ప్రపంచంలోని ధనవంతుల్లో ఫోర్డ్ కుటుంబం ఒకటి. ఫోర్డ్ మోటార్స్ కు యజమాని అయిన ఈ కుటుంబానినికి వారసుడు ఆల్ ఫ్రెడ్ బ్రస్ పోర్డ్. ఆయన కృష్ణ భక్తుడు (దిగువఫోటో).
ప్రపంచంలోనే పెద్దదేవాలయంగా నిలబడే ఒక హిందూ దేవాలయాన్ని ఆయన పశ్చిమ బెంగాల్ మాయాపూర్ వద్ద నిర్మిస్తున్నాడు.
ఆయన 1975లొ ఇస్కాన్ (International Society for Krishna Consciousness-ISKCON) లో చేరారు. స్వామి భక్తి వేదాంత ప్రభుపాద ఫోర్డ్ కు అంబరీష దాస్ అని నామకరణం చేశారు.
అయితే, ఇస్కాన్ ఉద్యమంలో చేరినా ఆయన ఒక వైపు వ్యాపారాన్ని మరొక ఆధ్యాత్మిక జీవితాన్ని ప్రాక్టీస్ చేస్తూ వస్తున్నారు. అంబరీష్ అనేది కృష్ణ భక్తుడయిన ఒక రాజు పేరు.
ఇస్కాన్ లో చేరినప్పటినుంచి ఆయన హిందూ ఆలయాల నిర్మాణానికి, మ్యూజియంల నిర్వహణకు భారీ విరాళాలు ఇస్తూనే ఉన్నారు. ఇపుడు మాయాపూర్ ఆలయ నిర్మాణం ఇందులో పరాకాష్ట. దీని పేరు వేదిక్ ప్లానెటేరియం (Temple of Vedic Planetarium). భగవద్గీతలో చూపిన విశ్వరూపం ఇందులో ఏర్పాటుచేస్తారు. హావాయ్ లో మొదటి హిందూ ఆలయాన్ని నిర్మించేందుకు ఆయన స్వామి ప్రభుపాదకు సహకరించారు. తర్వాత డెట్రాయిట్ లో భక్తి వేదాంత కల్చర్ సెంటర్ ఏర్పాటుచేశారు. తర్వాత ఆక్స్ పోర్డ్ యూనివర్శిటీలో ఆక్సోఫోర్డ్ సెంటర్ ఫర్ హిందూ స్టడీస్ కూడా ఏర్పాటుచేసేందుకు సహకరించారు.
మయాపూర్ ఆలయం 2020 నాటికి పూర్తయి ప్రార్థనలకు సిద్ధమవుతుందని అంచనా.
ఆరులక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఈ ఆలయం నిర్మిస్తున్నారు. నిర్మాణం పూర్తయితే ఇది సెయింట్ పాల్ చర్చికంటే, తాజ్ మహల్ కంటే పెద్దదవుతుంది.
ఇందులో ఒక ఐమాక్స్ ధియోటర్, స్వామి ప్రభుపాద జీవిత చరిత్ర ప్రదర్శించే ప్రాంగణం కూడా ఉంటాయి. పార్కులతో, ప్లాజాలతో, లగ్జరీ హోటళ్లతో, కాలేజీలతో, భారీ అపార్ట్ మెంట్ కాంప్లెక్స్ లతో ఇదొక అధ్యాత్మిక డిస్నీలాండ్ గా తయారవుతుందని చాలా మంది భావిస్తున్నారు. ఫోర్డ్ గురువు ఆచార్య కర్ణారవింద ప్రభుపాద భక్తి వేదాంత స్వామి యే ఇస్కాన్ ఉద్యమాన్ని(1966) స్థాపించారు. స్వామీజీ 1977 లో చనిపోయారు.
అప్పటికే ఆయన తన జీవితధ్యేమయిన ఈ ఆలయం ఎలా ఉండాలనే దాని మీద ఫోర్డ్ కు సూచనలిచ్చి ఉన్నారు. ఆ సూచనలమేరకే ఇపుడు ఆలయ నిర్మాణం జరుగుతూ ఉంది. తన భాగమే కాకుండా ప్రపంచమంతా తిరిగి ఆయన ఈ ఆలయ నిర్మాణానికి విరాళాలు సేకరిస్తున్నారు.
ఆయన రోజూ 1728 సార్లు కృష్ణ మంత్రం జపిస్తారు.
శుక్రవారం నాడు ఆయన హైదరాబాద్ వస్తున్నారు. మీడియా వారిని కలుస్తున్నారు.