టిపిసిసి అధ్యక్షుడిగా ఎవరు సమర్థులు? : జగ్గారెడ్డి సూచనలు

తెలంగాణ పిసిసి అధ్యక్షుడి ఎవరిని నియమించాలనే దాని మీద సంగారెడ్డి ఎమ్మెల్యే  జగ్గారెడ్డి కొన్ని సూచనలు చేశారు. ప్రాంతీయపార్టీల్లో ఒకరే స్టార్ లని, కాంగ్రెస్ పార్టీ  మల్టీ స్టారర్ పార్టీ అని ఆయన వర్ణించారు. అందుకే ఏ విధంగా తీసుకున్న ఈ పదవికి సమర్థులు డజన్ల కొద్ది ఉన్నారని ఆయన అభిప్రాయపడ్డారు. ఇపుడు పిసిసి అధ్యక్ష పదవిరేసులో ఉన్న వాళ్లలో ఎవరెవరు సమర్థులో ఆయన చెప్పారు.

మాజీ రాజ్యసభ సభ్యుడు వి హనుమంతరావు గురించి చెబుతూ ఆయన పార్టీకి అసమాన లాయలిస్టు అని వర్ణించారు.  హైకమాండ్ బీసీ లకు పీసీసీ చీఫ్ పదవి ఇవ్వాలనుకుంటే  హనుమంతరావు సమర్థుడు. విహెచ్  పీసీసీ పదవి అడగడం లో తప్పు లేదు ఆయన అర్హుడే.అధిష్టానం విహెచ్ కి పీసీసీ ఇస్తే సహకరిస్తాం అని చెప్పారు. బిసిలలో ఆయన స్టార్ అని జగ్గారెడ్డి అన్నారు.

ఇదే ఎస్ సిలలో ఎవరికైనా అంటే మాదిగలకు పీసీసీ ఇవ్వాలనుకుంటే దామోదర రాజనర్సింహ కు పీసీసీ ఇవ్వాలి జగ్గారెడ్డి చెప్పారు.

రెడ్డి కులస్థులలో  పీసీసీ పదవి ఆశిస్తున్న వారంతా సమర్థులే నని వారిలో ఎవరికి ఇచ్చినా పర్వాలేదని ఆయన అన్నారు.

తన యోగత్యల గురించి చెబుతూ,  మొదటి సారి 2004 కాంగ్రెస్, టి ఆర్ ఎస్   అలెయిన్స్ లో గెలిచానని, 2009 కాంగ్రెస్ ఎమ్మెల్యే గానే గెలిచానని  ఆయ చెప్పారు. ‘2018 లో కూడా కాంగ్రెస్ ఎమ్మెల్యే గానే గెలిచాను.
చట్ట సభ లలో వచ్చినప్పటి నుండి కాంగ్రెస్ వాది గానే ఉన్నాను,’అని ఆయన చెప్పారు.