హర్యానా ఎన్నికల్లో సెన్సేషన్ ఈ పోరడే, వయసు పన్నెండేళ్లు

హర్యానా ఎన్నికల ప్రచారంతో వేడెక్కింది. ప్రచారం జొరుగాసాగుతూ ఉంది. అయితే,హర్యానా ఎన్నికల రంగంలోకి ఒక కొత్త స్టార్ ప్రత్యక్ష మయ్యాడు. ఆయన రాజకీయ నాయకుడు కాదు, ఎన్నికల్లో అక్రమాలను అరికట్టేందుకు   కంకణం కట్టుకున్న ఎన్నికల అధికారి కాదు. అయన పన్నెండేళ్ల పోరగాడు, చదవేది తొమ్మదితో తరగతి. స్కూల్ నుంచి పర్మిషన్ తీసుకుని జర్నలిస్టు అవతారమెత్తుతున్నాడు. రాజకీయ నాయకులును, ముఖ్యమంత్రులను, మాజీ ముఖ్యమంత్రులను,  ముఖ్యమంత్రి కావాలనుకుంటున్న వారిని ఇంటర్వ్యూ చేస్తి తన యూట్యూబ్ చానెల్ లో పోస్టు చేస్తున్నాడు. అతని పేరు గుర్మీత్ గోయత్ అలియాస్ గోల్డీ గోయత్.

 రాష్ట్రంలో పవర్ ఫుల్ చౌతాలా కుటుంబానికి చెందిన దుష్యంత్ చౌతాలా (జెజెపి5)ను ఆ మధ్య ఇంటర్వ్యూ చేస్తే, దాదాపు రెండులక్షల వ్యూస్ వచ్చాయి.

దేశంలో ఇపుడు గోయతే  యంగెస్టు జర్నలిస్టు.  జర్నలిస్టుగా ఇపుడే జీవితం ప్రారంభించినా గోయత్ కు చాలా పెద్ద గోలే ఉంది.

2034 దాకా జర్నలిజంలో ఉండి  ఆ తర్వాత  రాజకీయాల్లోకి రావాలనే పెద్ద ప్లాన్ వేసుకున్నాడు.  తనకి రాజకీయాల్లోకి రావాలన్న కోరిక ఉందని, ఇండిపెండెంటుగా పోటీ చేయాలనుకుంటున్నానని మీడియాకు చెప్పాడు.

గోయత్ హర్యానాలోని జింద్ ప్రాంతానికి చెందినవాడు. అనేక మంది పొలిటిక్ సెలెబ్రీటీలను ఇంటర్వ్యూ చేసినా ఎవరి  ప్రభావానికి లోనుకాకకుండా ఉండటం గోయత్  ప్రత్యేకత.

తన యూట్యూబ్ చానెల్ తో గోయత్ సోషల్ మీడియా స్టార్ అయిపోయాడు. ఆ మధ్య ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ వస్తే ఆయనను కూడా ఇంటర్వ్యూ చేశాడు.ఈ ఏడాది జనవరి నుంచి తన యు ట్యూ బ్ ఛానెల్ లో 100 ఇంటర్వ్యూలు   పోస్టు చేసి సంచలనం సృ శ్టించాడు.