కలెక్టర్ వీరపాండ్యన్ కు 2 నెలల జైలు శిక్ష

విజయవాడ మాజీ కమీషనర్ , ప్రస్తుత అనంతపురం కలెక్టర్ వీరపాండ్యన్ కు కోర్టు ధిక్కరణ కేసులో రెండు నెలల జైలు శిక్ష పడింది. ఇళ్ల కూల్చివేతకు సంబంధించిన ఒక కేసులో కలెక్టర్ కోర్టును తప్పు దోవపట్టించారని చెబుతూ జైలు శిక్షతో పాటూ ఆయనకు హైకోర్టు  రు 2000 జరిమానా కూడా  విధించింది.  ఇదే కేసులో కృష్ణ లంక సీఐ చంద్రశేఖర్ కు నెలరోజులు జైలు శిక్ష కూడా న్యాయస్థానంవిధించింది. ముందు ముందు జాగ్రత్తగా వ్యవహరించాలని కూడా కోర్టు హెచ్చరించింది.కేసు వేసిన  ఇద్దరు పిటీషనర్లకు సొంతంగా చెరోలక్ష చెల్లించాలని  వీరపాండ్యన్ కు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. కృష్ణ పుష్కరాల కోసం విజయవాడలో భారీగా రోడ్ల విస్తరణ చేయడంతో పాటు పేదల ఇళ్ల ను పెద్ద ఎత్తున కూల్చే శే కార్యక్రమానికి విజయవాడ కమిషనర్ గా ఉన్న పాండ్యన్ నాయకత్వం వహించారు.  పుష్కరఘాట్ నిర్మాణం కోసం సందర్భంగా గా తమ ఇళ్ళు  కూల్చేస్తున్నారని, తమ నీడ పోతుందని చెబుతూ   కూల్చి వేత ఆపాలని గతంలో ఇద్దరు హైకోర్ట్ లో పిటిషన్ వేశారు. కూల్చివేయెద్దంటూ హైకోర్టు ఆదేశాలిచ్చినా కలెక్టర్   ధిక్కరించి కూల్చేశారు. అయితే, కూల్చేశాక కోర్టు ఉత్తర్వులొచ్చాయని కలెక్టర్ వాదించారు. దీని మీద విచారణ జరిగింది. కలెక్టర్ చెబుతున్నది అవాస్తవమని ఉత్తర్వులిచ్చాకే కూల్చారని తేలింది. హైకోర్ట్ సీరియస్ అయింది. దీనిని కోర్టు ధిక్కరణ గా భావించి, తీవ్రంగా మందలిస్తూ ఆయనకు ఈ శిక్ష విధించింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *