కాంగ్రెస్‌లో చేరిన త‌ర్వాత తొలిసారి గాంధీ భవన్ లో కాలు పెట్టిన‌ నాగం ఏమ‌న్నారో తెలుసా?

కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాత తొలిసారి గాంధీభవన్‌కు వచ్చిన నాగం జ‌నార్ధ‌న్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న టీఆర్ఎస్ పార్టీని తూర్పార‌ప‌ట్టారు. టీఆర్ఎస్ ,కేసీఆర్ అవినీతిని బయట పెట్టేందుకే కాంగ్రెస్ లో చేరాన‌ని, టికెట్ కోసం, సీట్లకోసం కాదన్నారు. కాంగ్రెస్‌వి ఆపదమొక్కులు, అమలుకాని హామీలు అని మంగ‌ళ‌వారం కేసీఆర్ చేసిన వ్యాఖ్య‌ల‌పై నాగం జ‌నార్ధ‌న్ రెడ్డి ఘాటుగా స్పందించారు. రైతులను మోసం చేసిన వ్యక్తుల్లో మొదటి వ్యక్తి కేసీఆర్ అని ఆయ‌న వ్యాఖ్యానించారు. టీఆర్ఎస్ దశలవారీగా రుణమాఫీ చేయడం రైతులకు ఏమాత్రం ఉపయోగపడలేదన్న నాగం, వ‌చ్చే ఎన్నిక‌ల్లో కాంగ్రెస్‌ను గెలిపిస్తే రైతులకు 2 లక్షల రుణమాఫీ చేస్తామ‌ని తెలిపారు.

అవినీతిని రూపుమాపుతామ‌ని,రెండు లక్షల రుణమాఫీ ఒక్కదఫాలోనే చేసి చూపిస్తామ‌ని నాగం జ‌నార్థ‌న్ రెడ్డి పేర్కొన్నారు.కాంగ్రెస్ ప్ర‌క‌టించిన‌ రెండు లక్షల రుణమాఫీ హామీపై ప్రజలకు విశ్వాసముంద‌న్నారు. కౌలు రైతులకు కూడా పెట్టుబడి సాయం అందించాలని డిమాండ్ చేస్తున్నామ‌న్నారు నాగం. కేసీఆర్ ప్ర‌భుత్వాన్ని నమ్మి రైతులు మొక్కజొన్న పంట వేసుకున్నార‌ని, అయితే మొక్కజొన్న ఎండిపోతే కరువు మండలాలను ప్రకటించలేదని విమ‌ర్శించారు..పత్తి వేసుకోవద్దు…మొక్కజొన్న వేసుకోవాలని టామ్ టామ్ చేసింది నిజామా కాదా…? అని కేసీఆర్‌ను నాగం జ‌నార్థ‌న్ రెడ్డి ప్ర‌శ్నించారు.వేరుశనగ పంట వేసుకున్న రైతులు క్వింటాకు 12వందలు నష్టపోతున్నార‌ని,ఇంత నష్టపోతుంటే రైతుల‌కు 4వేలు మాత్ర‌మే ఆదుతున్నాయ‌ని ఆయ‌న‌ స్ప‌ష్టం చేశారు.

తాను ఎక్కడినుంచి పోటీ చేయాలనేది నిర్ణయించేది అధిష్టానమేన్న నాగం,అందరం కలిసే పనిచేస్తామ‌ని, త‌న‌కు ఎవ్వరితో విభేదాలు లేవన్నారు. త‌న ప్రధాన శత్రువు trs పార్టీనేన‌ని,తెలంగాణ కోసం బీజేపీ లో చేరుతున్నాన‌ని, బీజేపీ లో చేరే స‌మ‌యంలో చెప్పాన‌ని ఆయ‌న అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *