Home Breaking టీడీపీకి మరో షాక్: వైసీపీలోకి రాంపుల్లారెడ్డి సోదరులు

టీడీపీకి మరో షాక్: వైసీపీలోకి రాంపుల్లారెడ్డి సోదరులు

SHARE

ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీలోకి వలసల పరంపర కొనసాగుతూనే ఉంది. టీడీపీ సీనియర్ నేతలు పార్టీని వీడి ఒక్కొక్కరిగా వైసీపీ తీర్ధం పుచ్చుకుంటున్నారు. వరుసగా నేతలు టీడీపీకి గుడ్ బై చెప్పి వైసీపీలో చేరడం రాష్ట్రంలో సంచలనంగా మారింది. శనివారం నంద్యాల టీడీపీ సీనియర్ నేతలు వైసీపీ తీర్ధం పుచ్చుకున్నారు.

ఆళ్లగడ్డ టీడీపీ నాయకులు రాంపుల్లారెడ్డి సోదరులు శనివారం లోటస్ పాండ్ లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ తో భేటీ అయ్యారు. జగన్ పార్టీ కండువా కప్పి వారిని పార్టీలోకి ఆహ్వానించారు. గంగుల కుటుంబంతో శత్రుత్వం లేదన్న రాంపుల్లారెడ్డి జగన్ ఆదేశాలు;ఆ మేరకు వారితో కలిసి పని చేస్తామని తెలిపారు.