ఆర్టీసిని ప్రభుత్వంలో విలీనం చేస్తామని చెప్పనే లేదు : మంత్రి పువ్వాడ

తెలంగాణ రవాణా మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ముఖ్యమంత్రి కెసిఆర్ మనసులోని మాట చెప్పేశారు. ఆర్టీసిని  ప్రభుత్వం లో విలీనం చేస్తామని చెప్పనే లేదు పొమ్మన్నారు.‘మా ఎన్నికల మానిఫెస్టో లో ఎక్కడా కూడా ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తామని చెప్పలేదు,’ అని చాలా స్పష్టంగా చెప్పారు.
సమ్మె పై ప్రభుత్వం తన విదానాన్ని నాలుగో తారీకున చెప్పామని, సమ్మెను సమర్దతంగా ఎదుర్కొని ప్రజలను వారి గమ్య స్థానాలకు చేర్చామని ప్రకటించారు.
చర్చల నుండి వెల్లిపోయింది కార్మిక సంఘం నాయకులేనని అంటూ సమ్మె చట్ట విరుద్దమని మరొక సారి చెప్పారు.
ఆయన  ఇంకా ఏమన్నారంటే…
7358 వాహనాలను ప్రజల అవసరాల కోసం వాడుతున్నము.
కార్మిక సంఘాలను అడ్డుపెట్టుకుని ప్రతిపక్షాలు మాట్లాడుతున్నయి.  మీరు ప్రజలకను ఇబ్బందులను గురిచేసే చర్యలను సమర్థిస్తరా..
మీ ప్రభుత్వాలు అధికారంలో ఉన్న చోట ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసారా..
అసంబద్ధ ఆరోపణలు చేస్తే ప్రజలు మిమ్మల్ని చీదరించుకుంటారు.
ఇలా చేసినందుకే గత ఎన్నికల్లో కర్రు కాల్చి వాత పెట్టారు. తెలంగాణ ఏర్పడినప్పుడు
ఆర్టీసీ ఆస్తుల విలువ 4416 కోట్లు. ఆర్టీసీని ఎప్పుడు ప్రైవేట్ పరం చేస్తామని చెప్పలేదు.
పదమూడు కోట్లు నష్టాల్లో ఉన్నప్పుడు అప్పటి రవాణా శాఖ మంత్రి గా ఉన్న కేసియార్ గారు 14 కోట్లకు లాభాలు తెచ్చారు. పండగ సమయంలో సమ్మెకు వెల్లి ప్రభుత్వానికి చెడ్డపేరు తేవాలని చూశారు. కానీ బెడిసికొట్టింది. బీజేపీ ప్రభుత్వాం రైల్లనే ప్రైవేట్ పరం చేస్తుంది. ప్రతిపక్షాలు బాధ్యతాయుతంగా మాట్లాడాలి. కార్మికులు విదుల్లోకి రాకున్న ప్రజా రవాణా సాఫీగానే సాగుతుంది.
ప్రతి సంవత్సరం ఐదు లక్షల వాహనాలు రోడ్లపైకి వస్తున్నాయి.ప్రయాణికులు తమ రవాణా సౌకర్యాలు మార్చుకుంటున్నప్పుడు, ఆర్టీసీ కూడా మారాలి. సూపర్ వైజర్లను కూడా సమ్మెలోకి తీసుకెల్లారు. వీరు గతంలో ఎన్నడు సమ్మెలోకి వెల్లలేదు. వీరి ద్వారానే టికెటింగ్ మిషన్ లు ఇచ్చే అవకాశం ఉండేది.
పోలీస్, రవాణా శాఖల సమన్వయం తో అధిక చార్జీలు వసూలు చేయడం పై చర్యలు తీసుకుంటున్నము. బస్ పాస్ లు అన్ని పని చేస్తయి.