్లకు మనసుకు ఎంత హాయి)

*ప్రైవేటు యూనివర్సిటీలతో ఉజ్వల భవిష్యత్తు.. ( ఏందో వీళ్ళేం చెప్పినా నమ్మాలనిపిస్తది.. అప్పట్ల ప్రైవేటుపరం చేశిర్రు అంత అంటే బట్టలు చింపుకున్నం ఇప్పుడు ప్రైవేటే నయ్యం అంటే పాత బట్టలన్ని కుట్టుకోవాలనిపిస్తంది మల్ల)

*ఇంక టీఆరెస్ లకు భారీగా వలసలు, మన పోలీస్ దేశంల నెంబర్ 1, రాష్ట్ర పనితీరు భేష్, రేపటి తరాలకు తెలంగాణ ఘనకీర్తి (అబ్బబ్బా వింటుంటే నరాలన్నీ నాగిని డాన్స్ చేస్తున్నయి)

*వైద్యవిధాన పరిషత్ల 9976 పోస్టులు, పోలీసు శాఖల 18000 పోస్టులు ( ఆహా.. ఎంత మధురం.. ఇంతకముందు పోస్టులల్ల సగం కోర్టులల్లనే ఉన్నా ఇవన్నీ నోటిఫికేషన్ ముందే ఇచ్చేసినట్టు ఎంత బాగుందో చూడడానికి)

ఇవే కాదు ఒక్కో హెడ్డింగ్ ఒక్కో యోగా ఆసనం.. రోజుకు పది న్యూసులన్న చదువుర్రి ఒంటికి మంచిది.. అప్పట్ల రామరాజ్యం అన్నరు వినుడే కాని దానికంటే తోపు మన కల్వకుంట్ల రాజ్యం..

మేము పొద్దుపొద్దుగాల్నే లేశి పెప్సొడెంట్ పేస్టుతోని పండ్లు తోముకొని మొకం కడుక్కోని శాయిల ఇన్ని చేగోడీలు ఏస్కొని అది జరంత నానినంక నమస్తే తెలంగాణ పేపరు ముందు పెట్టుకొని శాయి ఐపోయేదాకా నిమ్మలంగ సదువుతం.. మా ఇంటిల్లిపాది ఇదే సదువుతం.. అప్పుడు మా మనసు ప్రశాంతంగా ఉంటుంది.. మాకు ఇది సదువుడు మస్తు ఇష్టం..

నమస్తే తెలంగాణ – ఎసోంటి సైడ్ ఎఫెక్ట్స్ లేని పత్రిక..

 

(వాట్సాప్ లో తెగ షేర్ అవుతూఉంది ఈ కాలమ్. చాలా చక్కగా రాసిన ఈ రైటప్ ను వాడకుండా ఉండలేకపోతున్నాం. రైటర్ ఎవరో అజ్జాత వాసి. పేరు రాయలేకపోతున్నాం.మన్నించాలి)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *