Home political పిల్లలు స్కూల్ మానేయకుండా ఈ టీచర్లు ఈవెనింగ్ మీల్స్ పెడుతున్నారు

పిల్లలు స్కూల్ మానేయకుండా ఈ టీచర్లు ఈవెనింగ్ మీల్స్ పెడుతున్నారు

SHARE

చెన్నైలోషావుకార్ పేట అనే ప్రాంతం ఉంది. అయితే, అక్కడకాలనీలలో ఉండే వాళ్లంతా పేద వాళ్లు. కూలీనాలీ చేసుకుని బతికే వాళ్లు.

అక్కడ ఒక పాఠశాల ఉంది. అది చెప్పుకోవడానికి చాలా ఘనమయిన చరిత్ర ఉన్న ప్రభుత్వం ఎయిడెడ్ పాఠశాల. అయితే ఈ షావ్ కార్ పేట స్కూల్లో చదువుకోవడానికి వచ్చే వాళ్లంతా పేదల పిల్లలే.  అంతా వాళ్లకుటుంబాలలో మొట్టమొదటిసారి పలకబలపం పట్టి అక్షరమ్ముక్క నేర్చుకుంటున్న వాళ్లు.

అందుకే ఈ పాఠశాలలోని టీచర్లకు ఈ పిల్లలంటే వల్ల మాలిన అభిమానం. పేదల పిల్లలు స్కూల్ ఈజీగా మానేస్తారని వాళ్లకి తెలుసు.ఏమిచేసైనా సరే వాళ్ల స్కూలు మానకుండా చూడాలని నిర్ణయించారు. ఏంచేశారో చూడండి…

చాలా మంది పిల్లలు ఈ మధ్య పాఠ శాల మానేస్తున్నారు. ఇది వాళ్లని బాధించింది. కారణమేమిటో కనుక్కోవాలని టీచర్లు భావించారు.

పిల్లలుస్కూలెందుకు మానేస్తున్నారని షావుకార్ పేటలో ఎంక్వయిరీ చేశారు.

చివరకు తెలిందేమిటంటే, ఇక్కడున్న చాలా కుటుంబాలు కడుపేదరికంతో ఉంటాయి. కొన్ని మగదిక్కులేని కుటుంబాలు. చాలా కుటుంబాలలో పిల్లలకి తిండి పెట్టడానికి తల్లులు తిండిమానేస్తున్న సందర్భాలు కూడా ఉంటున్నాయి.

ఇలాంటి వాతావరణంలో చదవుకోవడం కష్టం. స్కూల్ లో మధ్యాహ్నం భోజనం ఉంది. మరి రాత్రి భోజనమెట్లా?

ఈ రాత్రి భోజనం లేక చాలా మంది పిల్లలు చదవులు మానేస్తున్నారని వారికి తెలిసింది. దీన్నిలాగే వదిలేస్తే పిల్లలో ఎక్కడో ఒక బాలకార్మికులుగా సెటిలయ్యే ప్రమాదం ఉంది.  దీనికొక పరిష్కారం కనుక్కోవాలని టీచర్లంతా నిర్ణయించారు. కనుక్కున్నారు.

తలా వో వెయ్యి ప్రతినెల ఖర్చు చేసి ప్రతిరోజు స్కూలు పిల్లలందరికి సాయంత్ర భోజనం ఏర్పాటుచేసి ఎవరూ స్కూల్ మానకుండా జాగ్రత్త తీసుకోవాలని నిర్ణయించారు.

అంతే, 130 సంవత్సరాల చరిత్ర ఉన్న చెన్నై షావ్ కార్ పేట స్కూల్లో ఇపుడు సాయంత్ర భోజనం మొదలయింది.

దేశంలో ఇలా టీచర్లే సొంత చందాలతో  సాయంత్ర భోజనం అమలుచేస్తున్న స్కూలు ఇదేనేమో!

చెన్నై షావ్ కార్ పేట జార్జిటౌన్ ఏరియాలో ఉంటుంది. దీనికే బ్లాక్ టౌన్ అని కూడా పేరుంది. ఎపుడో బ్రిటిష్ వాళ్లు ఏర్పాటు చేసిన కాలనీలు ఇవి. బాగా ఇరుకిరుకు సందులున్న ఏరియా. ఇది చాలా పాత చెన్నపట్టణం కాబట్టి ఇక్కడ అనేక పురాతనమయిన భవనాలున్నాయి.

అందులో ఒకటి మద్రాస్ ప్రొగ్రెసివ్ యూనియన్ హైయ్యర్ సెకండరీ స్కూల్ స్కూల్. సుదీర్ఘ చరిత్ర ఉన్న చెన్నైభవనాలలో ఇదొకటి.

1888లో ఈ స్కూల్ ను ఏర్పాటుచేశారు. వందేళ్ల పైబడిన చరిత్ర ఉన్న చెన్నై పాఠశాలలో ఇదొకటి.

స్కూల్లో దాదాపు 275మంది పిల్లలున్నారు. ఇపుడు ఈ పిల్లలందరికి వారానికి ఐదు రోజుల పాటు సాయంత్రం భోజనం కూడా అందిస్తున్నారు.

సాయంత్ర భోజనం మొదలుపెట్టాక, పిల్లలెవరూ స్కూల్ మానేయడలేదని స్కూల్ ప్రిన్సిపల్ ఎం నిర్మల టైమ్స్ ఆఫ్ ఇండియాకు చెబుతూ సంతోషం వ్యక్తం చేశారు.

‘స్కూల్ సమీపంలో ఉండే వాల్ టాక్స్ కాలనీ, పెరియమెట్ కాలనీలలో ఉండే పేద కుటంబాలనుంచి వీరంతా వస్తున్నారు. అయితే, భోజనం లేక స్కూలు మానేస్తున్నారన్న విషయం మమ్మల్ని బాధించింది. అందుకే టీచర్లందరం సొంత విరాళంతో సాయంత్రం భోజనం పెట్టాలనుకున్నాం. మొదట వారానికి మూడు రోజులు పెట్టాం. ఇపుడు దానిని ఐదు రోజులకు పెంచామ,’ ఆమె చెప్పారు.

‘సాయంత్ర భోజనానికి ప్రతి టీచర్ నెలకు వేయిరుపాయంలందిస్తారు.

విద్యార్థులను సంప్రతించాకే ఏం వంట చేయాలని నిర్ణయిస్తాం.మధ్యాహ్న భోజనం తయారుచేసే వర్కర్లే రాత్రి భోజనం కూడా తయారు చేస్తారు. వీళ్లకి తోడు ప్రతిరోజు ఇద్దరు టీచర్లు సాయంత్రం భోజనం డ్యూటీలో ఉంటారని ప్రిన్సిపల్ చెప్పారు.

మహిళా టీచర్లే కాకుండా పురుషులు కూడా కిచెన్ డ్యూటీ చేస్తారని కూడా ఆమె చెప్పారు.

‘మాకు ఇంట్లో తక్కువయినా మా పిల్లవాడు స్కూల్లో చక్కగా భోజనం చేస్తున్నాడని మాకు సంతోషంగా ఉంది. వాడు ఇంటి దగ్గిర తినేటపుడు అందరికి సర్దుబాటు చేయాలి కాబట్టి ఎవరికీ కడుపు నిండా తిండి ఉండేదికాదు,’ అని ఒక విద్యార్థి తల్లి అముత సంతోషం వ్యక్తం చేసింది.

Photo : source 1 source 2

(ఈ రిపోర్టు నచ్చితే మీ మిత్రులకూ షేర్ చేయండి)