అంగారకుడి మీదకు వెళ్తున్న వేంకటేశ్వర స్వామి పేరు

తిరుమల ఏడుకోండల వాడు అంగాకరక యాత్ర చేస్తున్నాడు. నిజం. అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ (NASA) స్వామి వారిని అంగారకుడికి పరిచయం చేస్తూంది.
2020 లో అంగారకుడి మీదకు అమెరికా పంపిస్తున్న రోవర్ లోని మైక్రో చిప్ లో వేంకటేశ్వర స్వామి లిఖిస్తున్నారు.
ఈవిషయాన్ని నేషనల్ మిషన్ అప్ మాన్యుస్క్రిప్ట్స్ మాజీ డైరెక్టర్ వి. వెంకటరామిరెడ్డి తిరుపతిలో చెప్పారు.
స్వామిపేరును తాను నాసాకు ప్రతిపాదించానని, స్వామీ పేరుమీద నాసా అఫిషియల్ వెబ్ సైట్ నుంచి తనకు సువెనీర్ బోర్డింగ్ పాస్ లభించిందని ఆయన చెప్పారు.
మైక్రోచిప్ మీద 10 మిలియన్ ల పేర్లుంటాయి. అందులోకి వేంకటేశ్వరా స్వామి పేరు ను చేర్చారని నాసా చెప్పిందని ఆయన తెలిపారు.
మార్స్ రోవర్ చిప్ మీద పేర్లను లిఖించేందుకు ప్రతిపాదనలను నాసా ‘Send Your Name to Mars’ పేరు మీద కోరిందని, పేర్లు పంపించాల్సిన గడువు మంగళవారం ముగిసిందని ఆయన చెప్పారు.
తాను ప్రధాని మోదీ మద్దుతు దారుడు కావడమే కాకుండా వేంకటేశ్వర స్వామి భక్తుడినని రెడ్డి చెప్పుకున్నారు.
నాసా జూలై 2020లో అంగారకుడి మీదకు రోవర్ ను పంపిస్తూ ఉంది. నాసా అంతరిక్ష నౌక ఒక ఏడాది తర్వాత 2021లో అంగారకుడి మీద దిగుతుంది. అంగారకుడి మీద గతంలో ఎపుడైనా ప్రాణి జీవించి ఉందా,గ్రహస్వభావం, వాతావరణం,అంగారక గర్భ నమూనాలను పరశీలిస్తుంది.