పవన్ కళ్యాణ్ కు టిజి వెంకటేష్ చురకలు

ఆంధ్రా రాజకీయాలు రసవత్తరంగా సాగుతున్నాయి. ఆంధ్రాలో రానున్న ఎన్నికల్లో టిడిపి, జనసేన పొత్తు పెట్టుకోబోతున్నట్లు  టిడిపి ఎంపి టిజి వెంకటేష్ చేసిన కామెంట్స్ పై పవన్ కళ్యాణ్ అగ్గి మీద గుగ్గిలమయ్యారు. పొత్తులపై తనలాంటి కార్యకర్తలు కాకుండా పార్టీల అధినేతలు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ లే నిర్ణయం తీసుకుంటారని అన్నారు.

టిజి వెంకటేష్ కామెంట్స్ పై పవన్ కళ్యాణ్ సీరియస్ అయ్యారు. టిజి వెంకటేష్ పిచ్చి పిచ్చిగా మాట్లాడితే సహించేదిలేదన్నారు. నదుల్ని, పర్యవరణాన్ని టిజి వెంకటేష్ కలుషితం చేస్తున్నాడని మండిపడ్డారు. తాను వద్దని కింద పడేసిన రాజ్యసభ సీటును టిజి వెంకటేష్ తీసుకున్నాడని విమర్శించారు.

వెంటనే పవన్ వ్యాఖ్యలపై టిజి వెంకటేష్ స్పందించారు. తన మాటల్లో ఎక్కడ కూడా చిన్నపొరపాటు కూడా లేదన్నారు. అయినా పవన్ కళ్యాణ్ అంతగా ఎందుకు సీరియస్ గా రియాక్ట్ అయ్యారో అర్థం కావడంలేదన్నారు. తనను పెద్ద మనిషి అని పవన్ కామెంట్ చేసినందుకు ధన్యవాదాలు తెలిపారు.

పవన్ కళ్యాణ్ మంచి భవిష్యత్తు ఉన్న నాయకుడు అని తాను భావిస్తున్నట్లు చెప్పారు. అయినా తన వ్యాఖ్యల్లో ఎక్కడ కూడా పవన్ ను కించపరిచేలా కానీ, ఆక్షేపనీయమైనవి కానీ చేయలేదన్నారు.

తాను ఏం మాట్లాడానో పవన్ ఒకసారి విని స్పందిస్తే బాగుంటుందన్నారు. పొత్తులపై తానేమీ అనవసర కామెంట్స్ చేయలేదన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *