Home Breaking టాలీవుడ్ లో విషాదం: ప్రముఖ దర్శకుడు మృతి

టాలీవుడ్ లో విషాదం: ప్రముఖ దర్శకుడు మృతి

SHARE

టాలీవుడ్ లో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ దర్శకుడు కోడి రామకృష్ణ శుక్రవారం కన్నుమూశారు. గత కొద్దిరోజులుగా ఆయన అనారోగ్యంతో బాధ పడుతున్నారు. గురువారం ఉదయం ఆయన అనారోగ్యానికి గురవడంతో కుటుంబసభ్యులు ఆయన్ని గచ్చిబౌలిలోని ఏఐజీ హాస్పిటల్ కి తరలించారు. హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న ఆయన ఈరోజు మరణించారు. వంద పైగా సినిమాలకు దర్శకత్వం వహించిన కోడి రామకృష్ణ ఇక లేరని తెలిసి టాలీవుడ్ ప్రముఖులు దిగ్భ్రాంతికి గురయ్యారు.

చిరంజీవి, బాలకృష్ణ తరంనాటి ఎందరో టాప్ హీరోలకు మంచి హిట్ చిత్రాలు అందించారు కోడి రామకృష్ణ. తెలుగు, తమిళం, మలయాళం, హిందీ భాషల్లో ఈయన ఎన్నో సినిమాలు తీశారు. పలు హిట్ చిత్రాలకు దర్శకత్వం వహించిన ఈయన పది నంది పురస్కారాలు, రెండు ఫిలిం ఫేర్ అవార్డులు కైవసం చేసుకున్నారు. అమ్మోరు, అరుంధతి వంటి ఫిమేల్ ఓరియెంటెడ్ సినిమాలతో సౌందర్య, అనుష్కలాంటి హీరోయిన్లను టాప్ పొజిషన్ కు తీసుకెళ్లిన ఘనత ఆయనదే. తనను టాప్ ప్లేస్ లో నిలబెట్టిన కోడి రామకృష్ణ ఇక లేరని తెలిసి అనుష్క తీవ్ర మనస్థాపానికి గురైనట్లు సమాచారం.