జ‌గ‌న్‌కి కేంద్ర ప్రభుత్వం సీరియస్ వార్నింగ్

ఏపీ ఎన్నికల సమయంలో వైసీపీకి టీఆరెస్ పార్టీ మద్దతుగా నిలిచింది. తెలంగాణ సీఎం కెసిఆర్, ఆయన తనయుడు కేటీఆర్ చంద్రబాబుకి వ్యతిరేకంగా ఏపీలో టీడీపీ గెలవడానికి తమవంతు కృషి చేసిన విషయం బహిర్గతమే. ఈ విషయంలో వైసీపీ తీవ్ర స్థాయిలో విమర్శలు కూడా ఎదుర్కొంది. ఇక జగన్ కూడా కేసీఆర్ తో కృతజ్ఞతాభావంతో మెలుగుతున్నారు. ఐతే తెలంగాణ విషయంలో జగన్ తీసుకుంటున్న నిర్ణయాలు ఏపీ ప్రజల్లో కొంత ఆందోళన కలిగిస్తున్నాయి అనడంలో అతిశయోక్తి లేదు.

ఇలాంటి పరిస్థితుల్లో టీడీపీ ప్రభుత్వ హయాంలో తెలంగాణతో జరిగిన ఒప్పందాలను అవసరమైతే రద్దు చేస్తామని ప్రకటించడం చర్చనీయాంశంగా మారింది. జగన్ చేసిన ప్రకటనపై కేంద్ర ప్రభుత్వం స్పందించింది. జగన్ కి హెచ్చరికలు జారీ చేసింది. ఈ మేరకు కేంద్ర ఇంధన శాఖ కార్యదర్శి ఆనందకుమార్ ఏపీ సీఎస్ సుబ్రహ్మణ్యంకు లేఖ రాశారు.

విద్యుత్ ఒప్పందాలను పునఃపరిశీలించడం మంచిది కాదని, ఇది పారిశ్రమిక అభివృద్ధికి ఆటంకం కలిగిస్తుందని ఆయన లేఖలో పేర్కొన్నారు. ఒప్పందంలో ఏదైనా కుట్ర జరిగినపుడో లేదంటే మితిమీరిన లబ్ది చేకూరిందని రుజువైతేనో పునఃపరిశీలన చేస్తారని తెలిపారు. లేనిపక్షంలో అలా చేయకూడదని స్పష్టం చేశారు.

జగన్ చేసిన ప్రకటన పెట్టుబడిదారుల నమ్మకాన్ని దెబ్బతీస్తుందని, పెట్టుబడిదారులు మళ్ళీ పెట్టుబడి పెట్టాలంటే వెనకడుగు వేస్తారని కేంద్రం సూచించింది. సెంట్రల్ ఎలక్ట్రిసిటీ రెగ్యూలేటరీ కమిషన్ నిబంధనల ప్రకారమే రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందాలు చేసుకుంటుందని, అది కూడా వేలం ప్రక్రియలో సాగుతుందని లేఖలో తెలిపింది.

2022 నాటికి 175 గిగా వాట్ల పునరుట్పదకశక్తి సాధించాలని కేంద్రం లక్ష్యం పెట్టుకుందని, ఇలాంటి సమయంలో ఏపీ విద్యుత్ కొనుగోలుపై పునఃపరిశీలన జరపాలనడం సరికాదని వైసీపీ ప్రభుత్వానికి సీరస్ వార్నింగ్ ఇచ్చింది కేంద్రం. జగన్ కి వాస్తవాలు అర్థమయ్యేలా వివరించాలని సుబ్రమణ్యంకు సూచించింది కేంద్ర ఇంధనశాఖ. సీఎస్ కి కేంద్రం పంపిన లేఖ కింద ఉంది చూడండి.


.